Oppo First 5.5G Phone : శాటిలైట్‌ కనెక్టివిటీతో ప్రపంచంలోనే ఫస్ట్ 5.5G స్మార్ట్‌ఫోన్.. సిమ్ కార్డు లేకున్నా ఫోన్ కాల్స్ చేయొచ్చు!

Oppo First 5.5G Smartphone : ఒప్పో Find X7 సిరీస్ 5.5G (5G-అడ్వాన్స్‌డ్) టెక్నాలజీకి సపోర్టు ఇచ్చే ప్రపంచంలోనే మొట్టమొదటి స్మార్ట్‌ఫోన్. ఈ అల్ట్రా శాటిలైట్ ఎడిషన్ సిమ్ కార్డు లేకున్నా కాల్స్ చేయొచ్చు.

Oppo Announces First 5.5G Smartphones in the China Mobile Industry

Oppo First 5.5G Smartphone : మొబైల్‌ ఫోన్లలో కొత్త కొత్త ఫీచర్స్ వస్తున్నాయి. ఎన్ని ఫీచర్స్ వచ్చినా ఇప్పటివరకు సెల్యులార్ నెట్‌వర్క్‌తోనే నడిచే ఫోన్లనే చూశాం. కాని ఇప్పుడు శాటిలైట్‌ కమ్‌ సెల్యులార్ సిగ్నల్‌తో పనిచేసే మొబైల్ ఫోన్లు అందుబాటులోకి వచ్చాయి. డ్రాగన్ కంట్రీలో ఒప్పో కంపెనీ అల్ట్రా శాటిలైట్ ఎడిషన్‌ ఫోన్‌ను మార్కెట్‌లోకి రిలీజ్‌ చేసింది.

ఒప్పో Find X7 సిరీస్ 5.5G (5G-అడ్వాన్స్‌డ్) టెక్నాలజీకి సపోర్టు ఇచ్చే ప్రపంచంలోనే మొట్టమొదటి స్మార్ట్‌ఫోన్ అని చెప్పవచ్చు. ఒప్పో ఫైండ్ X7 అల్ట్రా శాటిలైట్ ఎడిషన్ మల్టీఫేస్ కెమెరా రేంజ్‌తో ఆకట్టుకుంటుంది. తక్కువ-కాంతిలోనూ భారీ ఒక-అంగుళాల సెన్సార్, ఎఫ్/1.8 ఎపర్చర్‌తో కూడిన 50ఎంపీ వైడ్ యాంగిల్ కెమెరాను కలిగి ఉంది.

Read Also : Oppo Find X7 Series Launch : ఒప్పో ఫైండ్ ఎక్స్7 సిరీస్ చూశారా? అదిరిపోయే ఫీచర్లు, ధర ఎంతో తెలుసా?

ఇప్పటివరకు 5G నెట్‌వర్క్‌ మొబైల్స్ మార్కెట్‌లో అందుబాటులో ఉన్నాయి. చైనా ఒకడుగు ముందుకేసి. 5.5G నెట్‌వర్క్‌ విత్‌ శాటిలైట్ కమ్యూనికేషన్‌తో స్మార్ట్ ఫోన్‌ తీసుకొచ్చింది. ఈ ఫోన్‌కు చైనాలో ఫుల్ డిమాండ్ ఉంది. కాకపోతే అన్ని దేశాల్లో ఈ శాటిలైట్‌ ఎడిషన్ ఫోన్‌ను వాడే అవకాశం ఉండదు. భద్రతా కారణాలతో కొన్ని దేశాల్లో శాటిలైట్‌ ఫోన్లను నార్మల్ పబ్లిక్ వాడడాన్ని నిషేధించారు.

నెట్‌వర్క్‌ లేకపోతే ఉపగ్రహంతో కనెక్ట్ కావొచ్చు : 
ఈ ఏడాది మొదట్లోనే 5.5G శాటిలైట్‌ ఎడిషన్ ఫోన్‌ డెమో సక్సెస్ అయింది. ఇది డ్యుయల్ సిమ్‌ ఫోన్‌లాగా డ్యుయల్‌ కనెక్టివిటీ ఫోన్ అని చెప్పొచ్చు. ఈ మొబైల్‌ సెల్యులార్‌ నెట్‌వర్క్‌ 5G కంటే ఎక్కువ స్పీడ్‌ వస్తుంది. సెల్యులార్‌ నెట్వర్క్‌ లేని దగ్గర స్పెషల్‌ ఆప్షన్‌ పిక్‌ చేసుకొని శాటిలైట్‌ సిగ్నల్‌తో పనిచేస్తుంది.

