Vivo X200T Launch : వివో లవర్స్‌కు బిగ్ న్యూస్.. కిర్రాక్ ఫీచర్లతో వివో X200T ఫోన్ వస్తోందోచ్.. కీలక ఫీచర్లు లీక్, ధర ఎంత ఉండొచ్చంటే?

Vivo X200T Launch : వివో లవర్స్ కోసం వివో X200T అతిపెద్ద 6200mAh బ్యాటరీతో రాబోతుంది. లాంచ్ కు ముందే కీలక ఫీచర్లు, ధర వివరాలు లీక్ అయ్యాయి.

Vivo X200T Launch : వివో లవర్స్‌కు బిగ్ న్యూస్.. కిర్రాక్ ఫీచర్లతో వివో X200T ఫోన్ వస్తోందోచ్.. కీలక ఫీచర్లు లీక్, ధర ఎంత ఉండొచ్చంటే?

Vivo X200T Launch (Image Credit To Original Source)

Updated On : January 9, 2026 / 6:39 PM IST
  • భారత్‌లో వివో X200T ధర రూ. 55 వేలు ఉండొచ్చు.
  • ఈ ఫోన్‌లో eSIM సపోర్ట్ కూడా ఉంటుంది.
  • సెక్యూరిటీ కోసం 3D అల్ట్రాసోనిక్ ఫింగర్ ప్రింట్ స్కానర్
  • వివో X200Tలో 6200mAh అతిపెద్ద బ్యాటరీ ఆప్షన్

Vivo X200T Launch : కొత్త వివో ఫోన్ కోసం చూస్తున్నారా? భారత మార్కెట్లోకి సరికొత్త వివో X200T ఫోన్ రాబోతుంది. ఈ వివో ఫోన్‌కు ఇప్పటికే ఇండియన్ సర్టిఫికేషన్ లభించింది. ఈ ఫోన్ ఫుల్ స్పెసిఫికేషన్లు ఆన్‌లైన్‌లో లీక్ అయ్యాయి. లీకుల ప్రకారం.. వివో X200T ఫోన్ 2800×1260 పిక్సెల్స్, 1.5K రిజల్యూషన్‌తో 6.67-అంగుళాల అమోల్డ్ డిస్‌ప్లే కూడా ఉంది.

ఈ ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 9400+ ప్రాసెసర్ ద్వారా పవర్ పొందుతుందని భావిస్తున్నారు. 50MP సోనీ సెన్సార్ లెన్స్ ఉండొచ్చు. 90W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 6200mAh బ్యాటరీతో రావొచ్చు. లాంచ్‌కు ముందు వివో ఫోన్ పూర్తి స్పెసిఫికేషన్‌లను ఓసారి పరిశీలిద్దాం..

వివో X200T ఫుల్ స్పెసిఫికేషన్లు (అంచనా) :
వివో X200T పూర్తి స్పెసిఫికేషన్లు లాంచ్‌కు ముందే లీక్ అయ్యాయి. టిప్‌స్టర్ ప్రకారం.. వివో X200T ఫోన్ 6.67-అంగుళాల అమోల్డ్, 2800×1260 పిక్సెల్స్ తో 1.5K డిస్‌ప్లేతో వస్తుంది. ఈ ఫోన్ మీడియాటెక్ డైమన్షిటీ 9400+ ప్రాసెసర్ ద్వారా పవర్ పొందుతుందని భావిస్తున్నారు.

ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 16 అవుట్-ఆఫ్-ది-బాక్స్ రన్ అవుతుంది. కంపెనీ 5 ఏళ్ల OS అప్‌డేట్స్ 7 ఏళ్ల సెక్యూరిటీ ప్యాచ్ అప్‌డేట్స్ కూడా అందిస్తుంది.

Vivo X200T Launch

Vivo X200T Launch (Image Credit To Original Source)

వివో X200T కెమెరాలో OIS సపోర్టుతో 50MP సోనీ LYTIA LYT-702 ప్రైమరీ సెన్సార్ ఉంటుందని భావిస్తున్నారు. 50MP శాంసంగ్ JN1 పెరిస్కోప్ సెన్సార్ కూడా ఉంటుందని చెబుతున్నారు. థర్డ్ లెన్స్ 50MP LYT-600 అల్ట్రావైడ్ సెన్సార్ ఉండొచ్చు. సెల్ఫీలు, వీడియో కాలింగ్ కోసం 32MP ఫ్రంట్ కెమెరాతో వస్తుందని అంచనా.

Read Also : Car Resale Value : మీ పాత కారు అమ్మే ముందు ఇది చేస్తే వేలల్లో కాదు.. లక్షల్లో లాభం.. డీలర్లు కూడా చెప్పని సీక్రెట్!

సెక్యూరిటీ ఫీచర్లు, eSIM సపోర్టు :

ఈ వివో ఫోన్ 90W వైర్డు ఫాస్ట్ ఛార్జింగ్, 40W వైర్‌లెస్ ఛార్జింగ్‌కు సపోర్టుతో భారీ 6200mAh బ్యాటరీని అందిస్తుందని భావిస్తున్నారు. బ్లూటూత్ 5.4 సపోర్ట్ Wi-Fi 7 కనెక్టివిటీతో కూడా వస్తుందని భావిస్తున్నారు.

పోర్ట్‌లలో USB 2.0 టైప్-C పోర్ట్ ఉంటుంది. సెక్యూరిటీ కోసం ఫోన్ స్క్రీన్‌లో 3D అల్ట్రాసోనిక్ ఫింగర్‌ప్రింట్ స్కానర్‌ అందిస్తుంది. ఈ వివో ఫోన్ IP68/IP69 రేటింగ్‌తో వస్తుందని భావిస్తున్నారు. eSIM సపోర్టును కూడా అందిస్తుంది.

వివో X200T ధర (అంచనా) :
భారత మార్కెట్లో వివో X200T ఫోన్ సుమారు రూ. 55వేల ధర మధ్య ఉంటుందని భావిస్తున్నారు. ఈ ఫోన్ బ్లాక్, పర్పల్ కలర్ ఆప్షన్లలో వచ్చే అవకాశం ఉంది. ఈ ఫోన్ చైనాలో లాంచ్ అయిన వివో X200s రీబ్రాండెడ్ వెర్షన్ కావచ్చునని లీక్‌లు సూచిస్తున్నాయి. కంపెనీ త్వరలో భారత మార్కెట్లో లాంచ్ తేదీని ప్రకటించే అవకాశం ఉంది.