ఒప్పో ఫైండ్ X8 అల్ట్రా స్మార్ట్‌ఫోన్ రివ్యూ.. ఈ కొత్త స్మార్ట్‌ఫోన్ ఎంత బాగుందంటే?
వాటి కంటే ఒప్పో ఫైండ్ X8 అల్ట్రా మరింత మెరుగైన ఫీచర్లతో వచ్చిందని విశ్లేషకులు రివ్యూలు ఇస్తున్నారు.

ఒప్పో ఫోన్లు వాడేవారు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఫైండ్ X8 అల్ట్రా స్మార్ట్‌ఫోన్ ఇటీవల లాంచ్ అయింది. మార్కెట్లో ఉన్న కొన్ని అల్ట్రా మోడళ్లలో ఇది ఒకటి. ఎలైట్ చిప్‌సెట్, క్యూహెచ్‌డీ స్క్రీన్, సూపర్-ఫాస్ట్ ఛార్జింగ్, అల్ట్రా-గ్రేడ్ కెమెరా కిట్‌తో ఇది స్మార్ట్‌ఫోన్ యూజర్లను ఆకర్షిస్తోంది. దీన్ని రివ్యూ చూద్దాం..
ఒప్పో Find X7 Ultraతో పోల్చితే కొత్త మోడల్ ఫైండ్ X8 అల్ట్రా మరింత సమర్థంగా పనిచేసే చిప్‌సెట్, పెద్ద బ్యాటరీ, మెరుగైన కెమెరా సెన్సార్లు, లెన్స్‌లతో లాంచ్ అయింది. డిజైన్‌లోనూ ఎన్నో మార్పులతో వచ్చింది.
ఒప్పో Find X8 Proతో పోల్చితే కొత్త మోడల్ ఫైండ్ X8 అల్ట్రాలో రిజల్యూషన్ స్క్రీన్ మరింత బాగుంది. మరింత శక్తివంతమైన సిలికాన్, సెన్సార్లతో అప్‌గ్రేడ్ చేసిన కెమెరా సెటప్, వేగంగా ఛార్జింగ్ చేసే వైర్డు ఛార్జింగ్ ఉన్నాయి.
ఒప్పో ఫైండ్ X8 అల్ట్రా ఫీచర్లు, ప్రత్యేకతలు
ఒప్పో ఫైండ్ X8 అల్ట్రా 6.82-అంగుళాల LTPO AMOLED 1440p రిజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్, డాల్బీ విజన్, HDR10+ సపోర్ట్‌తో వచ్చింది. మార్కెట్లో అత్యంత శక్తిమంతమైన చిప్‌సెట్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్, LPDDR5X RAM, UFS 4.0 స్టోరేజ్‌తో దీన్ని లాంచ్ చేశారు.
అల్ట్రా మోడల్ 100W వైర్డు, 50W వైర్‌లెస్, 10W రివర్స్ వైర్‌లెస్ ఛార్జింగ్ సామర్థ్యంతో 6,100mAh బ్యాటరీతో వచ్చింది. ఫైండ్ X8 అల్ట్రాలో షోస్టాపర్ కెమెరా సిస్టమ్ ఉంది. దాని వెనుక భాగంలో రెండు టెలిఫోటో మాడ్యూల్స్‌తో నాలుగు 50MP కెమెరాలు ఉన్నాయి.
ఇందులో రెండు పెరిస్కోప్ కెమెరాలను అప్‌గ్రేడ్ చేశారు. 3x మాడ్యూల్‌లో 70mm లెన్స్, f/2.1 ఎపర్చర్‌తో LYT-700 1/1.56-అంగుళాల 50MP సెన్సార్ ఉంది. ఇది 10cm దూరం నుంచి కూడా ఫోకస్ చేస్తుంది.
ఒప్పో ఫైండ్ X8 అల్ట్రా మొదట చైనా మార్కెట్లో విడుదలైంది. ఈ ఫోన్‌లు ఇతర దేశాల మార్కెట్లలో భవిష్యత్తులో లాంచ్ చేసే అవకాశం ఉంది. ఒప్పో ఈ సిరీస్‌లో ఇప్పటికే రెండు స్మార్ట్‌ఫోన్‌లను భారత్‌లో విడుదల చేసింది. అవి ఫైండ్ X8, ఫైండ్ X8 ప్రో. వాటి కంటే ఒప్పో ఫైండ్ X8 అల్ట్రా మరింత మెరుగైన ఫీచర్లతో వచ్చిందని విశ్లేషకులు రివ్యూలు ఇస్తున్నారు.