BharatGen : భారత్ ఫస్ట్ ఏఐ మల్టీమోడల్ ‘భారత్‌జెన్’ ప్రారంభం.. 22 స్వదేశీ భాషల్లో కమ్యూనికేట్ చేయగలదు..!

BharatGen : 22 భారతీయ భాషల కోసం మొట్టమొదటి ప్రభుత్వ నిధులతో కూడిన ఏఐ మల్టీమోడల్ LLM భారత్‌జెన్‌ను ప్రారంభించింది.

BharatGen : భారత్ ఫస్ట్ ఏఐ మల్టీమోడల్ ‘భారత్‌జెన్’ ప్రారంభం.. 22 స్వదేశీ భాషల్లో కమ్యూనికేట్ చేయగలదు..!

BharatGen

Updated On : June 3, 2025 / 1:38 PM IST

BharatGen : భారత్ జెన్ (BharatGen) ఏఐ మల్టీ మోడల్ వచ్చేసింది. ప్రత్యేకించి భారతీయ భాషల కోసం దేశీయంగా మొట్టమొదటి స్వదేశీ భాషా పరిజ్ఞానంతో ఈ ఏఐ మల్టీ లాంగ్వేజ్ మోడల్‌ (LLM)ను అభివృద్ధి చేశారు.

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత మల్టీమోడల్ లార్జ్ లాంగ్వేజ్ మోడల్ (LLM)ను కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రి జితేంద్ర సింగ్ ప్రారంభించారు.

Read Also : Post Office Scheme : పోస్టాఫీస్‌లో సూపర్ స్కీమ్.. నెలకు కేవలం రూ. 5వేల పెట్టుబడితో లక్షాధికారి అయిపోవచ్చు..!

ప్రభుత్వ నిధులతో నేషనల్ మిషన్ ఆన్ ఇంటర్ డిసిప్లినరీ సైబర్-ఫిజికల్ సిస్టమ్స్ కింద ఈ ఏఐ మోడల్ డెవలప్ చేశారు. ఐఐటీ బాంబేలో (TIH) ఫౌండేషన్ ఫర్ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (IoT) ఇంటర్నెట్ ఆఫ్ ఎవ్రీథింగ్ (IoE) ద్వారా అమలు చేయనున్నారు.

ఇందులో 4 టెక్నాలజీ ట్రాన్స్‌లేషనల్ రీసెర్చ్ పార్క్‌లు (TTRPs)గా అప్‌గ్రేడ్ అయ్యాయి. భారత్‌లో భాషా, సాంస్కృతికపరంగా భారత్ జెన్ ఏఐ అభివృద్ధిలో విప్లవాత్మక మార్పులు తీసుకురానుందని సింగ్ పేర్కొన్నారు.

ఈ చొరవకు సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగం (DST) సపోర్టు అందిస్తోంది. ప్రముఖ విద్యాసంస్థలు, నిపుణులు, ఆవిష్కర్తల కన్సార్టియంను ఒకచోట చేర్చింది.

‘భారత్ జెన్’ లక్ష్యం ఇదే (BharatGen) :
ఎథికల్, మల్టీలాంగ్వేజ్, భారతీయ విలువలతో ఏఐని రూపొందించడం భారత్ జెన్ జాతీయ లక్ష్యమని సింగ్ అన్నారు. ఆరోగ్య సంరక్షణ, విద్య, వ్యవసాయం, పాలన వంటి ముఖ్యమైన రంగాలకు సాధికారత కల్పిస్తుంది.

ప్రతి భారతీయుడి అవసరాలను అర్థం చేసుకుని ప్రాంతీయ నిర్దిష్ట ఏఐ పరిష్కారాలను కూడా అందిస్తుంది. భారత్‌జెన్ ఏఐ ప్లాట్‌ఫామ్ ద్వారా టెక్స్ట్, స్పీచ్, ఇమేజ్‌లతో సహా ఇన్‌పుట్‌లను అందించవచ్చు. 22 భారతీయ భాషలలో ఏఐకి సంబంధించి పూర్తి డేటాను అందిస్తుంది.

Read Also : Redmi Note 14 : అద్భుతమైన డిస్కౌంట్.. ఈ రెడ్‌మి ఫోన్ అతి తక్కువ ధరకే.. ఇలా కొన్నారంటే?

సర్వం M మోడల్ ప్రారంభం :
ఏఐ స్టార్టప్ సర్వం ఏఐ స్వదేశీ LLM, సర్వం-M మోడల్ ఇటీవలే ప్రారంభించింది. దేశవ్యాప్తంగా స్టార్టప్‌ కంపెనీల నుంచి పోటీ ఎదురుకాగా భారత ఫస్ట్ ఏఐ ఫౌండేషన్ మోడల్‌ను అభివృద్ధి చేసేందుకు సర్వం ఏఐ ఎంపికైందని ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రి అశ్విని వైష్ణవ్ ఇదివరకే ప్రకటించారు.

అయితే, కంపెనీ మోడల్ అభివృద్ధిని పూర్తి చేసేందుకు 6 నెలల గడువు కోరిందని సర్వం ఏఐ వ్యవస్థాపకుడు వివేక్ రాఘవన్ పేర్కొన్నారు.