OnePlus 12R is effectively selling
Amazon Black Friday Sale : కొత్త స్మార్ట్‌ఫోన్ కోసం చూస్తున్నారా? ప్రస్తుతం వన్‌ప్లస్ 12ఆర్ ఫోన్ భారీ తగ్గింపు ఆఫర్‌తో అందుబాటులో ఉంది. ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ ప్లాట్‌ఫారమ్‌లో బ్లాక్ ఫ్రైడే సేల్ కొనసాగుతోంది. అనేక ఫోన్‌లపై డిస్కౌంట్లను అందిస్తోంది. అందులో ఒకటి వన్‌ప్లస్ 12ఆర్ ఫోన్. ఈ ఏడాది ప్రారంభంలో వన్‌ప్లస్ 12 ఫోన్ లాంచ్ అయింది. ఈ డివైజ్ పాతది అయినప్పటికీ, సరసమైన ధరలో అద్భుతమైన పర్ఫార్మెన్స్ అందిస్తుంది. ఈ ఫోన్‌కు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
అమెజాన్ బ్లాక్ ఫ్రైడే సేల్ సమయంలో వన్‌ప్లస్ 12ఆర్ ఫోన్ రూ. 35,999 ధరతో వస్తుంది. ఈ ప్రీమియం హ్యాండ్‌సెట్‌ను రూ. 39,999గా ప్రకటించారు. ఎలాంటి నిబంధనలు, షరతులు లేకుండా ఫోన్ రూ.4వేల తగ్గింపును పొందింది. వన్‌కార్డు క్రెడిట్ కార్డ్, ఆర్బీఎల్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్, ఫెడరియల్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌పై రూ. 3వేల అదనపు తగ్గింపు పొందవచ్చు. తద్వారా రూ.32,999 ధరకు కొనుగోలు చేయొచ్చు.
వన్‌ప్లస్ 12ఆర్ ఫోన్ ఫ్లాగ్‌షిప్ స్నాప్‌డ్రాగన్ 8 జనరేషన్ 2 చిప్‌సెట్‌ను కలిగి ఉంది. వన్‌ప్లస్ మిడ్-రేంజ్ ప్రీమియం ఫోన్‌లను రూ. 35వేల కన్నా తక్కువ ధరకు విక్రయించవచ్చు. మెరుగైన ఫీచర్లు, హై కాంపోనెంట్ ధర, ఇతర కారణాల వల్ల ఇప్పుడు ఆర్ సిరీస్ ధర రూ. 40వేలు ఉంటుంది. వన్‌ప్లస్ 12ఆర్ సిరీస్ దాదాపు రూ. 33వేల వద్ద అమ్మవచ్చు. ఈ డివైజ్ తక్కువ ధర వద్ద కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తున్న వారికి మంచి డీల్ అని చెప్పవచ్చు. మీ పాత డివైజ్ ఎక్స్ఛేంజ్ చేసుకుంటే.. రూ. 27,550 వరకు డిస్కౌంట్ ఆఫర్ కూడా పొందవచ్చు. అయితే, మీ పాత ఫోన్ వర్కింగ్ కండిషన్ ఆధారంగా ఎక్స్చేంజ్ వాల్యూ ఉంటుందని గుర్తుంచుకోవాలి.
భారత మార్కెట్లో వన్‌ప్లస్ 12ఆర్ రూ. 40వేల లోపు ధరలో బెస్ట్ ఫోన్. ఈ ఫోన్ భారీ 6.78-అంగుళాల 120Hz అమోల్డ్ ప్యానెల్‌ను కలిగి ఉంది. 4వ జనరేషన్ ఎల్‌టీపీఓ టెక్నాలజీకి సపోర్టుతో వస్తుంది. ఈ ఫోన్ ఆటోమాటిక్‌గా 1Hz నుంచి 120Hz మధ్య స్క్రీన్ రిఫ్రెష్ రేట్‌ను అడ్జెస్ట్ చేస్తుంది. వన్‌ప్లస్ గరిష్ట ప్రకాశంతో 4,500నిట్స్‌కు సపోర్టును అందించింది. సూర్యకాంతిలో కూడా డిస్‌ప్లే కంటెంట్ సరిగ్గా కనిపిస్తుంది. మెటల్ అల్యూమినియం ఫ్రేమ్‌తో ప్రీమియం క్వాలిటీని మెరుగుపరుస్తుంది.
తడిగా ఉన్నప్పుడు కూడా వినియోగానికి ఆక్వా టచ్ టెక్నాలజీకి సపోర్టు అందిస్తుంది. హుడ్ కింద గత ఏడాదిలో ఫ్లాగ్‌షిప్ స్నాప్‌డ్రాగన్ 8 జనరేషన్ 2 ఉంది. చాలా పవర్‌ఫుల్ గుడ్ గేమింగ్ పర్ఫార్మెన్స్ అందిస్తుంది. ఈ ఫోన్ పెద్ద 5,500mAh బ్యాటరీని కూడా కలిగి ఉంది. వన్‌ప్లస్ ఇతర పెద్ద టెక్ బ్రాండ్‌ల మాదిరిగా కాకుండా బాక్స్‌లో ఫాస్ట్ ఛార్జర్‌ను కూడా అందిస్తుంది. లాంగ్ టైమ్ సాఫ్ట్‌వేర్ సపోర్టు, బెస్ట్ కెమెరా పర్ఫార్మెన్స్, ఐపీ64 రేటింగ్ రూ. 40వేల లోపు ఫోన్‌ను కొనుగోలు చేసే యూజర్లకు అద్భుతమైన డీల్ అందిస్తుంది.
Read Also : Apple iPhone 15 Pro : ఆపిల్ ఐఫోన్ 15ప్రోపై బిగ్ డిస్కౌంట్.. ఈ డీల్ ఎలా పొందాలంటే?