Oppo Find X8 Mini Launch : వివో X200 ప్రో మినీకి పోటీగా ఒప్పో ఫైండ్ X8 మినీ ఫోన్ వచ్చేస్తోంది..

Oppo Find X8 Mini Launch : ఈ హ్యాండ్‌సెట్ ఒప్పో ఫైండ్ ఎక్స్8 మినీగా టిప్‌స్టర్ సూచిస్తున్నారు. ఒప్పో ఫైండ్ ఎక్స్8 అల్ట్రా లేదా ఫైండ్ ఎక్స్8 మినీ గురించి ఒప్పో ఎలాంటి వివరాలను వెల్లడించలేదు.

Oppo Find X8 Mini Tipped to Launch Soon

Oppo Find X8 Mini Launch : చైనీస్ స్మార్ట్‌ఫోన్ తయారీదారు వివో సబ్ బ్రాండ్ ఒప్పో నుంచి సరికొత్త స్మార్ట్‌ఫోన్ రాబోతుంది. వివో ఎక్స్200 ప్రో మినీతో పోటీగా ఒప్పో ఫైండ్ X8 మినీ లాంచ్ చేయనుంది. టిప్‌స్టర్ షేర్ చేసిన వివరాల ప్రకారం… కంపెనీ ఇటీవలే చైనాలో ఒప్పో ఫైండ్ ఎక్స్8, ఒప్పో ఫైండ్ ఎక్స్8 ప్రోలను లాంచ్ చేసింది. ఈ సిరీస్‌లో భాగంగా కొత్త ఫైండ్ ఎక్స్8 అల్ట్రా మోడల్‌ను ప్రకటించాలని భావిస్తున్నారు. అయితే, ఒప్పో గత నెలలో చైనాలో లాంచ్ అయిన వివో ఎక్స్200 ప్రో మినీ స్మార్ట్‌ఫోన్‌తో పోటీగా లైనప్‌లో నాల్గవ మోడల్‌ను కూడా రెడీ చేస్తున్నట్లు కనిపిస్తోంది.

ఒప్పో ఫైండ్ ఎక్స్8 మినీ ఫ్లాగ్‌షిప్ ఫైండ్ ఎక్స్8 అల్ట్రా మోడల్‌తో పాటు లాంచ్ కానుంది. చైనీస్ మైక్రోబ్లాగింగ్ ప్లాట్‌ఫారమ్‌లోని పోస్ట్‌ ప్రకారం.. ఒప్పో రాబోయే నెలల్లో లాంచ్ అయ్యే ఒప్పో ఫైండ్ ఎక్స్8 అల్ట్రాతో పాటు వచ్చే కొత్త స్మార్ట్‌ఫోన్‌పై వర్క్ చేస్తుందని పేర్కొంది. ఈ హ్యాండ్‌సెట్ ఒప్పో ఫైండ్ ఎక్స్8 మినీగా టిప్‌స్టర్ సూచిస్తున్నారు. ఒప్పో ఫైండ్ ఎక్స్8 అల్ట్రా లేదా ఫైండ్ ఎక్స్8 మినీ గురించి ఒప్పో ఎలాంటి వివరాలను వెల్లడించలేదు.

అయితే, ఈ నాల్గవ మోడల్ ఫైండ్ ఎక్స్8 సిరీస్‌లో ప్రారంభమైతే.. అక్టోబర్‌లో లాంచ్ అయిన వివో ఎక్స్200ప్రో మినీతో పోటీగా వస్తుంది. ఒప్పో ఎక్స్200 ప్రో సిరీస్‌లో వివో అతి చిన్న మోడల్‌లో మీడియాటెక్ డైమెన్సిటీ 9400 చిప్ అమర్చి ఉంటుంది. గరిష్టంగా 16జీబీ ర్యామ్‌తో వస్తుంది. 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.3-అంగుళాల ఎల్‌టీపీఓ అమోల్డ్ స్క్రీన్‌ను కలిగి ఉంది. మూడు 50ఎంపీ (ప్రైమరీ, అల్ట్రావైడ్, పెరిస్కోప్ టెలిఫోటో) కెమెరాలు, అలాగే 32ఎంపీ సెల్ఫీ కెమెరాతో అమర్చి ఉంది.

వివో ఎక్స్200ప్రో మినీలో 1టీబీ వరకు స్టోరేజీని అందిస్తుంది. ఇందులో 90డబ్ల్యూ (వైర్డ్) 30డబ్ల్యూ (వైర్‌లెస్) ఛార్జింగ్‌కు సపోర్టు ఇచ్చే 5,700mAh బ్యాటరీ ఉంటుంది. ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ స్కానర్‌ ఉంది. కంపెనీ ఆర్జిన్ఓఎస్ 5 స్కిన్, ఆండ్రాయిడ్ 15లో రన్ అవుతుంది.

Read Also : IRCTC Ticket Booking : ట్రైన్ టికెట్ బుకింగ్ చేస్తున్నారా? రైల్వే అడ్వాన్స్ రిజర్వేషన్ కొత్త రూల్స్ గురించి ఈ 5 విషయాలు తెలుసుకోండి!