OnePlus 15R Launch : భారత్‌కు కొత్త వన్‌ప్లస్ 15R వచ్చేస్తోందోచ్.. ధర, స్పెషిఫికేషన్లపై భారీ అంచనాలివే.. ఫుల్ డిటెయిల్స్!

OnePlus 15R Launch : ఫ్లాగ్‌షిప్ వన్‌ప్లస్ 15R ఫోన్ వచ్చేస్తోంది. వన్‌ప్లస్ 15ఆర్ ఫీచర్లు, స్పెషిఫికేషన్ల వివరాలు ఇలా ఉన్నాయి.

OnePlus 15R Launch : భారత్‌కు కొత్త వన్‌ప్లస్ 15R వచ్చేస్తోందోచ్.. ధర, స్పెషిఫికేషన్లపై భారీ అంచనాలివే.. ఫుల్ డిటెయిల్స్!

OnePlus 15R Launch

Updated On : October 25, 2025 / 3:28 PM IST

OnePlus 15R Launch : చైనీస్ స్మార్ట్‌ఫోన్ దిగ్గజం వన్‌ప్లస్ నెక్స్ట్ ఫ్లాగ్‌షిప్ లైనప్ వన్‌ప్లస్ 15 సిరీస్‌ను లాంచ్ చేసేందుకు రెడీ అవుతోంది. ఇందులో వన్‌ప్లస్ 15, వన్‌ప్లస్ 15R ఉన్నాయి. చైనాలో వన్‌ప్లస్ ఏస్ 6గా లాంచ్ కానుంది. అధికారిక లాంచ్‌కు ముందే వన్‌ప్లస్ రాబోయే ఫోన్లను టీజ్ చేసింది.

కొత్త డిజైన్, ప్రీమియం మెటీరియల్స్, టాప్-టైర్ పర్ఫార్మెన్స్ అప్‌గ్రేడ్‌లను (OnePlus 15R Launch) వెల్లడిస్తుంది. డిజైన్, స్పెసిఫికేషన్లు, భారత్ లాంచ్ ధరల వరకు వన్‌ప్లస్ 15Rకు సంబంధించి భారీ అంచనాలు నెలకొన్నాయి. అవేంటో ఓసారి లుక్కేయండి.

వన్‌ప్లస్ 15R డిజైన్ :
వన్‌ప్లస్ 15R ఫ్లాగ్‌షిప్ ఫోన్ వన్‌ప్లస్ 15కు అప్‌గ్రేడ్ వెర్షన్. కొత్త కెమెరా మాడ్యూల్‌తో ఆకర్షణీయమైన డిజైన్‌ కలిగి ఉంటుందని భావిస్తున్నారు. ఈ వన్‌ప్లస్ ఫోన్ మెటల్ ఫ్రేమ్‌ కలిగి ఉంటుంది. దాదాపు 213 గ్రాముల బరువు ఉంటుంది. IP66, IP68, IP69, IP69K రేటింగ్‌ కలిగి ఉంటుంది. ఈ వన్‌ప్లస్ ఫోన్ సిల్వర్, వైట్, డార్క్ బ్లూ, బ్లాక్ ఫినిషింగ్ అనే 3 కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంటుందని భావిస్తున్నారు.

Read Also : Oppo Find X8 Pro : సూపర్ ఆఫర్ బ్రో.. ఒప్పో ఫైండ్ X8 ప్రోపై దిమ్మతిరిగే డిస్కౌంట్.. క్రోమాలో ఇలా కొనేసుకోండి!

వన్‌ప్లస్ 15R స్పెసిఫికేషన్లు :
ఈ హ్యాండ్‌సెట్ ఫ్రంట్ సైడ్ 1.5K రిజల్యూషన్, 165Hz వేరియబుల్ రిఫ్రెష్ రేట్‌తో ఫ్లాట్ అమోల్డ్ డిస్‌ప్లే కలిగి ఉంటుంది. బీఓఈ డిస్‌ప్లేతో వస్తుందని తెలుస్తోంది. అల్ట్రాసోనిక్ ఇన్-డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్, ఐ ప్రొటెక్షన్ ఫీచర్లతో కూడా వస్తుంది. వన్‌ప్లస్ 15R క్వాల్కమ్ లేటెస్ట్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ SoCపై రన్ అయ్యే అవకాశం ఉంది. 16GB వరకు ర్యామ్, ఆండ్రాయిడ్ 16 ఆధారిత కలర్OS 16 బాక్స్ వెలుపల రన్ చేయవచ్చు. ఈ స్మార్ట్‌ఫోన్ 7800mAh బ్యాటరీతో వచ్చే అవకాశం ఉంది. 120W ఫాస్ట్ ఛార్జింగ్‌కు కూడా సపోర్టు ఇస్తుంది.

వన్‌ప్లస్ 15R ధర, లాంచ్ వివరాలు (అంచనా) :
వన్‌ప్లస్ ఏస్ 6 (వన్‌ప్లస్ 15R) అక్టోబర్ 27న లోకల్ టైమ్ ప్రకారం సాయంత్రం 7 గంటలకు (సాయంత్రం 4:30 గంటలకు) చైనాలో లాంచ్ కానుంది. వన్‌ప్లస్ 15 కూడా ఆవిష్కరించనుంది. భారత మార్కెట్లో వన్‌ప్లస్ 15R డిసెంబర్ 2025 మొదటి వారంలో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. ధర విషయానికొస్తే.. ఈ వన్‌ప్లస్ ఫోన్ ముందున్న వన్‌ప్లస్ 13R మాదిరిగానే ఉంటుంది. 12GB + 256GB వేరియంట్ ధర రూ. 42,999కు లాంచ్ అయింది.