Oppo Find X9 Price : ఫ్లిప్‌కార్ట్‌లో ఖతర్నాక్ డిస్కౌంట్.. ఈ ఒప్పో ఫోన్ రూ. 11వేలు తక్కువకే.. ఎలాగంటే?
Oppo Find X9 Price : ఒప్పో ఫైండ్ ఎక్స్9 ధర భారీగా తగ్గింది. ఫ్లిప్‌కార్ట్‌లో ఈ స్మార్ట్‌ఫోన్ ప్రస్తుతం రూ. 77,995 ధరకు లభిస్తోంది. పూర్తి ధర, ఆఫర్ల వివరాలివే..
Oppo Find X9 Price Deal
- భారత మార్కెట్లో ఒప్పో ఫైండ్ X9 అసలు ధర రూ. 84,999
- ఫ్లిప్‌కార్ట్‌లో ఈ స్మార్ట్‌ఫోన్ రూ. 77,995 ధరకు లభిస్తోంది
- రూ. 7,004 ఫ్లాట్ డిస్కౌంట్, బ్యాంకు, ఎక్స్ఛేంజ్ ఆఫర్లతో ఆదా
Oppo Find X9 Price : కాంపాక్ట్ ఫ్లాగ్షిప్ స్మార్ట్‌ఫోన్ కొనేందుకు ప్లాన్ చేస్తున్నారా? అయితే, ఈ అద్భుతమైన ఆఫర్ మీకోసమే.. ఒప్పో ఫైండ్ X9 భారీ తగ్గింపు ధరకే లభిస్తోంది. ఈ ఒప్పో ఫోన్ అసలు ధర రూ. 84,999 ఉండగా ఇప్పుడు రూ. 11వేలు డిస్కౌంట్‌తో లభిస్తోంది.
ఈ ఒప్పో ఫోన్ 6.59-అంగుళాల డిస్ప్లే, మీడియాటెక్ డైమెన్సిటీ ప్రాసెసర్, భారీ 7,025mAh బ్యాటరీ ఫీచర్లతో ఆకట్టుకునేలా ఉంది. ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో ఈ ఫోన్‌ను కొనేటప్పుడు రూ. 11వేల కన్నా ఎక్కువ సేవ్ చేసుకోవచ్చు. ఇలాంటి డీల్స్ ఎక్కువ రోజులు ఉండవు. ఒప్పో ఫైండ్ X9 ఫీచర్లు, ధరకు సంబంధించి పూర్తి వివరాలపై ఓసారి లుక్కేయండి..
ఒప్పో ఫైండ్ X9 డీల్ :
భారత మార్కెట్లో ఒప్పో ఫైండ్ X9 అధికారిక ధర రూ. 84,999గా ఉంది. కానీ, ఫ్లిప్‌కార్ట్‌లో ఇదే స్మార్ట్‌ఫోన్ రూ. 77,995కే లభిస్తోంది. అంటే.. రూ. 7,004 ఫ్లాట్ డిస్కౌంట్ పొందవచ్చు. అంతేకాదు.. మీరు ఐసీఐసీఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ఈఎంఐతో రూ. 4వేలు డిస్కౌంట్ పొందవచ్చు. ఇంకా ఎక్కువ సేవింగ్ కోసం మీ పాత స్మార్ట్‌ఫోన్‌తో కూడా ఎక్స్ఛేంజ్ చేసుకోవచ్చు.
ఒప్పో ఫైండ్ X9 స్పెసిఫికేషన్లు :
ఒప్పో ఫైండ్ X9 ఫోన్ 6.59-అంగుళాల అమోల్డ్ డిస్ప్లేతో వస్తుంది. 1.5K రిజల్యూషన్ (2760 × 1256), 120Hz రిఫ్రెష్ రేట్, 3,600 నిట్స్ పీక్ బ్రైట్నెస్ ఉన్నాయి. అలాగే, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ 2 ప్రొటెక్షన్‌తో వస్తుంది.
ఈ ఫ్లాగ్షిప్ ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 9500 చిప్సెట్తో రన్ అవుతుంది. అంతేకాదు.. 7,025mAh బ్యాటరీతో వస్తుంది. 80W వైర్డ్, 50W వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. 10W రివర్స్ ఛార్జింగ్‌కు కూడా సపోర్ట్ చేస్తుంది.
ఫొటోగ్రఫీ విషయానికి వస్తే.. :
ఒప్పో ఫైండ్ X9 బ్యాక్ సైడ్ హస్సెల్‌బ్లాడ్-ట్యూన్డ్ 50MP ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50MP మెయిన్ (సోనీ LYT-808, ఎఫ్/1.6, OIS), 50MP అల్ట్రావైడ్ (శాంసంగ్ JN5, ఎఫ్/2.0), 50MP పెరిస్కోప్ టెలిఫోటో (సోనీ LYT-600, 3x ఆప్టికల్ జూమ్, ఎఫ్/2.6, OIS) ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఫ్రంట్ సైడ్ 32MP కెమెరా కూడా ఉంది.
