Oppo Find X8 Pro : సూపర్ ఆఫర్ బ్రో.. ఒప్పో ఫైండ్ X8 ప్రోపై దిమ్మతిరిగే డిస్కౌంట్.. క్రోమాలో ఇలా కొనేసుకోండి!

Oppo Find X8 Pro : ఒప్పో ఫైండ్ ఎక్స్8 ప్రో ధర తగ్గింది. ఒప్పో ఫైండ్ ఎక్స్9 సిరీస్ లాంచ్‌కు ముందే క్రోమాలో భారీ తగ్గింపు ధరకే లభిస్తోంది.

1/6Oppo Find X8 Pro
Oppo Find X8 Pro : ఒప్పో అభిమానులకు గుడ్ న్యూస్.. వచ్చే నెలలో ఒప్పో నుంచి సరికొత్త ఫోన్ రాబోతుంది. భారత మార్కెట్లో ఒప్పో ఫైండ్ X9 సిరీస్‌ లాంచ్ చేసేందుకు కంపెనీ రెడీ అవుతోంది. కానీ, కొత్త మోడల్స్ రాకముందే ఒప్పో ఫైండ్ X8 ప్రో ఇప్పటికే క్రోమాలో భారీ తగ్గింపుతో లభిస్తోంది.
2/6Oppo Find X8 Pro
మీరు కూడా కొత్త ప్రీమియం స్మార్ట్‌ఫోన్‌ కోసం చూస్తుంటే ఇదే సరైన అవకాశం. ఒప్పో ఫైండ్ X8 ప్రో ఆకట్టుకునే కెమెరాలు, లాంగ్ లైఫ్ బ్యాటరీ, స్టైలిష్ డిజైన్‌తో వస్తుంది. ఈ ఫ్లాగ్‌షిప్ ఫోన్ అన్ని ఫీచర్లతో పాటు ఆఫర్‌కు సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
3/6Oppo Find X8 Pro
ఒప్పో ఫైండ్ X8 ప్రో డీల్ : భారత మార్కెట్లో ఒప్పో ఫైండ్ X8 ప్రో ఫోన్ ధర రూ.99,999కు లాంచ్ అయింది. క్రోమా అధికారిక వెబ్‌సైట్‌లో ఈ ప్రీమియం స్మార్ట్‌ఫోన్ ప్రస్తుతం రూ.86,999కు లిస్ట్ అయింది. రిటైలర్ ఫైండ్ ఎక్స్8 ప్రో ఫోన్‌పై రూ.13వేలు ఫ్లాట్ డిస్కౌంట్‌ అందిస్తోంది.
4/6Oppo Find X8 Pro
ఒప్పో ఫైండ్ X8 ప్రో స్పెసిఫికేషన్లు, ఫీచర్లు : ఒప్పో ఫైండ్ X8 ప్రో ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్, డాల్బీ విజన్ సపోర్ట్, 4,500 నిట్స్ వరకు గరిష్ట బ్రైట్‌నెస్‌తో 6.78-అంగుళాల అమోల్డ్ డిస్‌ప్లే కలిగి ఉంది. ఈ ఒప్పో ఫైండ్ ఫోన్ మీడియాటెక్ డైమన్షిటీ 9400 చిప్‌సెట్, 80W ఫాస్ట్ వైర్డ్ ఛార్జింగ్, 50W వైర్‌లెస్ ఛార్జింగ్‌కు సపోర్టు ఇచ్చే 5,910mAh బ్యాటరీతో వస్తుంది. కెమెరాల విషయానికొస్తే.. ఒప్పో ఫైండ్ X8 ప్రో క్వాడ్ రియర్ సెటప్‌ కలిగి ఉంది.
5/6Oppo Find X8 Pro
ఇందులో 50MP సోనీ LYT808 మెయిన్ సెన్సార్, 3x ఆప్టికల్ జూమ్‌తో 50MP సోనీ LYT600 పెరిస్కోప్ టెలిఫోటో లెన్స్ కలిగి ఉంది.
6/6Oppo Find X8 Pro
అలాగే, 6x ఆప్టికల్ జూమ్‌తో 50MP సోనీ IMX858 సెన్సార్, 120x వరకు డిజిటల్ జూమ్‌తో పాటు 50MP శాంసంగ్ అల్ట్రావైడ్ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 32MP ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా కలిగి ఉంది.