ChatGPT Health (Image Credit To Original Source)
ChatGPT Health : మీరు ChatGPT వాడుతున్నారా? మీకోసం సరికొత్త ఫీచర్ వచ్చేసింది. ప్రముఖ ఓపెన్ఏఐ కంపెనీ ఏఐ టూల్ చాట్‌జీపీటీలో అద్భుతమైన హెల్త్ ఫీచర్ (ChatGPT Health) ప్రవేశపెట్టింది.ఈ కొత్త చాట్‌జీపీటీ హెల్త్ టూల్ యూజర్ల ఆరోగ్య సంబంధిత సమస్యలను ఈజీగా అర్థం చేసుకోగలదు.
తద్వారా మిలియన్ల మంది యూజర్లకు ప్రయోజనకరంగా ఉంటుంది. మెడికల్ రిపోర్టులు, వైద్యుల అపాయింట్‌మెంట్, ఆహారం, వ్యాయామం, హెల్త్ ఇన్సూరెన్స్ సంబంధించిన అన్ని ప్రశ్నలను అడిగి తెలుసుకోవచ్చు.
ప్రస్తుతం ఓపెన్ఏఐ చాట్‌జీపీటీ హెల్త్ ఫీచర్‌ను పైలట్ ప్రాజెక్ట్‌గా ప్రవేశపెట్టింది. ప్రస్తుతం కంపెనీ ఈ ఫీచర్‌ను ఎంపిక చేసిన కొంతమంది యూజర్లకు అందుబాటులోకి తెచ్చింది.
ChatGPT Health (Image Credit To Original Source)
ఓపెన్ఏఐ ప్రకారం.. వినియోగదారులు ఇప్పటికే చాట్‌జీపీటీ ద్వారా హెల్త్ సంబంధిత సమస్యల గురించి ప్రశ్నలు అడుగుతున్నారు. యూజర్ల అవసరాలను తీర్చేందుకు ఈ కొత్త ఫీచర్ అందిస్తోంది. కంపెనీ ప్రకారం.. ఈ సేఫ్టీ ఫీచర్ ఇప్పటికే ఉన్న చాట్‌జీపీటీ యాప్ సేఫ్టీ కన్నా స్ట్రాంగ్ ఉంటుంది.
ఓపెన్ఏఐ కొత్త హెల్త్ ఫీచర్ అత్యంత ముఖ్యమైన ఫీచర్.. హెల్త్‌కు సంబంధించిన కనర్వజేషన్ డేటా మొత్తం చాట్‌బాట్‌లోనే సపరేటుగా యాక్సస్ చేయొచ్చు. పర్సనల్ డేటా లీక్ అయ్యే రిస్క్ ఉండదు. ఈ ఫీచర్ యూజర్ల సేఫ్టీ కోసం మల్టీ లేయర్ సెక్యూరిటీని అందిస్తుందని ఓపెన్ఏఐ పేర్కొంది. ఇందులో వివిధ రకాల ఎన్‌క్రిప్షన్ స్పెషల్ డేటా ఐసోలేషన్ ఉన్నాయి.
ఫిట్‌నెస్ యాప్స్ కూడా యాడ్ చేయొచ్చు :
ఓపెన్ఏఐ యూజర్లకు సంబంధించి హెల్త్ ఎలక్ట్రానిక్ మెడికల్ రికార్డులను అలాగే ఆపిల్ హెల్త్, MyFitnessPal ఇతర హెల్త్ ట్రాకింగ్ యాప్‌లతో సహా ఇతర వెల్‌నెస్, ఫిట్‌నెస్ యాప్‌లను ఇంటిగ్రేట్ చేయొచ్చు.
ఈ యాప్‌ల నుంచి డేటా ఆధారంగా చాట్‌జీపీటీ యూజర్లు తమ ల్యాబ్ రిపోర్టులను అర్థం చేసుకోవచ్చు. డాక్టర్ అపాయింట్‌మెంట్‌లే కాకుండా స్లీప్ యాక్టివిటీ వంటి హెల్త్ మానిటరింగ్ ఆప్షన్లను యాక్సస్ చేయొచ్చు.