OnePlus Nord 3 Sale : అమెజాన్ మాన్‌సూన్ మొబైల్ మానియా సేల్.. రూ. 20వేల లోపు ధరకే వన్‌ప్లస్ నార్డ్ 3 సొంతం చేసుకోండి!

OnePlus Nord 3 Sale : అమెజాన్ మాన్‌సూన్ మొబైల్ మానియా సేల్ సమయంలో వన్‌ప్లస్ నార్డ్ 3 ఫోన్ రూ. 20వేల లోపు విక్రయిస్తోంది. ఎందుకంటే.. ఈ 5జీ ఫోన్ రూ. 33,999కి అందుబాటులో ఉంది.

OnePlus Nord 3 Sale : కొత్త ఫోన్ కోసం చూస్తున్నారా? గత ఏడాది జూలైలో లాంచ్ అయిన వన్‌ప్లస్ నార్డ్ 3 ఫోన్ తక్కువ ధరకు అందుబాటులో ఉంది. 2024 మిడ్-రేంజ్ ఫోన్‌లకు సరిపోయే అప్‌గ్రేడ్ వెర్షన్‌ను కంపెనీ లాంచ్ చేస్తోంది. అయితే, పాత మోడల్ ధర కాలక్రమేణా తగ్గుతోంది. అమెజాన్ మాన్‌సూన్ మొబైల్ మానియా సేల్ సమయంలో వన్‌ప్లస్ నార్డ్ 3 ఫోన్ రూ. 20వేల లోపు విక్రయిస్తోంది. ఎందుకంటే.. ఈ 5జీ ఫోన్ రూ. 33,999కి అందుబాటులో ఉంది.

Read Also : iPhone 15 Pro Action Button : ఐఓఎస్ 18 సపోర్టు.. ఆపిల్ ఐఫోన్ 15ప్రో యాక్షన్ బటన్‌లో మరిన్ని ఫీచర్లు..!

రూ. 20వేల లోపు ఇతర ఫోన్‌లతో పోలిస్తే.. తక్కువ ధర విభాగంలో అద్భుతమైన పర్ఫార్మెన్స్ అందిస్తుంది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. బ్రాండ్ అదే ధర రేంజ్‌లో వన్‌ప్లస్ నార్డ్ సీఈ 4 లైట్ అనే కొత్త ఫోన్‌ను రిలీజ్ చేయడానికి సిద్ధమవుతోంది. ఈ జూన్ 24 నుంచి ప్రారంభమవుతుంది. లీక్‌ల ప్రకారం.. కొన్ని ప్రాంతాలలో కొన్ని అప్‌గ్రేడ్‌లతో ఈ ఫోన్ ధర సుమారు రూ. 20వేలుగా ఉంటుందని అంచనా.

ఇప్పుడు, ఈ వన్‌ప్లస్ నార్డ్ 3 డీల్ ఏ ఫోన్‌ను కొనుగోలు చేయాలనే విషయంలో గందరగోళానికి గురిచేస్తుంది. ఈ కొత్త ఫోన్ కంపెనీ సొంత నార్డ్ ఫోన్ నుంచి పోటీని ఎదుర్కొనే అవకాశం ఉంది. ప్రస్తుతానికి, నార్డ్ సీఈ 4 లైట్ పవర్ అందించే చిప్‌సెట్ పేరును వన్‌ప్లస్ వెల్లడించలేదు. క్వాల్‌కామ్ స్నాప్‌‌డ్రాగన్ 695 ఎస్ఓసీని అందిస్తుంది. నిజమని తేలితే.. వన్‌ప్లస్ నార్డ్ 3 బెస్ట్ ఆప్షన్‌గా ఉంటుంది. హుడ్ కింద బెస్ట్ మీడియాటెక్ డైమెన్సిటీ 9000 చిప్‌ను కలిగి ఉంటుంది.

వన్‌ప్లస్ నార్డ్ 3 ఫోన్ ధర ఎంతంటే? :
ప్రస్తుతానికి, వన్‌ప్లస్ నార్డ్ 3 ఫోన్ అమెజాన్‌లో రూ. 19,998 ప్రారంభ ధరతో అందుబాటులో ఉంది. 8జీబీ ర్యామ్+128జీబీ స్టోరేజీతో ఎంపిక చేసిన కార్డులపై అదనంగా 10 శాతం తగ్గింపు కూడా పొందవచ్చు. ఈ ఫోన్ గత ఏడాదిలో రూ. 33,999 ధరకు అందుబాటులోకి వచ్చింది. అమెజాన్ మాన్‌సూన్ మొబైల్ మానియా సేల్ సమయంలో ఈ డీల్ అందుబాటులో ఉంది. ఈ సేల్ జూన్ 25 వరకు కొనసాగుతుంది.

వన్‌ప్లస్ నార్డ్ 3 కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ ప్రొటెక్షన్‌తో 6.74-అంగుళాల అమోల్డ్ ఎఫ్‌హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లేతో వస్తుంది. ప్యానెల్ 120Hz రిఫ్రెష్ రేటుతో పనిచేస్తుంది. 80డబ్ల్యూ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్‌తో 5,000mAhని ప్యాక్ చేస్తుంది. వెనుకవైపు, ఓఐఎస్ సోనీ ఐఎమ్ఎక్స్890తో 50ఎంపీ ప్రధాన కెమెరా, సోనీ ఐఎమ్ఎక్స్355 సెన్సార్‌తో కూడిన 8ఎంపీ అల్ట్రావైడ్ కెమెరా, 2ఎంపీ మాక్రో కెమెరా ఉన్నాయి.

Read Also : Apple iPhone 15 : కొత్త ఐఫోన్ కావాలా భయ్యా.. ఆపిల్ ఐఫోన్ 15పై దిమ్మతిరిగే డిస్కౌంట్.. ఈ డీల్ అసలు వదులుకోవద్దు!

ట్రెండింగ్ వార్తలు