Oneplus 13s
Oneplus 13s : వన్ ప్లస్ అభిమానులకు గుడ్ న్యూస్.. అతి త్వరలో వన్‌ప్లస్ 13s భారత మార్కెట్లోకి రాబోతుంది. వన్‌ప్లస్ (Oneplus 13s) లేటెస్ట్ కాంపాక్ట్ ఫ్లాగ్‌షిప్, వన్‌ప్లస్ 13s జూన్ 5న లాంచ్ చేసేందుకు రెడీ అవుతోంది.
Read Also : Redmi Note 14 : అద్భుతమైన డిస్కౌంట్.. ఈ రెడ్‌మి ఫోన్ అతి తక్కువ ధరకే.. ఇలా కొన్నారంటే?
ఈ కొత్త వన్‌ప్లస్ ఫోన్ ఏఐ ఫీచర్లు, ప్లస్ కీతో రానుంది. రాబోయే స్మార్ట్‌ఫోన్ కొత్త క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్ ద్వారా పవర్ అందిస్తుంది. ఇటీవలే చైనాలో రిలీజ్ అయిన వన్‌ప్లస్ 13T రీబ్రాండెడ్ వెర్షన్ మాదిరిగానే ఉండనుంది.
వన్‌ప్లస్ 13s భారత్ లాంచ్ :
వన్‌ప్లస్ 13s ఫోన్ బ్లాక్ వెల్వెట్, పింక్ శాటిన్, గ్రీన్ సిల్క్ అనే 3 కలర్ ఆప్షన్లలో రానుంది. ఈ ఫోన్ వన్‌ప్లస్ 13, వన్‌ప్లస్ 13R మాదిరి ట్రెడేషనల్ సర్కిల్ కెమెరా మాడ్యూల్ కాకుండా కెమెరా ఫ్లాష్‌తో భారీ రెక్టాంగులర్ సెటప్‌ను కలిగి ఉంది. వన్‌ప్లస్ ఫోన్లలో వార్నింగ్ స్లయిడర్‌ను ప్లస్ కీతో రిప్లేస్ చేయనుంది.
ఐఫోన్ మాదిరి కస్టమైజడ్ కీ, రింగ్ ప్రొఫైల్‌లను మార్చడం, కెమెరాను ఎనేబుల్ చేయడం, ట్రాన్స్ లేషన్ ఎనేబుల్, రికార్డింగ్‌లు వంటి వివిధ టాస్కులను పూర్తి చేయగలదు.
అయితే, ఈ కీ స్పెషల్ ఫీచర్ ఏమిటంటే.. వన్‌ప్లస్ ఏఐ ప్లస్ మైండ్‌తో ఆల్ ఆన్-స్క్రీన్ కంటెంట్‌ను ఫ్యూచర్ రిఫరెన్స్ కోసం అందిస్తుంది.
ఏఐ ఫీచర్లు ఇవే :
వన్‌ప్లస్ 13s ఫోన్ ఏఐ వాయిస్‌స్క్రైబ్, ఏఐ ట్రాన్స్‌లేషన్, ఏఐ సెర్చ్, ఏఐ రీఫ్రేమ్, ఏఐ బెస్ట్ ఫేస్ 2.0 వంటి కొత్త ఏఐ ఫీచర్ల సూట్‌ను తీసుకువస్తోంది. వన్‌ప్లస్ నోట్స్, క్లాక్ వంటి లోకల్ యాప్‌లు గూగుల్ ఏఐ అసిస్టెంట్‌తో సపోర్టు చేసేలా జెమినితో ఇంటిగ్రేషన్‌ను కూడా ఉంటుందని కంపెనీ తెలిపింది.
ఇతర స్పెషిఫికేషన్ల విషయానికొస్తే.. వన్‌ప్లస్ 13s సెల్ఫీ షూటర్ మినహాయించి వన్‌ప్లస్ 13T మాదిరిగానే ఫీచర్లను కలిగి ఉండే అవకాశం ఉంది. చైనీస్ వేరియంట్‌లో 16MP షూటర్‌కు బదులుగా 32MP ఆటో-ఫోకస్ షూటర్ ఉండవచ్చు.
రీబ్రాండెడ్ వన్‌ప్లస్ 13Tగా మారితే 6.32-అంగుళాల డిస్‌ప్లేతో రావచ్చు. లీక్‌ల ప్రకారం.. 120Hz రిఫ్రెష్ రేట్, 1600 నిట్స్ గరిష్ట బ్రైట్‌నెస్‌తో 1.5K 8T LTPO అమోల్డ్ ప్యానెల్ కావచ్చునని సూచిస్తున్నాయి. ఈ ఫోన్ LPDDR5x ర్యామ్, UFS 4.0 స్టోరేజ్‌కు కూడా సపోర్టు ఇవ్వవచ్చు.
వన్‌ప్లస్ 13sలో ఆప్టికల్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉండవచ్చు. ఈ ఫోన్ IP65 వాటర్, డస్ట్ నిరోధక రేటింగ్ కలిగి ఉండవచ్చు.. ఈ ఏడాది లాంచ్ అయిన ఇతర వన్‌ప్లస్ ఫోన్‌ల మాదిరిగానే రాబోయే ఫోన్ ఆండ్రాయిడ్ 15 ఆధారిత OxygenOS 15 తో వస్తుందని భావిస్తున్నారు.
ఆప్టిక్స్ విషయానికొస్తే.. వన్‌ప్లస్ 13s ఫోన్ 50MP IMX906 ప్రైమరీ సెటప్‌తో OIS, 50MP 2x టెలిఫోటో లెన్స్‌తో డ్యూయల్ కెమెరా సెటప్‌తో రావచ్చు.
Read Also : BharatGen : భారత్ ఫస్ట్ ఏఐ మల్టీమోడల్ ‘భారత్‌జెన్’ ప్రారంభం.. 22 స్వదేశీ భాషల్లో కమ్యూనికేట్ చేయగలదు..!
వన్‌ప్లస్ 13s ధర (అంచనా) :
జూన్ 5న కంపెనీ లాంచ్ ఈవెంట్ లో వన్‌ప్లస్ 13s అధికారిక ధర వెల్లడి కానుంది. లీక్‌ల ప్రకారం.. భారత మార్కెట్లో ఈ వన్‌ప్లస్ ఫోన్ ధర రూ. 55వేల వరకు ఉండవచ్చు.