Oppo K13 Turbo Series: ఒప్పో నుంచి కొత్త స్మార్ట్‌ఫోన్లు వచ్చేశాయ్‌.. మిడ్‌ రేంజ్‌ ధరలో.. ఖతర్నార్‌ ఫీచర్లు..

కే13 టర్బో స్మార్ట్‌ఫోన్‌ బ్లాక్ వారియర్, నైట్ వైట్, పర్పుల్ కలర్స్‌లో అందుబాటులో ఉంది.

ఒప్పో K13 టర్బో, టర్బో ప్రో స్మార్ట్‌ఫోన్లు విడుదలయ్యాయి. వీటిని ఇవాళ ఆ కంపెనీ చైనాలో విడుదల చేసింది. త్వరలోనే ప్రపంచ వ్యాప్తంగా లాంచ్‌ అయ్యే అవకాశం ఉంది. బేసిక్ మోడల్ లో డైమెన్సిటీ 8450 చిప్‌సెట్, 7000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉండగా, ప్రో వేరియంట్ లో స్నాప్‌డ్రాగన్ 8ఎస్ జనరేషన్ 4 చిప్‌సెట్ ఉంది.

కే13 టర్బో స్మార్ట్‌ఫోన్‌ బ్లాక్ వారియర్, నైట్ వైట్, పర్పుల్ కలర్స్‌లో అందుబాటులో ఉంది. కే13 టర్బో ప్రో స్మార్ట్‌ఫోన్లు బ్లాక్ వారియర్, నైట్ సిల్వర్, పర్పుల్ కలర్స్‌తో విడుదలయ్యాయి. ప్రస్తుతం అధికార వెబ్‌సైట్ ద్వారా ముందస్తు ఆర్డర్‌కు అందుబాటులో ఉన్నాయి. అమ్మకాలు జూలై 25న ప్రారంభమవుతాయి.

ధరలు
కే13 టర్బో
12జీబీ + 256జీబీ ధర సుమారు రూ.21600
16జీబీ + 256జీబీ వేరియంట్ ధర సుమారు రూ.24000
12జీబీ + 512జీబీ వేరియంట్ ధర సుమారు రూ.27600

కే13 టర్బో ప్రో
12జీబీ + 256జీబీ ధర సుమారు రూ.24000
16జీబీ + 256జీబీ ధర సుమారు రూ.26400
12జీబీ + 512జీబీ ధర సుమారు రూ.28800
16జీబీ + 512జీబీ ధర సుమారు రూ.32500

Also Read: బోస్టన్ బ్రాహ్మిన్లు ఎవరు? ఈ జంట ప్రపంచ వ్యాప్తంగా వైరల్ అయ్యాక ఈ క్యాబట్స్‌ గురించి తెలుసుకోకపోతే ఎలా?

స్పెసిఫికేషన్లు
కే13 టర్బో, టర్బో ప్రో స్క్రీన్ సైజు 6.80 అంగుళాలు. ఫ్లెక్సిబుల్ అమోలెడ్ స్క్రీన్, రిఫ్రెష్ రేట్ 120 హెర్ట్జ్, టచ్ సాంప్లింగ్ రేట్ 240 హెర్ట్జ్, గ్లోబల్ బ్రైట్‌నెస్ స్థాయి 1600 నిట్స్.

టర్బో ప్రోలో స్నాప్‌డ్రాగన్ 8ఎస్ జనరేషన్ 4 చిప్, ఎల్పీడీడీఆర్5ఎక్స్ ర్యామ్ 16జీబీ వరకు, యూఎఫ్ఎస్ 4.0 స్టోరేజ్ 512జీబీ వరకు.

టర్బోలో డైమెన్సిటీ 8450 చిప్‌సెట్, ఎల్పీడీడీఆర్5ఎక్స్ ర్యామ్ 16జీబీ వరకు, యూఎఫ్ఎస్ 3.1 స్టోరేజ్ 512జీబీ వరకు.

రెండూ స్మార్ట్‌ఫోన్లు ఆండ్రాయిడ్ 15 బేస్డ్‌ కలర్ ఓఎస్ 15.0లో వస్తాయి. 50 మెగాపిక్సెల్ మెయిన్ సెన్సార్ కెమెరా, 2 మెగాపిక్సెల్ సెకండ్ సెన్సార్ కెమెరా ఉన్నాయి. ఫ్రంట్‌ సైడ్‌ 16 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది.

బ్యాటరీ సామర్థ్యం 7000 ఎంఏహెచ్. ఫాస్ట్ చార్జింగ్ సామర్థ్యం 80 వాట్స్. రెండు సిమ్‌లు, 5జీ, 4జీ, వైఫై 7, బ్లూటూత్ 5.4, జీపీఎస్, ఎన్‌ఎఫ్‌సీ, టైప్ సీ పోర్ట్ ఉంటాయి. వాటర్ రెసిస్టెన్స్‌కి IPX6, IPX8, IPX9 రేటింగ్స్ ఉన్నాయి. ఇవి నీటి ప్రదేశాల్లో మొబైల్ తడిచినా పనిచేస్తుందని గుర్తించే రేటింగ్‌లు.