Oppo A11s Launched With 5,000 Mah Battery. Check Its Features, Price
Oppo A11s : ప్రముఖ చైనా స్మార్ట్‌ఫోన్ దిగ్గజం ఒప్పో నుంచి బడ్జెట్ సిగ్మంట్‌లో సరికొత్త స్మార్ట్ ఫోన్ వచ్చేసింది. 5000mAh భారీ బ్యాటరీతో ఈ హ్యాండ్ సెట్‌ను ఒప్పో మార్కెట్లోకి తీసుకొచ్చింది. అదే.. Oppo A11s సిరీస్.. 6.5 అంగుళాల HD LCDతో 90Hz రీఫ్రెష్ రేట్, స్నాప్‌డ్రాగన్ 460తో రన్ అవుతుంది. 18W ఛార్జింగ్ సపోర్టు కూడా ఉంది. ఇక కెమెరాల విషయానికి వస్తే.. 13MP మెయిన్ కెమెరా (బ్యాక్ సైడ్), 2MP డెప్త్, 2MP మ్యాక్రో కెమెరాలను కలిగి ఉంది. 8MP సెల్ఫీ షూటర్ పంచ్ హోల్ కటౌట్ అమర్చారు.
బ్యాక్ సైడ్ ఫింగర్ ఫ్రింట్ స్కానర్ కూడా యూజర్లను ఆకట్టుకునేలా ఉంది. ఫోన్ సైజు (163.9 x 75.1 x 8.4 mm) ఉండగా, బరువు 188 గ్రాములు ఉంటుంది. ఈ ఫోన్ బ్లాక్, వైట్ కలర్ ఆప్షన్లలలో వచ్చింది. సాఫ్ట్ వేర్ విషయానికి వస్తే.. ఆండ్రాయిడ్ 10 ఓఎస్‌తో ఒప్పో ColorOS 7.2తో వచ్చింది.
Oppo A11s స్మార్ట్ ఫోన్ ధర CNY 999 (దాదాపు రూ.11,754), 4GB RAM, 64GB స్టోరేజీతో వచ్చింది. 8/128GB వెర్షన్ ధర CNY 1,199 (రూ.14,108) అఫర్ చేస్తోంది. ఒప్పో ఆన్‌లైన్ షాపుతో పాటు చైనాలోని ఇతర రిటైలర్ షాపుల్లో ఈ కొత్త సిరీస్ అందుబాటులో ఉంది.
Read Also : Covid Booster Dose : కోవిడ్ బూస్టర్ డోసుకు మీరు అర్హులేనా? ఇలా తెలుసుకోండి..!