Google Pixel 9 Pro : అద్భుతమైన ఆఫర్.. గూగుల్ పిక్సెల్ 9ప్రోపై దిమ్మతిరిగే డిస్కౌంట్.. ఈ క్రేజీ డీల్ డోంట్ మిస్

Google Pixel 9 Pro : గూగుల్ పిక్సెల్ 9 ప్రోపై అదిరిపోయే డిస్కౌంట్ అందిస్తోంది. అమెజాన్‌లో ప్రస్తుతం రూ.87,999కే లభిస్తోంది.

Google Pixel 9 Pro : అద్భుతమైన ఆఫర్.. గూగుల్ పిక్సెల్ 9ప్రోపై దిమ్మతిరిగే డిస్కౌంట్.. ఈ క్రేజీ డీల్ డోంట్ మిస్

Google Pixel 9 Pro (Image Credit To Original Source)

Updated On : January 8, 2026 / 10:46 AM IST
  • భారత మార్కెట్లో గూగుల్ పిక్సెల్ 9 ప్రో ప్రారంభ ధర రూ. 1,09,999
  • అమెజాన్‌లో ప్రస్తుతం రూ.87,999కే లిస్టింగ్, ధర రూ.22,000 తగ్గింపు.
  • బ్యాంక్, ఎక్స్ఛేంజ్ ఆఫర్లతో మరింత సేవింగ్

Google Pixel 9 Pro : కొత్త గూగుల్ పిక్సెల్ ఫోన్ కొంటున్నారా? అయితే మీకోసం అద్భుతమైన ఆఫర్. గూగుల్ పిక్సెల్ 9 ప్రో ఫోన్ భారీ తగ్గింపు ధరకే లభిస్తోంది. ప్రస్తుతం అమెజాన్‌లో రూ.25,700 కన్నా భారీ తగ్గింపుతో లభ్యమవుతుంది.

భారత మార్కెట్లో రూ.1,09,999 ధరకు లాంచ్ అయిన పిక్సెల్ 9 ప్రోలో ట్రిపుల్-కెమెరా సెటప్, అమోల్డ్ డిస్‌ప్లే, పిల్-ఆకారపు కెమెరా బార్‌తో గూగుల్ సిగ్నేచర్ పిక్సెల్ డిజైన్ టెన్సర్ చిప్‌సెట్ ఉన్నాయి.

పిక్సెల్ ఫోన్ కొనాలనుకుంటే రూ.84,249 ధరకే ఫోన్‌ ఇంటికి తెచ్చుకోవచ్చు. అమెజాన్‌లో గూగుల్ పిక్సెల్ 9 ప్రో ధర డీల్ ఎలా పొందాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.

గూగుల్ పిక్సెల్ 9 ప్రో ధర తగ్గింపు :
భారత మార్కెట్లో గూగుల్ పిక్సెల్ 9 ప్రో రూ.1,09,999 ప్రారంభ ధరకు లాంచ్ అయింది. అమెజాన్‌లో ఈ స్మార్ట్‌ఫోన్ ప్రస్తుతం రూ.87,999కి లిస్టు అయింది. మీరు ఈ పిక్సెల్ ఫోన్ కొనుగోలు చేస్తే నేరుగా రూ.22వేలు డిస్కౌంట్ పొందవచ్చు.

Read Also : Yamaha R15 Price Cut : యమహా లవర్స్‌కు స్పెషల్ ఆఫర్.. ఈ 3 బైకులపై మైండ్ బ్లోయింగ్ డిస్కౌంట్లు.. ఏది కొంటారో కొనేసుకోండి! 

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ఈఎంఐ లావాదేవీలపై రూ.3,750 అదనపు డిస్కౌంట్ పొందవచ్చు. మీ పాత స్మార్ట్‌ఫోన్‌ను ట్రేడ్ చేయవచ్చు. డివైజ్ మోడల్ వర్కింగ్ బట్టి రూ.43,300 వరకు సేవ్ చేయవచ్చు.

Google Pixel 9 Pro

Google Pixel 9 Pro (Image Credit To Original Source)

గూగుల్ పిక్సెల్ 9 ప్రో స్పెసిఫికేషన్లు ఫీచర్లు :
గూగుల్ పిక్సెల్ 9 ప్రో 120Hz రిఫ్రెష్ రేట్ 3,000 నిట్స్ వరకు పీక్ బ్రైట్‌నెస్‌తో 6.3-అంగుళాల ఎల్టీపీఓ డిస్‌ప్లేతో వస్తుంది. అలాగే, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ 2 ప్రొటెక్షన్‌ అందిస్తుంది.

హుడ్ కింద ఈ పిక్సెల్ ఫోన్ టెన్సర్ G4 చిప్‌సెట్‌తో రన్ అవుతుంది. 16RAM, 256GB స్టోరేజీతో వస్తుంది. ఈ పిక్సెల్ ఫోన్ 45W ఛార్జింగ్ సపోర్ట్‌తో 4,700mAh బ్యాటరీతో సపోర్టు ఇస్తుంది.

కెమెరా ఫీచర్ల పరంగా గూగుల్ పిక్సెల్ 9 ప్రోలో బ్యాక్ సైడ్ ట్రిపుల్ కెమెరా సెటప్‌‌ ఉంది. 50MP మెయిన్ కెమెరా, 48MP అల్ట్రావైడ్ లెన్స్, 5x ఆప్టికల్ జూమ్‌తో 48MP టెలిఫోటో కెమెరా ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 42MP ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా కూడా ఉంది.