OnePlus Open 2 : వన్‌ప్లస్ నుంచి మరో మడతబెట్టే ఫోన్ వచ్చేస్తోంది.. లాంచ్‌టైమ్ లీక్.. ఏయే ఫీచర్లు ఉండొచ్చుంటే?

OnePlus Open 2 Launch : నెక్స్ట్ జనరేషన్ వన్‌ప్లస్ ఓపెన్‌కు వన్‌ప్లస్ ఓపెన్ 2 అనే పేరుతో త్వరలో లాంచ్ కావొచ్చునని లేటెస్ట్ లీక్ డేటా సూచిస్తోంది.

OnePlus Open 2 is coming soon_ Fresh leak reveals launch timeline

OnePlus Open 2 Launch : వన్‌ప్లస్ అభిమానులకు అదిరే న్యూస్.. స్మార్ట్‌ఫోన్ దిగ్గజం వన్‌ప్లస్ నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్ రాబోతోంది. 2023లో వన్‌ప్లస్ ఓపెన్‌ మడతబెట్టే ఫోన్ లాంచ్ చేయగా.. ఫోల్డబుల్ ఫోన్ మార్కెట్‌లో సంచలనం సృష్టించింది. ఒక ఏడాది తర్వాత ఫోల్డబుల్ మోడల్ బలమైన పోటీదారుగా నిలిచింది. కానీ, ఇప్పుడు మరో మడతబెట్టే ఫోన్ గ్లోబల్ మార్కెట్లోకి రాబోతుంది. నెక్స్ట్ జనరేషన్ వన్‌ప్లస్ ఓపెన్‌కు వన్‌ప్లస్ ఓపెన్ 2 అనే పేరుతో త్వరలో లాంచ్ కావొచ్చునని లేటెస్ట్ లీక్ డేటా సూచిస్తోంది.

Read Also : iPhone 13 Price Drop : ఆపిల్ ఐఫోన్ 13 ధర మళ్లీ తగ్గిందోచ్.. ఈ డీల్ అసలు మిస్ చేసుకోవద్దు..!

వన్‌ప్లస్ ఓపెన్ 2 లాంచ్ టైమ్‌లైన్ (అంచనా) :
2025 మొదటి త్రైమాసికంలో వన్‌ప్లస్ ఓపెన్ 2 లాంచ్ కావచ్చునని నివేదిక వెల్లడించింది. ఈ టైమ్‌లైన్ వన్‌ప్లస్ ఫోల్డబుల్ లైనప్ చైనీస్ వెర్షన్ ఒప్పో ఫైండ్ N5 లాంచ్ సమయానికి అనుగుణంగా ఉండవచ్చు. ఒరిజినల్ ఒప్పో ఫైండ్ N3 ప్రపంచవ్యాప్తంగా వన్‌ప్లస్ ఓపెన్‌గా లాంచ్ అయింది. డిజైన్, పర్ఫార్మెన్స్‌కు మంచి ఆదరణ పొందింది. ఇప్పుడు ఒప్పో ఫైండ్ ఎన్5 వస్తోంది. వన్‌ప్లస్ ఓపెన్ 2 కూడా అదే సమయంలో లాంచ్ కావచ్చు. అదే నిజమైతే, 2025 ప్రారంభంలో ఫైండ్ N5, వన్‌ప్లస్ ఓపెన్ 2 ఒకేసారి లాంచ్ అవుతుంది.

వన్‌ప్లస్ ఓపెన్ 2 కెమెరా సిస్టమ్ మార్పులివే :
వన్‌ప్లస్ ఓపెన్ 2 కెమెరా సిస్టమ్‌లో అనేక మార్పులు ఉండే అవకాశం ఉంది. ఒప్పో ఫైండ్ N5లో ఫైండ్ X8 అల్ట్రా నుంచి క్వాడ్-కెమెరా సెటప్‌ను టెస్టింగ్ చేసినట్టుగా నివేదిక పేర్కొంది. అయితే చివరికి ప్రస్తుత ట్రిపుల్-కెమెరా కాన్ఫిగరేషన్‌ను కొనసాగించాలని కంపెనీ నిర్ణయించుకుంది. భారీ క్వాడ్-కెమెరా సిస్టమ్‌ ఉండకపోవచ్చు. అదనపు కెమెరాలతో ఈ ఫోన్ సైజు, బరువు కూడా పెరిగే అవకాశం ఉంది. కొత్త వెర్షన్ పాత కెమెరా సెటప్‌ను కలిగి ఉండవచ్చునని అంటున్నారు. ఒరిజినల్ వన్‌ప్లస్ ఓపెన్ మోడల్ 64ఎంపీ 3ఎక్స్ పెరిస్కోప్ కెమెరాతో సహా ఆకట్టుకునే కెమెరా సెటప్‌ను కలిగి ఉంది.

వన్‌ప్లస్ 13, వన్‌ప్లస్ ఓపెన్ 2 ఏది ఫస్ట్ లాంచ్ కానుంది? :
2025లో ఏ ఫ్లాగ్‌షిప్ వన్‌ప్లస్ ఫస్ట్ లాంచ్ అవుతుంది అనేది అస్పష్టంగానే ఉంది. వన్‌ప్లస్ 13 కూడా 2025 ప్రారంభంలో లాంచ్ అవుతుందని అంచనా. వన్‌ప్లస్ ఓపెన్ 2, వన్‌ప్లస్ 13 రెండింటిలో ఏ ఫోన్ మొదట లాంచ్ అవుతుందో చూడాలి. అయితే, వన్‌ప్లస్ 13 ఈ నెలలో చైనాలో లాంచ్ అవుతుందని ధృవీకరించింది. వచ్చే ఏడాది ప్రారంభంలో భారత మార్కెట్లో లాంచ్ అయ్యే అవకాశం ఉంది.

ప్రస్తుతానికి వన్‌ప్లస్ ఓపెన్ 2 లేదా వన్‌ప్లస్ 13 లాంచ్ తేదీలపై అధికారిక ప్రకటన లేదు. రాబోయే వారాల్లో, చైనా లాంచ్ తర్వాత మరిన్ని వివరాలు వెలువడే అవకాశం ఉంది. లీక్‌ల ప్రకారం.. వన్‌ప్లస్ ఓపెన్ 2 రిలీజ్‌పై ఈ ఏడాది చివరిలో అధికారిక ప్రకటన ఉండే అవకాశం ఉంది. 2025 ప్రారంభంలో వన్‌ప్లస్ ఓపెన్ 2 అందుబాటులో ఉండే అవకాశం ఉంది.

Read Also : iPhone SE 4 Leaks : అత్యాధునిక ఏఐ ఫీచర్లతో ఐఫోన్ ఎస్ఈ 4 వచ్చేస్తోంది.. ఫీచర్ల వివరాలు లీక్.. ఇంకా ఏమి ఉండొచ్చుంటే?