UPI PIN : యూపీఐ యూజర్లకు పండగే.. ఇకపై PINతో పనిలేదు.. ఇలా ఈజీగా పేమెంట్లు చేయొచ్చు..!

UPI PIN : యూపీఐ యూజర్ల కోసం NPCI అతి త్వరలో కొత్త పేమెంట్ విధానాన్ని తీసుకొస్తోంది. పిన్ లేకుండానే యూపీఐ పేమెంట్లను వేగంగా చేసుకోవచ్చు.

UPI PIN : యూపీఐ యూజర్లకు పండగే.. ఇకపై PINతో పనిలేదు.. ఇలా ఈజీగా పేమెంట్లు చేయొచ్చు..!

UPI Payments

Updated On : July 31, 2025 / 5:33 PM IST

UPI PIN : యూపీఐ యూజర్లకు బిగ్ అప్‌డేట్.. అతి త్వరలో యూపీఐ పేమెంట్లు పిన్ లేకుండా చేయొచ్చు. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) యూపీఐ పేమెంట్ల కోసం బయోమెట్రిక్ అథెంటికేషన్ తీసుకురానుంది.

ఈ కొత్త అథెంటికేషన్ ప్రక్రియ ద్వారా యూపీఐ యూజర్లు పిన్‌లకు బదులుగా ఫింగర్ ఫ్రింట్ లేదా ఫేస్ ఐడెంటిటీని ఉపయోగించి లావాదేవీలను అథెంటికేషన్ పూర్తి చేయొచ్చు. ప్రస్తుతం భారతీయ మార్కెట్లో యూపీఐ పేమెంట్లకు ఫుల్ డిమాండ్ పెరిగింది.

ప్రతిఒక్కరూ యూపీఐ పేమెంట్లనే ఎక్కువగా వాడేస్తున్నారు. టీ తాగడం దగ్గర నుంచి కిరాణా సామాగ్రి తీసుకోవడం వరకు అన్ని డిజిటల్ పేమెంట్లపైనే ఎక్కువగా ఆధారపడుతున్నారు. అతి త్వరలో యూపీఐ పేమెంట్లు మరింత ఈజీగా మారనున్నాయి. మీ యూపీఐ పిన్‌ను ఎంటర్ చేయకుండానే పేమెంట్లను చేయొచ్చు.

పిన్ కాదు.. ఫింగర్ ఫ్రింట్, ఫేస్ ఐడీలతో పేమెంట్లు :
నివేదిక ప్రకారం.. యూపీఐ పిన్ బదులుగా ఫింగర్ ఫ్రింట్ లేదా ఫేస్ ఐడెంటిటీ వంటి బయోమెట్రిక్ మెథడ్స్ ఉపయోగించి పేమెంట్లను అథెంటికేట్ చేయొచ్చు. అతి త్వరలో ఈ కొత్త విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చేందుకు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) ప్రయత్నిస్తోంది.

Read Also : Reliance JioPC : రిలయన్స్ కొత్త JioPC సర్వీసు.. మీ టీవీని డెస్క్‌టాప్ కంప్యూటర్‌గా మార్చేయొచ్చు.. ఫీచర్లు, ధర, ప్లాన్లు ఇవే..!

ప్రస్తుతం, Google Pay, PhonePe, Paytm, BHIM వంటి యాప్‌లు లావాదేవీలకు ముందు 4 లేదా 6 అంకెల పిన్‌ను ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇదో సెక్యూరిటీ లేయర్. కానీ, మీ ఫింగర్ ఫ్రింట్ లేదా ఫేస్ ఐడీతో మరింత సురక్షితంగా వేగంగా ఉంటుంది. రాబోయే రోజుల్లో ఈ కొత్త సెక్యూరిటీ లేయర్ అదనపు ఫీచర్ అందించనుంది.

పేమెంట్లపై యూజర్లదే ఛాయిస్ :
నివేదికలను పరిశీలిస్తే.. బయోమెట్రిక్ అనేది కేవలం ఆప్షనల్‌గా ఉంటుందని సూచిస్తున్నాయి. అంటే.. తప్పనిసరిగా ఈ ఫీచర్ వాడాల్సిన అవసరం లేదు. యూపీఐ యూజర్ పిన్‌ లేదా ఫేస్/ఫింగర్ ఫ్రింట్ అన్‌లాక్‌కు మారాలా అనే ఎంచుకోవచ్చు. NPCI ఇంకా ఈ కొత్త విధానాన్ని అధికారికంగా ధృవీకరించలేదు.

యూపీఐ పిన్‌లను గుర్తుంచుకోవడం ఇబ్బందిగా భావించే వారికి ప్రయోజనకరంగా ఉంటుంది. అంతేకాకుండా, బయోమెట్రిక్ వెరిఫికేషన్ ఫేక్ లేదా బైపాస్ చేయడం కష్టంగా మారుతుంది. వాస్తవానికి సెక్యూరిటీని కూడా పెంచుతుంది. ఒకవేళ ఇది అమలులోకి వస్తే.. మీ ఫోన్‌ ద్వారా యూపీఐ పేమెంట్లు మరింత ఈజీగా మారతాయి.