Oppo Find N5 Launch
Oppo Find N5 Launch : కొత్త స్మా్ర్ట్‌ఫోన్ కోసం చూస్తున్నారా? ప్రముఖ స్మార్ట్‌ఫోన్ దిగ్గజం ఒప్పో ఒప్పో ప్రపంచంలోనే అత్యంత సన్నని ఫోల్డబుల్ ఫోన్ లాంచ్ చేసింది. అదే.. ఒప్పో ఫైండ్ N5 ఫోన్.. ఈ మడతబెట్టే ఫోన్ 8.93mm (క్లోజ్ చేస్తే) ఉంటుంది. 2024లో అత్యంత సన్నని ఫోన్ అయిన హానర్ మ్యాజిక్ V3 కన్నా ఇంకా సన్నగా ఉంటుంది.
8.93mm వద్ద ఒప్పో ఫైండ్ N5 ఐఫోన్ 16 ప్రో కన్నా ఒక మిల్లీమీటర్ కన్నా తక్కువ (8.3mm) మందంగా ఉంటుంది. మీరు ఈ కొత్త ఒప్పో ఫోన్ తెరిస్తే.. సన్నని పాయింట్ వద్ద ఫైండ్ N5 కేవలం 4.21mm మాత్రమే ఉంటుంది. ఎందుకంటే ఆ ఫోన్ ఫోల్డ్ ఓపెన్ చేస్తే.. కొత్త హువావే మేట్ XT ట్రిపుల్-ఫోల్డబుల్ ఫోన్ కన్నా మెరుగ్గా ఉంటుంది. ఈ హువావే మడతబెట్టే ఫోన్ ఫోల్డ్ ఓపెన్ చేస్తే 3.6mm మందంతో ఉంటుంది.
ఈ మడతబెట్టే ఫోన్ ధర లక్షపైనే :
ప్రపంచవ్యాప్తంగా ఒప్పో ఫైండ్ N5 ఫోన్ లాంచ్ అయింది. అన్ని యూరోపియన్, ఆసియా మార్కెట్లలో విడుదల కానుందని నమ్ముతారు. అయితే, ఒప్పో ఫైండ్ N-సిరీస్ ఫోల్డబుల్‌ను భారత మార్కెట్లో ఎప్పుడూ విడుదల కాలేదు. ఈ ఏడాది కూడా అది జరుగుతుందో లేదో కచ్చితంగా తెలియదు.
అయితే, ఈ ఏడాదిలో వన్‌ప్లస్ ఓపెన్ 2ని లాంచ్ చేయడం లేదని వెల్లడించింది. దాంతో ఒప్పో ఫైండ్ N5 భారత మార్కెట్లోకి వస్తుందని ఆశించారు. ముఖ్యంగా Find N-సిరీస్ గ్లోబల్ వెర్షన్ వచ్చే అవకాశం ఉంది. సింగపూర్‌లో జరిగిన లాంచ్ ఈవెంట్‌లో, ఈ ఫోన్ SGD 2,499కి ప్రారంభమైంది. అంటే భారత కరెన్సీలో దాదాపు రూ. 1,62,000 ఉంటుంది అనమాట.
ఒప్పో ఫైండ్ N5 కీలక స్పెసిఫికేషన్లు, ఫీచర్లు :
ఒప్పో ఫైండ్ N5 స్పెసిఫికేషన్లను పరిశీలిస్తే.. ఒప్పో ఫైండ్ N5 6.62-అంగుళాల FHD+ ఇంటర్నల్ స్క్రీన్, 8.12-అంగుళాల 2K ఎక్స్‌టర్నల్ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇంటర్నల్, ఎక్స్‌టర్నల్ డిస్‌ప్లేలు రెండూ 120Hz LTPO రిఫ్రెష్ రేట్‌తో అమోల్డ్, 2160Hz PWM డిమ్మింగ్‌తో ఉంటాయి. ఒప్పో ఫైండ్ N5 డిస్‌ప్లేలు స్టైలస్ పెన్‌తో కూడా అనుకూలంగా ఉంటాయి. ఇందులో IPX6, X8, X9 రేటింగ్‌లు ఉన్నాయి.
ఈ ఒప్పో ఫోన్ సబ్‌మెర్షన్, వాటర్ స్ప్రేయింగ్ రెండింటి నుంచి ప్రొటెక్షన్ అందిస్తుంది. కానీ, దుమ్ము లేదా ధూళి కాదని గమనించాలి. ఒప్పో ఫైండ్ N5 పవర్ బటన్ పైన ఉండే సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్, లెఫ్ట్ ఎడ్జ్ అలర్ట్ స్లయిడర్‌ను కలిగి ఉంది.
ఈ ఫోల్డబుల్ ఫోన్‌కు కొత్త క్వాల్కమ్ చిప్‌సెట్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ అమర్చారు. 16జీబీ LPDDR5x ర్యామ్, 512జీబీ యూఎఫ్ఎస్ 4.0 స్టోరేజ్‌తో వస్తుంది. ఈ ఫోన్ 80W వైర్డు, 50W వైర్‌లెస్ ఛార్జింగ్‌కు సపోర్టుతో 5,600mAh బ్యాటరీతో వస్తుంది.
ఫోటోగ్రఫీ విషయానికి వస్తే.. :
ఒప్పో ఫైండ్ N5 హాసెల్‌బ్లాడ్-బ్రాండెడ్ ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. ఇందులో 50ఎంపీ సోనీ LYT-700 ప్రైమరీ సెన్సార్, 8ఎంపీ అల్ట్రా-వైడ్-యాంగిల్ కెమెరా, 6x ఆప్టికల్ జూమ్‌తో కూడిన 50ఎంపీ పెరిస్కోప్ కెమెరా, 30x డిజిటల్ జూమ్ ఉన్నాయి. ఈ ఫోన్‌లో 2 సెల్ఫీ కెమెరాలు ఉన్నాయి. అందులో ఒకటి ఇంటర్నల్ డిస్‌ప్లే, మరొకటి ఎక్స్‌టర్నల్ డిస్‌ప్లే, రెండూ 8ఎంపీ లెన్స్ కలిగి ఉన్నాయి.
ఈ ఫోన్ లేటెస్ట్ ఆండ్రాయిడ్ 15పై రన్ అవుతుంది. కలర్‌ఓఎస్ లేయర్లుగా ఉంటుంది. ఒప్పో ఫైండ్ N5 మొత్తం మిస్టీ వైట్, కాస్మిక్ బ్లాక్, డస్కీ పర్పుల్ అనే 3 కలర్ ఆప్షన్లలో వస్తుంది. రెండోది చైనాకు ప్రత్యేకమైనది. ప్రపంచ మార్కెట్లలో ఫైండ్ N5 ప్రీ-ఆర్డర్లు ఫిబ్రవరి 21 నుంచి ప్రారంభమవుతాయి, ఫిబ్రవరి 28 నుంచి సేల్ మొదలు కానుంది.