OnePlus Ace 6 Series
వన్‌ప్లస్ నుంచి త్వరలో విడుదల కానున్న Ace 6 సిరీస్ స్మార్ట్‌ఫోన్ల కోసం స్మార్ట్‌ఫోన్ యూజర్లు ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు. భారీ బ్యాటరీ లైఫ్, అత్యంత శక్తిమంతమైన ప్రాసెసర్, చూడగానే ఆకట్టుకునే స్లిమ్ డిజైన్‌తో కూడిన ఓ అల్టిమేట్ ఫోన్ కోసం ఎదురుచూస్తున్న వారికి ఇది మంచి ఆప్షన్ అవుతుందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఆ పూర్తి వివరాలేంటో ఇప్పుడు చూద్దాం..
వన్‌ప్లస్ ఫోన్ల చరిత్రలోనే ఇది అతిపెద్ద బ్యాటరీ
అన్నింటికంటే ముందుగా ఈ సిరీస్‌లో ప్రధాన ఆకర్షణ దాని బ్యాటరీ. వన్‌ప్లస్ ఈ సారి ఏకంగా 7800mAh సామర్థ్యంతో రావడానికి భారీ సిలికాన్ బ్యాటరీని పరీక్షిస్తున్నట్లు సమాచారం. వన్‌ప్లస్ ఫోన్ల చరిత్రలోనే ఇది అతిపెద్ద బ్యాటరీ కావడం విశేషం. అంటే, ఒక్కసారి ఛార్జ్ చేస్తే రోజంతా ఛార్జింగ్ పెట్టుకునే అవసరం రాకపోవచ్చు. ఫోన్‌ను తక్కువగా వాడేవారికి ఆ మరుసటి రోజు కూడా ఛార్జింగ్ అయిపోదు.
ఇంకా అద్భుతమైన విషయం ఏంటంటే, ఈ భారీ బ్యాటరీకి 100W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉండనుంది. దీంతో, బ్యాటరీ ఎంత పెద్దదైనా నిమిషాల్లోనే వేగంగా ఛార్జ్ అవుతుంది. ఇదే సిరీస్‌లోని Ace 6V మోడల్‌లో కాస్త తక్కువగా 5750mAh బ్యాటరీ ఉంటుందని అంచనా. ఇది తేలికపాటి, స్లిమ్ ఫోన్‌ను ఇష్టపడేవారికి బాగా నచ్చుతుంది.
వేగంలో రారాజు
పనితీరు విషయానికొస్తే, Ace 6 మోడల్‌లో శక్తమంతమైన Snapdragon 8 Elite ప్రాసెసర్ ఉండబోతోందని తెలుస్తోంది. ఇకపోతే, సిరీస్‌లోని టాప్ ఎండ్ వేరియంట్ Ace 6 Proలో మరింత పవర్‌ఫుల్ Snapdragon 8 Elite 2 ప్రాసెసర్‌ను అమర్చనున్నారట! హై-ఎండ్ గేమింగ్, 4K వీడియో స్ట్రీమింగ్, మల్టీటాస్కింగ్ వంటివి వెన్నతో పెట్టిన విద్యలా సాగిపోనున్నాయి. ఎలాంటి లాగ్స్ లేకుండా స్మూత్ యూజర్ ఎక్స్‌పీరియన్స్ ఖాయం.
డిజైన్, డిస్‌ప్లే
డిస్‌ప్లే స్పెసిఫికేషన్లపై అధికారిక ప్రకటన వెలువడనప్పటికీ, AMOLED స్క్రీన్ Ace 6 సిరీస్‌లోనూ కొనసాగుతుందని గట్టిగా నమ్మొచ్చు. అద్భుతమైన విజువల్స్, స్మూత్ స్క్రోలింగ్ అనుభూతిని అందిస్తుందనడంలో సందేహం లేదు. ఫోన్ లుక్ అండ్ ఫీల్ కూడా వన్‌ప్లస్ మార్క్ స్టైలిష్‌నెస్‌తో ఆకట్టుకోనుంది.
కెమెరాలో కొత్త అప్‌గ్రేడ్స్?
కెమెరా ఫీచర్లపై వన్‌ప్లస్ ఇంకా ఎలాంటి అధికారిక సమాచారం వెల్లడించలేదు. అయితే, గత Ace 5 సిరీస్ కెమెరా పనితీరును పరిశీలిస్తే, ఈ సారి కూడా అద్భుతమైన సెన్సార్లు, అత్యుత్తమ ఫొటో, వీడియో క్వాలిటీ, మెరుగైన సాఫ్ట్‌వేర్ ట్యూనింగ్‌తో వన్‌ప్లస్ యూజర్లను ఆశ్చర్యపరచడం ఖాయం. ముఖ్యంగా లో-లైట్ ఫొటోగ్రఫీ, పోర్ట్రెయిట్ మోడ్‌లలో మరిన్ని అప్‌గ్రేడ్లతో వస్తుంది.
ఎప్పుడు వస్తుంది?
వన్‌ప్లస్ Ace 6 సిరీస్‌ను 2025 డిసెంబర్ నెలలో తొలుత చైనా మార్కెట్‌లో విడుదల చేసేందుకు కంపెనీ సన్నాహాలు చేస్తోంది. గతంలో చూసిన ట్రెండ్‌ను బట్టి, ఈ సిరీస్ భారత మార్కెట్‌లో OnePlus 14R పేరుతో లాంచ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
మొత్తంమీద, వన్‌ప్లస్ Ace 6 సిరీస్ అంటే భారీ బ్యాటరీ, రాకెట్ వేగంతో పనిచేసే ప్రాసెసర్, కళ్లు చెదిరే డిజైన్‌తో కూడిన ఓ కంప్లీట్ ప్యాకేజీ అని చెప్పొచ్చు. ఈ ఏడాది చివరి నాటికి లేదా వచ్చే ఏడాది ప్రారంభంలో కొత్త ఫోన్ కొనాలని ప్లాన్ చేస్తుంటే, వన్‌ప్లస్ Ace 6 సిరీస్‌ను మీ విష్‌లిస్ట్‌లో తప్పకుండా చేర్చుకోవాల్సిందే.