Realme 16 Pro Series : వారెవ్వా.. 200MP కెమెరాతో రియల్‌మి 16 ప్రో సిరీస్ ఫస్ట్ సేల్.. ఫీచర్లు చూస్తే ఫిదానే.. ఆఫర్లు, ధర ఎంతంటే?

Realme 16 Pro Series : మీరు కెమెరా-సెంట్రిక్ స్మార్ట్‌ఫోన్ కోసం చూస్తున్నారా? 200MP కెమెరాతో రియల్‌మి లేటెస్ట్ 16 ప్రో సిరీస్ ఫస్ట్ సేల్ మొదలైంది. ఈ సిరీస్‌లో 2 స్మార్ట్‌ఫోన్‌లు భారీ 7000mAh బ్యాటరీతో అందుబాటులో ఉన్నాయి.

Realme 16 Pro Series : వారెవ్వా.. 200MP కెమెరాతో రియల్‌మి 16 ప్రో సిరీస్ ఫస్ట్ సేల్.. ఫీచర్లు చూస్తే ఫిదానే.. ఆఫర్లు, ధర ఎంతంటే?

Realme 16 Pro Series (Image Credit To Original Source)

Updated On : January 9, 2026 / 8:26 PM IST
  • రియల్‌మి 16 ప్రో 5Gలో మీడియాటెక్ డైమెన్సిటీ 7300 మ్యాక్స్ SoC
  • రియల్‌మి 16 ప్రో సిరీస్‌లో 200MP ప్రైమరీ కెమెరా ఆప్షన్
  • భారత్ లో రియల్‌మి 16 ప్రో సిరీస్ ధర, సేల్ ఆఫర్లు
  • రియల్‌మి 16 ప్రో సిరీస్ స్పెసిఫికేషన్లు, ఫీచర్లు ఇవే

Realme 16 Pro Series First Sale : స్మార్ట్‌ఫోన్ కొనుగోలుదారులకు గుడ్ న్యూస్.. మీరు కెమెరా-సెంట్రిక్ స్మార్ట్‌ఫోన్ కోసం చూస్తున్నారా? రియల్‌మి లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్ సిరీస్ రియల్‌మి 16 ప్రో 5G ఫస్ట్ సేల్ మొదలైంది. ఈ సేల్ జనవరి 9న ఫ్లిప్‌కార్ట్‌లో ప్రారంభమైంది. ఈ సిరీస్‌లో రియల్‌మి 16 ప్రో 5G, రియల్‌మి 16 ప్రో ప్లస్ 5G అనే రెండు స్మార్ట్‌ఫోన్లు భారత మార్కెట్లో లాంచ్ అయ్యాయి.

మీరు ఇప్పుడు ఫ్లిప్‌కార్ట్ నుంచి ఈ స్మార్ట్‌ఫోన్‌లను డిస్కౌంట్ ధరకే కొనుగోలు చేయవచ్చు. కెమెరా-సెంట్రిక్ స్మార్ట్‌ఫోన్ కోరుకునేవారికి 200MP కెమెరాలతో రియల్‌మి 16 ప్రో సిరీస్ అద్భుతమైన ఆప్షన్. ఈ రెండు రియల్‌మి ఫోన్లు కూడా భారీ 7000mAh బ్యాటరీతో లభ్యమవుతున్నాయి.  మీరు ఫ్లిప్‌కార్ట్ నుంచి ఈ స్మార్ట్‌ఫోన్‌లను కొనుగోలు చేయొచ్చు.

Read Also : Vivo X200T Launch : వివో లవర్స్‌కు బిగ్ న్యూస్.. కిర్రాక్ ఫీచర్లతో వివో X200T ఫోన్ వస్తోందోచ్.. కీలక ఫీచర్లు లీక్, ధర ఎంత ఉండొచ్చంటే?

ధర విషయానికి వస్తే.. రియల్‌మి 16 ప్రో 5G ఫోన్ రూ.28,999కు లాంచ్ అయింది.   ఈ ధర వద్ద 8GB + 128GB స్టోరేజ్ మోడల్ లభిస్తుంది. 8GB ర్యామ్ + 256GB స్టోరేజ్ మోడల్‌ కొనుగోలు చేస్తే.. మీరు రూ.30,999 ఖర్చు చేయాలి. ఈ వేరియంట్‌లో 12GB + 256GB మోడల్‌ ధర రూ.33,999కు పొందవచ్చు.

రియల్‌మి 16 ప్రో ప్లస్ 5Gలో 8GB+128GB,  8GB+256GB, 12GB+256GB స్టోరేజ్ వేరియంట్లలో వస్తుంది. బేస్ మోడల్ ధర రూ. 35,999 కాగా, 256GB వేరియంట్ ధర రూ. 37,999కు లభిస్తోంది. టాప్-ఆఫ్-ది-లైన్ 12GB+256GB మోడల్ ధర రూ. 40,999కు పొందవచ్చు.

Realme 16 Pro Series

Realme 16 Pro Series (Image Credit To Original Source)

ఫస్ట్ సేల్‌లో బంపర్ డిస్కౌంట్ :
రియల్‌మి 16 ప్రో సిరీస్‌ ఆఫర్‌ల విషయానికి వస్తే.. మీరు రెండు స్మార్ట్‌ఫోన్‌లపై రూ. 4వేల వరకు ఇన్‌స్టంట్ బ్యాంక్ డిస్కౌంట్ పొందవచ్చు. అదనంగా, రూ. 2,017 నుంచి ఈఎంఐలో రెండు వేరియంట్‌లను కొనుగోలు చేయొచ్చు. ఈ ఆఫర్‌లతో పాటు లేటెస్ట్ ఫోన్ సిరీస్‌పై ఎక్స్ఛేంజ్ ఆఫర్‌ కూడా పొందవచ్చు.

రియల్‌మి 16 ప్రో సిరీస్ స్పెసిఫికేషన్లు :

  • 6.8-అంగుళాల అమోల్డ్ ప్యానెల్, నియర్-బెజెల్-లెస్ డిస్‌ప్లే
  • లాగ్-ఫ్రీ పర్ఫార్మెన్స్ డిస్‌ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్‌
  • మీడియాటెక్ డైమన్షిటీ 7300 మ్యాక్స్ చిప్‌సెట్‌
  • ఫోటోగ్రఫీ కోసం 200MP ప్రైమరీ కెమెరా, 8MP అల్ట్రా-వైడ్-యాంగిల్ లెన్స్
  • సెల్ఫీ, వీడియో కాలింగ్ కోసం 50MP కెమెరాలు
  • ఆండ్రాయిడ్ 16 సపోర్టు
  • 7000mAh భారీ బ్యాటరీ ఆప్షన్