Oppo K12x 5G Launch : ఒప్పో నుంచి సరికొత్త 5జీ ఫోన్ వచ్చేసిందోచ్.. ఈ ఫోన్ ధర, స్పెషిఫికేషన్లు వివరాలివే..!

Oppo K12x 5G Launch : భారత మార్కెట్లో ఒప్పో కె12ఎక్స్ 5జీ ఫోన్ 6జీబీ+ 128జీబీ ఆప్షన్ ప్రారంభ ధర 12,999, 8జీబీ+ 256జీబీ వేరియంట్ ధర రూ. 15,999కు పొందవచ్చు. ఆగస్టు 2 నుంచి ఫోన్ కొనుగోలుకు అందుబాటులో ఉంటుంది.

Oppo K12x 5G Launch : ఒప్పో నుంచి సరికొత్త 5జీ ఫోన్ వచ్చేసిందోచ్.. ఈ ఫోన్ ధర, స్పెషిఫికేషన్లు వివరాలివే..!

Oppo K12x 5G With 5,100mAh Battery ( Image Source : Google )

Oppo K12x 5G Launch : కొత్త ఫోన్ కొంటున్నారా? ప్రముఖ చైనా స్మార్ట్‌ఫోన్ దిగ్గజం ఒప్పో నుంచి సరికొత్త 5జీ ఫోన్ వచ్చేసింది. అదే.. ఒప్పో కె12ఎక్స్ 5జీ ఫోన్. భారత మార్కెట్లో ఈ హ్యాండ్‌సెట్ 8జీబీ వరకు ర్యామ్, మీడియాటెక్ డైమెన్సిటీ 6300 చిప్‌సెట్ ద్వారా పవర్ అందిస్తుంది.

Read Also : Apple Foldable iPhone : ఆపిల్ లవర్స్‌కు అదిరే న్యూస్.. త్వరలో మడతబెట్టే ఐఫోన్లు వస్తున్నాయి.. ఫస్ట్ ఫోల్డబుల్ ఐఫోన్ ఎలా ఉండొచ్చుంటే?

మిలిటరీ-గ్రేడ్ ఎమ్ఐఎల్-ఎస్‌టీడీ-810హెచ్ సర్టిఫికేషన్‌తో వచ్చిన సెగ్మెంట్‌లో ఫోన్ మొదటిదిగా చెప్పవచ్చు. 360-డిగ్రీల ప్రూఫ్ ఆర్మర్ బాడీని కలిగి ఉందని సూచిస్తుంది. స్ప్లాష్ టచ్ టెక్నాలజీకి సపోర్టు ఇస్తుంది. తడి చేతులతో ఫోన్‌ను సపోర్ట్ చేస్తుంది. ఈ హ్యాండ్‌సెట్ ఐపీ54-రేటెడ్, 7.68ఎమ్ఎమ్ స్లిమ్ బిల్డ్‌ను కూడా కలిగి ఉంది.

భారత్‌లో ఒప్పో కె12ఎక్స్ 5జీ ధర, ఆఫర్లు :
భారత మార్కెట్లో ఒప్పో కె12ఎక్స్ 5జీ ఫోన్ 6జీబీ+ 128జీబీ ఆప్షన్ ప్రారంభ ధర 12,999, అయితే, 8జీబీ+ 256జీబీ వేరియంట్ ధర రూ. 15,999కు పొందవచ్చు. ఆగస్టు 2 నుంచి ఫ్లిప్‌కార్ట్, ఒప్పో ఇండియా ఇ-స్టోర్ ద్వారా ఫోన్ కొనుగోలుకు అందుబాటులో ఉంటుంది.

ఒప్పో కొనుగోలుదారులకు రూ. వెయ్యి ఎంపిక చేసిన బ్యాంకుల ద్వారా లావాదేవీలపై ఇన్‌స్టంట్ డిస్కౌంట్, మూడు నెలల వరకు నో-కాస్ట్ ఈఎంఐ ఆప్షన్ పొందవచ్చు. ఈ ఆఫర్‌లు ఆగస్ట్ 2న మాత్రమే చెల్లుబాటు అవుతాయి. ఈ హ్యాండ్‌సెట్ బ్రీజ్ బ్లూ, మిడ్‌నైట్ వైలెట్ అనే రెండు కలర్ ఆప్షన్‌లలో వస్తుంది.

ఒప్పో కె12ఎక్స్ 5జీ స్పెసిఫికేషన్‌లు, ఫీచర్లు :
ఒప్పో కె12ఎక్స్ 5జీ ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.67-అంగుళాల హెచ్‌డీ+ (1,604 x 720 పిక్సెల్‌లు) ఎల్‌సీడీ స్క్రీన్, గరిష్టంగా 1,000నిట్స్ వరకు బ్రైట్‌నెస్ స్థాయి, డ్యూయల్ రీన్‌ఫోర్స్డ్ పాండా గ్లాస్ ప్రొటెక్షన్‌ను కలిగి ఉంది. స్ప్లాష్ టచ్ టెక్నాలజీకి కూడా సపోర్టు ఇస్తుంది. తడి చేతులతో కూడా ఫోన్‌ను ఆపరేట్ చేసేందుకు యూజర్లకు అనుమతిస్తుంది. ఈ ఫోన్ 6ఎన్ఎమ్ మీడియాటెక్ డైమెన్సిటీ 6300 చిప్‌సెట్‌తో 8జీబీ వరకు ఎల్‌పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్, 256జీబీ వరకు యూఎఫ్ఎస్ 2.2 ఆన్‌బోర్డ్ స్టోరేజీతో వస్తుంది. ఆండ్రాయిడ్ 14-ఆధారిత కలర్ఓఎస్ 14తో ప్రొటెక్ట్ చేస్తుంది.

ఆప్టిక్స్ విషయానికి వస్తే.. ఒప్పో కె12ఎక్స్ 5జీ 32ఎంపీ ప్రైమరీ సెన్సార్, 2ఎంపీ సెన్సార్‌ను కలిగిన డ్యూయల్ రియర్ కెమెరా యూనిట్‌తో వస్తుంది. ఫ్రంట్ కెమెరాలో 8ఎంపీ సెన్సార్ ఉంది. ఈ హ్యాండ్‌సెట్ ఎమ్ఐఎల్-ఎస్టీడీ-810హెచ్ సర్టిఫికేషన్, ఐపీ54-రేటెడ్ బిల్డ్‌తో వస్తుంది.

ఒప్పో 45డబ్ల్యూ సూపర్ వూక్ ఛార్జింగ్‌కు సపోర్టుతో ఒప్పో కె12ఎక్స్ 5జీలో 5,100mAh బ్యాటరీని అందిస్తుంది. ఒప్పో ఫోన్ 5జీ డ్యూయల్ 4జీ విఓఎల్టీఈ, వై-ఫై, బ్లూటూత్ 5.1, జీపీఎస్, GLONASS, యూఎస్‌బీ టైప్-సి కనెక్టివిటీతో పాటు 3.5ఎమ్ఎమ్ ఆడియో జాక్‌కు కూడా సపోర్టు ఇస్తుంది. సెక్యూరిటీ విషయానికి వస్తే.. సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను కలిగి ఉంటుంది. ఈ హ్యాండ్‌సెట్ సైజు 76.14 x 165.79 x 7.68ఎమ్ఎమ్, బరువు 186గ్రాములు ఉంటుంది.

Read Also : Realme 13 Pro Sale : కొత్త ఫోన్ కొంటున్నారా? ఈ నెల 30 నుంచే రియల్‌మి 13ప్రో సేల్.. ధర, స్పెషిఫికేషన్లు..!