Oppo First 5.5G Smartphone

ఒప్పో కంపెనీ ఈ శాటిలైట్‌ ఫోన్లను తయారు చేసింది. చైనాలో ఇప్పటికే కస్టమర్లకు ఒప్పో ఫైండ్ X7 అల్ట్రా శాటిలైట్ ఎడిషన్‌ ఫోన్ అందుబాటులోకి వచ్చింది. 7వేల 499 యువాన్లు ((సుమారు 1036 డాలర్లు) గా దీని రేటు ఫిక్స్ చేశారు. అంటే మన భారత కరెన్సీలో అక్షరాలా రూ. 86వేలు ఉంటుంది. 16జీబీ ర్యామ్, 1టీబీ స్టోరేజ్‌తో కాన్ఫిగరేషన్‌ను డిజైన్ చేశారు. ఈ 5.5జీ ఫోన్ ఒప్పో  అధికారిక ఆన్‌లైన్ స్టోర్ ద్వారా పొందవచ్చు. ఈ శాటిలైట్ ఫోన్ మొత్తం ఓషన్ బ్లూ, సెపియా బ్రౌన్, టైలర్డ్ బ్లాక్ అనే మూడు కలర్ ఆప్షన్లలో లభిస్తుంది.

అన్ని ఫోన్లకు కాల్స్‌, మెస్సేజెస్‌ చేసే వీలు :
శాటిలైట్ కనెక్టివిటీతో కాల్స్‌, మెస్సేజ్‌ చేయడానికి వీలుంటుంది. శాటిలైట్ ఫోన్‌తో.. ల్యాండ్‌లైన్, సెల్యులార్, ఇతర శాటిలైట్ ఫోన్‌లతో కమ్యూనికేట్ కావచ్చు.. ఈ ఫోన్ల ద్వారా నౌకలు, విమానాలతో పాటు కమాండ్ సెంటర్లకు కమ్యూనికేషన్లను అందించే అవకాశం ఉంటుంది. శాటిలైట్‌ ఫోన్లను ఎక్కువగా భద్రతాబలగాలు, దర్యాప్తుసంస్థలు వాడుతున్నాయి. సాధారణ జనం వాడితే మిస్‌ యూజ్‌ ప్రమాదం ఉంటుందని భారత్‌లో ఈ డ్యుయల్ యూజ్డ్‌ మొబైల్స్ వాడకానికి అనుమతి లేదు. 

ఒప్పో Find X7 సిరీస్ స్పెషిఫికేషన్లు, ఫీచర్లు : 

  • 3168×1440 రిజల్యూషన్‌తో 6.82-అంగుళాల అమోల్డ్ కర్వ్డ్ డిస్‌ప్లే
  • 120Hz వరకు రిఫ్రెష్ రేట్‌కు విజువల్స్ సపోర్టు
  • హుడ్ కింద LPDDR5X ర్యామ్
  • UFS 4.0 స్టోరేజ్‌, పవర్‌ఫుల్ Snapdragon 8 Gen 3 ప్రాసెసర్
  • 5000mAh బ్యాటరీ, 100W వైర్డు ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టు
  • రెండు టెలిఫోటో లెన్స్‌లు
  • 65mm ఫోకల్ లెంగ్త్, f/2.6 ఎపర్చర్‌తో 50MP లెన్స్
  • 50MP సూపర్ టెలిఫోటో, 135mm ఫోకల్ లెంగ్త్ f/4.3 అపెర్చర్
  • డ్యూయల్ టెలిఫోటో లెన్స్‌
  • f/2.0 ఎపర్చర్‌తో 50ఎంపీ అల్ట్రా-వైడ్ యాంగిల్ కెమెరా
  • సెల్ఫీలు, వీడియో కాల్‌లకు 32ఎంపీ కెమెరా

Read Also : Apple iPhone 15 : ఆపిల్ ఐఫోన్ 15 కొంటున్నారా? ఫ్లిప్‌కార్ట్‌లో తక్కువ ధరకే ఈ డీల్‌ ఎలా పొందాలంటే?