Oppo Reno 11 5G Series : రూ. 30వేల లోపు ధరకే ఒప్పో రెనో 11 సిరీస్ వచ్చేసింది.. ఈ నెల 18 నుంచే సేల్.. డోంట్ మిస్!

Oppo Reno 11 5G Series : భారత మార్కెట్లోకి ఒప్పో రెనో 11 సిరీస్ వచ్చేసింది. ఒప్పో రెనో 11, రెనో ప్రో 5జీ ధర రూ. 39,999తో జనవరి 18 నుంచి అమ్మకానికి అందుబాటులో ఉంటుంది.

Oppo Reno 11 5G Series : ఒప్పో రెనో 11 సిరీస్ ఎట్టకేలకు భారత మార్కెట్లో లాంచ్ అయింది. ఈ సిరీస్‌లో ఈసారి రెండు మోడల్‌లు ఉన్నాయి. ఒప్పో రెనో 11, రెనో 11 ప్రో మోడల్స్ కంపెనీ ఈ ఏడాదిలో ప్రో ప్లస్ రిలీజ్ చేయలేదు. కొత్త ఒప్పో 5జీ ఫోన్‌లు ధర రూ. 40వేల విభాగంలో ఉన్నాయి. ఒప్పో ప్రో మోడల్ బహుశా వన్‌ప్లస్ 11ఆర్, ఐక్యూ నియో 7 ప్రో వంటి మరిన్ని ఫోన్‌లతో పోటీ పడవచ్చు. కొత్త ఒప్పో రెనో 11 సిరీస్ ఫీచర్లు, ధర పూర్తి వివరాలను పరిశీలిద్దాం..

Read Also : Oppo Find X7 Series Launch : ఒప్పో ఫైండ్ ఎక్స్7 సిరీస్ చూశారా? అదిరిపోయే ఫీచర్లు, ధర ఎంతో తెలుసా?

ఒప్పో రెనో 11 సిరీస్.. భారత్ ధర ఎంతంటే? :
ఒప్పో రెనో 11 ప్రో 5జీ ధర రూ. 39,999కు పొందవచ్చు. జనవరి 18 నుంచి విక్రయానికి అందుబాటులో ఉంటుంది. ఒప్పో రెనో 11 5జీ ఫోన్ జనవరి 25 నుంచి కొంచెం ముందుగానే విక్రయానికి రానుంది. ఈ డివైజ్ రెండు స్టోరేజ్ వేరియంట్‌లలో విక్రయానికి అందుబాటులో ఉండనుంది. 128జీబీ స్టోరేజ్ మోడల్ ధర రూ. 29,999కు సొంతం చేసుకోవచ్చు. 256జీబీ మోడల్ రూ. 31,999కి విక్రయించనుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లన్నీ ఫ్లిప్‌కార్ట్, ఒప్పో ఇ-స్టోర్, మెయిన్‌లైన్ రిటైల్ అవుట్‌లెట్‌లలో అందుబాటులో ఉంటాయి.

ఒప్పో రెనో 11 ప్రో, ఒప్పో రెనో 11 కీలక స్పెషిఫికేషన్లు :
ఒప్పో రెనో 11 భారతీయ వేరియంట్‌లు కొద్దిగా భిన్నంగా ఉంటాయి. ప్రామాణిక మోడల్ మీడియాటెక్ డైమెన్సిటీ 7050 ఎస్ఓసీని ప్యాక్ చేస్తుంది. ఒప్పో ప్రో మోడల్ వరుసగా మీడియాటెక్ డైమెన్సిటీ 8200 ఎస్ఓసీ ద్వారా పవర్ పొందుతుంది. చైనాలో, ఒప్పో రెనో 11 హుడ్ కింద మీడియాటెక్ డైమెన్సిటీ 8200 చిప్‌సెట్‌ను ఉపయోగిస్తుంది. ఒప్పో ప్రో మోడల్ స్నాప్‌డ్రాగన్ 8+ జెన్ 1 ఎస్ఓసీని కలిగి ఉంది.

Oppo Reno 11 5G series launch 

ఇతర స్పెసిఫికేషన్ల విషయానికొస్తే.. ఒప్పో రెనో 11 మోడల్‌లు రెండూ 6.70-అంగుళాల పూర్తి-హెచ్‌డీ+ ఓఎల్ఈడీకర్వ్డ్ డిస్‌ప్లేలను గరిష్టంగా 120హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్‌తో కలిగి ఉన్నాయి. ప్రో మోడల్‌కు హెచ్‌డీఆర్ 10+కి కూడా సపోర్టు అందిస్తుంది. ప్యానెల్ ప్రొటెక్షన్ కోసం డ్రాగన్‌ట్రైల్ స్టార్ 2 గ్లాస్ లేయర్ కలిగి ఉంది. బ్యాక్ కెమెరా మాడ్యూల్ చుట్టూ అదనపు మన్నిక కోసం ప్రో వేరియంట్‌లో గొరిల్లా గ్లాస్ 5 బ్యాక్ ప్యానెల్ (పెరల్ వైట్) కూడా ఉంది.

ఆప్టిక్స్ పరంగా పరిశీలిస్తే.. ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపీ ప్రైమరీ సెన్సార్ ఉంటుంది. ప్రో మోడల్‌లో 32ఎంపీ టెలిఫోటో సెన్సార్, 8ఎంపీ వైడ్ యాంగిల్ కెమెరా ఉన్నాయి. రెండు ఫోన్‌లు సెల్ఫీలకు ముందు భాగంలో 32ఎంపీ కెమెరాను కలిగి ఉన్నాయి. రెనో 11 ప్రోలో 80డబ్ల్యూ సూపర్ ఫ్లాష్ ఛార్జ్ సపోర్ట్‌తో 4,700ఎంఎహెచ్ బ్యాటరీ ఉంది. ఒప్పో రెనో 11 67డబ్ల్యూ సూపర్ ఫ్లాష్ ఛార్జ్‌కు సపోర్టుతో 4,800ఎంఎహెచ్ బ్యాటరీని కలిగి ఉంది.

Read Also : Apple iPhone 13 Sale : అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్.. రూ.50వేల లోపు ధరకే ఆపిల్ ఐఫోన్ 13 సొంతం చేసుకోండి

ట్రెండింగ్ వార్తలు