×
Ad

OnePlus Nord 4 Price : ఇది కదా డిస్కౌంట్.. భారీగా తగ్గిన వన్‌ప్లస్ నార్డ్ 4 ఫోన్.. ఫ్లిప్‌కార్ట్‌లో జస్ట్ ఎంతంటే?

OnePlus Nord 4 Price : వన్‌ప్లస్ నార్డ్ 4 ఫోన్ ధర తగ్గింది. ఫ్లిప్‌కార్ట్‌లో రూ. 25వేల ధరకే కొనేసుకోవచ్చు. బ్యాంకు ఆఫర్లతో మరింత తగ్గింపు పొందవచ్చు. ఈ డీల్ ఇలా సొంతం చేసుకోవచ్చు.

OnePlus Nord 4 Price (Image Credit To Original Source)

  • వన్‌ప్లస్ నార్డ్ 4 ఫోన్ ధర రూ.25వేల కన్నా తగ్గింపు
  • 6.74-అంగుళాల 120Hz OLED స్క్రీన్, స్నాప్‌డ్రాగన్ 7+ Gen 3 చిప్‌సెట్‌
  • 100W ఫాస్ట్ ఛార్జింగ్, 50MP డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌, 5,500mAh బ్యాటరీ ప్యాక్
  • బ్యాంక్ ఆఫర్లు, ఎక్స్ఛేంజ్ బెనిఫిట్స్, క్యాష్‌బ్యాక్ డీల్స్‌

OnePlus Nord 4 Price : వన్‌ప్లస్ లవర్స్ కోసం అద్భుతమైన ఆఫర్.. మిడ్ రేంజ్ ఫోన్ కొనాలంటే ఇదే బెస్ట్ టైమ్. ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో వన్‌ప్లస్ నార్డ్ 4 ఫోన్ భారీ తగ్గింపుతో లభిస్తోంది. ఈ ఫోన్ ఒబిసిడియన్ మిడ్ నైట్, మెర్క్యూరియల్ సిల్వర్, ఒయాసిస్ గ్రీన్ వంటి మూడు కలర్ ఆప్షన్లలో వస్తుంది.

ఈ వన్‌ప్లస్ ఫోన్ భారీ డిస్‌ప్లేతో వస్తుంది. స్నాప్‌డ్రాగన్ 7+ జెన్ 3 చిప్ ద్వారా పవర్ పొందుతుంది. ఆప్టిక్స్ పరంగా ఈ వన్‌ప్లస్ 50MP ప్రైమరీ కెమెరా, 8MP అల్ట్రావైడ్ సెన్సార్‌, డ్యూయల్ కెమెరా సెటప్‌తో వస్తుంది. ఇలాంటి డీల్స్ ఎక్కువ రోజులు ఉండవు. మీకు ఇలాంటి ఫోన్ కావాలంటే ఇప్పుడే కొనడం బెటర్. ఫ్లిప్‌కార్ట్‌లో వన్‌ప్లస్ నార్డ్ 4 డీల్ ఎలా పొందాలో చూద్దాం..

అమెజాన్‌లో వన్‌ప్లస్ నార్డ్ 4 ధర :
ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో వన్‌ప్లస్ నార్డ్ 4 ఫోన్ రూ.27,999 ధరకు లిస్ట్ అయింది. అసలు లాంచ్ ధర కన్నా రూ.2వేలు ధర తగ్గింది. అదనంగా, కస్టమర్లు ఫ్లిప్‌కార్ట్ ఎస్బీఐ లేదా ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌తో రూ.4వేలు తగ్గింపు పొందవచ్చు. 5శాతం క్యాష్‌బ్యాక్‌ పొందవచ్చు. తద్వారా వన్‌ప్లస్ నార్డ్ 4 ఫోన్ ధర భారీగా తగ్గుతుంది.

Read Also : Google Pixel 9 Pro : అద్భుతమైన ఆఫర్.. గూగుల్ పిక్సెల్ 9ప్రోపై దిమ్మతిరిగే డిస్కౌంట్.. ఈ క్రేజీ డీల్ డోంట్ మిస్

అంతేకాదు.. మీ పాత ఫోన్ ఎక్స్చేంజ్ చేయాలంటే ఎక్స్ఛేంజ్ ప్రోగ్రామ్‌ కూడా ఎంచుకోవచ్చు. దాంతో రూ.21,300 వరకు తగ్గింపు పొందవచ్చు. అయితే, ఫైనల్ ఎక్స్ఛేంజ్ ధర మీ ఫోన్ బ్రాండ్, మోడల్ వర్కింగ్ కండిషన్‌పై ఆధారపడి ఉంటుంది. ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్ నెలకు కేవలం రూ.985 నుంచి నో-కాస్ట్ ఈఎంఐ ఆప్షన్లను కూడా అందిస్తోంది.

OnePlus Nord 4 Price (Image Credit To Original Source)

వన్‌ప్లస్ నార్డ్ 4 స్పెసిఫికేషన్లు :

వన్‌ప్లస్ నార్డ్ 4 ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.74-అంగుళాల OLED ప్యానెల్‌తో వస్తుంది. టాప్ బ్రైట్‌నెస్ 2,150 నిట్స్ వరకు ఉంటుంది. హుడ్ కింద ఫోన్ స్నాప్‌డ్రాగన్ 7+ జెన్ 3 చిప్ ద్వారా పవర్ పొందుతుంది. 16GB వరకు LPDDR5X ర్యామ్, 512GB వరకు UFS 4.0 స్టోరేజీతో వస్తుంది. బ్యాటరీ పరంగా పరిశీలిస్తే.. ఈ వన్‌ప్లస్ నార్డ్ 4 ఫోన్ 100W ఫాస్ట్ ఛార్జింగ్‌తో 5,500mAh బ్యాటరీని అందిస్తుంది.

కెమెరా విషయానికి వస్తే.. వన్‌ప్లస్ ఫోన్ 50MP ప్రైమరీ కెమెరా, 8MP అల్ట్రావైడ్ సెన్సార్‌, డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌ అందిస్తుంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 16MP ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా కూడా ఉంది.