IRCTC Ticket Booking : ట్రైన్ టికెట్ బుకింగ్ చేస్తున్నారా? రైల్వే అడ్వాన్స్ రిజర్వేషన్ కొత్త రూల్స్ గురించి ఈ 5 విషయాలు తెలుసుకోండి!
IRCTC Ticket Booking : ఇప్పటికే రైలు టిక్కెట్‌లను బుక్ చేసుకున్న ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. షెడ్యూల్ ప్రకారం వారి రైల్వే ప్రయాణాన్ని కొనసాగించవచ్చు.

Indian Railways advance reservation rules
IRCTC Ticket Booking : భారతీయ రైల్వే టికెటింగ్ విధానంలో కొత్త రూల్స్ ప్రవేశపెట్టింది. ప్రత్యేకించి రైల్వే టిక్కెట్ల కోసం ముందస్తు రిజర్వేషన్ వ్యవధి (ARP)ని 120 రోజుల నుంచి ఇప్పుడు 60 రోజులకు తగ్గించింది. తద్వారా ఈ కొత్త రూల్ నవంబర్ 1, 2024 నుండి అమల్లోకి వచ్చింది. ఇప్పటికే రైలు టిక్కెట్‌లను బుక్ చేసుకున్న ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. షెడ్యూల్ ప్రకారం వారి రైల్వే ప్రయాణాన్ని కొనసాగించవచ్చు.
రైల్వే మంత్రిత్వ శాఖ ప్రకారం.. రైల్వే ప్రయాణికులను ప్రోత్సహించేందుకు రైలు బుకింగ్‌ల కోసం అడ్వాన్స్ రిజర్వేషన్ పీరియడ్ (ARP) సవరించింది. 61 రోజుల నుంచి 120 రోజుల వరకు ముందస్తుగా చేసిన రిజర్వేషన్‌లలో సుమారు 21 శాతం రద్దు అయ్యాయి. 5 శాతం మంది ప్రయాణీకులు తమ ప్రయాణాలు బోర్డింగ్ చేయడం విఫలమయ్యారు. నిజమైన ప్రయాణీకుల డిమాండ్‌ను ప్రతిబింబించేలా రైల్వే ఈ కొత్త నిబంధన తీసుకొచ్చింది.
రైల్వే టికెటింగ్‌పై టాప్ 5 పాయింట్లు ఇవే :
1. “తాజ్ ఎక్స్‌ప్రెస్, గోమతి ఎక్స్‌ప్రెస్ వంటి కొన్ని డేటైమ్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు అడ్వాన్స్ రిజర్వేషన్లకు తక్కువ సమయ పరిమితులను కలిగి ఉంటాయి.” అని మంత్రిత్వ శాఖ పేర్కొంది.
2. విదేశీ పర్యాటకుల కోసం 365 రోజుల ముందస్తు రిజర్వేషన్ వ్యవధి మారదు.
3. అక్టోబరు 31, 2024కి ముందు 120 రోజుల ముందస్తు రిజర్వేషన్ వ్యవధిలో చేసిన బుకింగ్‌లు చెల్లుబాటు అవుతాయి. 60 రోజుల కొత్త ఏఆర్‌పీకి మించి చేసిన రిజర్వేషన్‌లు ఇప్పటికీ రద్దు చేసేందుకు అర్హులు.
4. టిక్కెట్లను రద్దు చేయకుండా ప్రయాణీకుల బోర్డింగ్ సమస్యను పరిష్కరించేందుకు ఈ కొత్త విధానం లక్ష్యంగా పెట్టుకుందని మంత్రిత్వ శాఖ పేర్కొంది.
5. మంత్రిత్వ శాఖ ప్రకటన ప్రకారం.. 1995-1998లో ముందస్తు రిజర్వేషన్ వ్యవధి 30 రోజుల కన్నా తక్కువగా ఉందని పేర్కొంది.
పరిమితికి మించి ప్రయాణీకుల సామానుపై జరిమానా :
అంతకుముందు పశ్చిమ రైల్వే, ప్రయాణీకుల లగేజీ వారి సంబంధిత ప్రయాణ తరగతికి అనుమతించదగిన పరిమితిని మించి ఉంటే జరిమానా విధించనుంది. రైల్వే స్టేషన్‌లలో లగేజీలతో రద్దీగా ఉండవద్దని ప్రయాణికులను కోరింది. ప్రతి ప్రయాణీకుడు కొంత మొత్తంలో లగేజీని ఛార్జ్ లేకుండా తీసుకెళ్లేందుకు అనుమతి ఉంది.
అయితే, స్కూటర్లు, సైకిళ్లు వంటి వస్తువులు, అలాగే 100 సెం.మీ x 100 సెం.మీ x 70 సెం.మీ కన్నా ఎక్కువ పరిమాణంలో ఉన్న సరుకులను ఉచితంగా అనుమతి ఉండదని పశ్చిమ రైల్వే తెలిపింది. “పశ్చిమ రైల్వే ప్రయాణికులందరూ స్టేషన్లలో రద్దీని నివారించాలని, రైలు షెడ్యూల్‌లకు అనుగుణంగా లగేజీ పరిమితులకు కట్టుబడి, అవసరమైనప్పుడు మాత్రమే ప్రాంగణంలోకి ప్రవేశించాలని కోరింది.