OnePlus 13R : వారెవ్వా.. ఆఫర్ కేక.. వన్‌ప్లస్ 13R ఫోన్ అతి తక్కువ ధరకే.. అమెజాన్‌లో ఇలా కొన్నారంటే?

OnePlus 13R : వన్‌ప్లస్ 13R అతి తక్కువ ధరకే లభిస్తోంది. అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ 2025 సేల్ లో భారీ తగ్గింపు ధరకే కొనుగోలు చేయొచ్చు.

OnePlus 13R

OnePlus 13R : కొత్త స్మార్ట్‌ఫోన్ కోసం చూస్తున్నారా? వన్‌ప్లస్ అభిమానులకు పండగే.. అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ 2025 ప్రారంభమైంది. ఈ సేల్ సందర్భంగా అనేక రకాల ప్రొడక్టులపై భారీ డిస్కౌంట్లను ఆఫర్ చేస్తోంది. మీరు కొత్త వన్‌ప్లస్ ఫోన్ కొనేందుకు ఇదే సరైన సమయం.

అనేక స్మార్ట్‌ఫోన్లపై అద్భుతమైన ఆఫర్లు కూడా అందుబాటులో ఉన్నాయి. ఇందులో వన్‌‌ప్లస్ 13R ఫోన్‌పై ఖతర్నాక్ డిస్కౌంట్ అందిస్తోంది. ఈ సేల్ సందర్భంగా రూ. 37వేల లోపు ధరకే సొంతం చేసుకోవచ్చు. వన్‌‌ప్లస్ 13R డీల్ ఎలా పొందాలో ఇప్పుడు చూద్దాం..

వన్‌ప్లస్ 13R అమెజాన్ డీల్ :
భారత మార్కెట్లో వన్‌ప్లస్ 13R ఫోన్ రూ.42,999 ప్రారంభ ధరకు లాంచ్ అయింది. ప్రస్తుతం ఈ స్మార్ట్‌ఫోన్ అమెజాన్‌లో రూ.39,999కి లిస్ట్ అయింది. ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్ వన్‌ప్లస్ 13Rపై రూ.3వేలు ఫ్లాట్ డిస్కౌంట్‌ను అందిస్తోంది. ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ ద్వారా పేమెంట్ చేసేటప్పుడు అదనంగా రూ.3వేలు తగ్గింపు పొందవచ్చు. మీ పాత స్మార్ట్‌ఫోన్‌ ట్రేడ్ చేస్తే మరింత తగ్గింపు పొందవచ్చు.

Read Also : UPI PIN : యూపీఐ యూజర్లకు పండగే.. ఇకపై PINతో పనిలేదు.. ఇలా ఈజీగా పేమెంట్లు చేయొచ్చు..!

వన్‌ప్లస్ 13R స్పెసిఫికేషన్లు, ఫీచర్లు :
వన్‌ప్లస్ 13R 5G ఫోన్ 6.78-అంగుళాల 1.5K LTPO అమోల్డ్ డిస్‌ప్లేను 120Hz రిఫ్రెష్ రేట్, 4,500 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో కలిగి ఉంది. డిస్‌ప్లే కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7i ద్వారా ప్రొటెక్షన్ అందిస్తుంది. ఫొటోగ్రఫీ విషయానికి వస్తే.. వన్‌ప్లస్ 13R 50MP ప్రైమరీ కెమెరాతో పాటు 8MP అల్ట్రా-వైడ్ సెన్సార్, 50MP టెలిఫోటో లెన్స్‌ను కలిగి ఉంది. ఫ్రంట్ సైడ్ ఫోన్ సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 16MP కెమెరాను కూడా ఉంది.

వన్‌ప్లస్ 13R స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 ప్రాసెసర్‌తో వస్తుంది. 16GB వరకు LPDDR5x ర్యామ్, 512GB UFS 4.0తో వస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ 80W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 6,000mAh బ్యాటరీతో సపోర్టు ఇస్తుంది. వన్‌ప్లస్ 13R ఫోన్ IP65 సర్టిఫికేషన్‌తో వస్తుంది. అలాగే, అక్వా టచ్ 2.0 అనే ఫీచర్ కూడా ఉంది. ఫోన్ తడిగా ఉన్నప్పుడు కూడా స్క్రీన్ ఈజీగా రెస్పాండ్ అవుతుంది. గ్లోవ్ మోడ్ ఫీచర్ కూడా ఆకట్టుకునేలా ఉంది.