Oppo Reno 14 Series
Oppo Reno 14 Series : కొత్త ఒప్పో ఫోన్ కోసం చూస్తున్నారా? ఒప్పో నుంచి రెండు సరికొత్త రెనో 14 సిరీస్ ఫోన్లు లాంచ్ అయ్యాయి. ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్‌లలో ఒకటైన ఒప్పో రెనో 13 సిరీస్ అప్‌గ్రేడ్ వెర్షన్ రిలీజ్ చేసింది.
రెనో 14 5G, రెనో 14 ప్రో 5G స్మార్ట్‌ఫోన్‌లను ప్రవేశపెట్టింది. లేటెస్ట్ లైనప్ ప్రస్తుతం చైనాలో లాంచ్ అయింది. ఆండ్రాయిడ్ 15-ఆధారిత ColorOS 15పై రన్ అవుతుంది.
ట్రిపుల్ 50MP కెమెరా సెటప్, ఫాస్ట్ ఛార్జింగ్, హై రిఫ్రెష్ రేట్ ఓఎల్ఈడీ స్క్రీన్‌లతో సహా టాప్-టైర్ హార్డ్‌వేర్‌ను అందిస్తుంది.
ఒప్పో రెనో 14 రెనో 14 ప్రో ధర, వేరియంట్లు :
ఇప్పుడు చైనీస్ మార్కెట్లో రెనో 14 సిరీస్ మాత్రమే ప్రీ-ఆర్డర్లకు అందుబాటులో ఉంది. మెర్మైడ్, రీఫ్ బ్లాక్, కల్లా లిల్లీ పర్పుల్ అనే 3 కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. మీరు ధర, వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి.
రెనో 14 5G చైనా ధరలు :
12GB ర్యామ్ 256GB స్టోరేజ్: CNY 2,799 (సుమారు రూ. 33,200)
16GB ర్యామ్ 256GB స్టోరేజ్: CNY 2,999 (సుమారు రూ. 35,600)
12GB ర్యామ్ 512GB స్టోరేజ్: CNY 3,099 (సుమారు రూ. 36,800)
16GB ర్యామ్ 512GB స్టోరేజ్: CNY 3,299 (సుమారు రూ. 39,100)
16GB ర్యామ్ 1TB స్టోరేజ్: CNY 3,799 (సుమారు రూ. 45,100)
రెనో 14 ప్రో 5G చైనా ధరలు :
12GB ర్యామ్, 256GB స్టోరేజ్ : CNY 3,499 (సుమారు రూ. 41,500)
12GB ర్యామ్, 512GB స్టోరేజ్: CNY 3,799 (సుమారు రూ. 45,100)
16GB ర్యామ్, 512GB స్టోరేజ్: CNY 3,999 (సుమారు రూ. 47,400)
16GB ర్యామ్ 1TB స్టోరేజ్ : CNY 4,499 (సుమారు రూ. 53,400)
పర్ఫార్మెన్స్, డిస్‌ప్లే :
రెనో 14 మీడియాటెక్ డైమెన్సిటీ 8350 ద్వారా పవర్ పొందగా, ప్రో వేరియంట్ మరింత అధునాతన డైమెన్సిటీ 8450 చిప్‌సెట్‌ను పొందుతుంది. రెండు ఫోన్‌లు 16GB వరకు LPDDR5X ర్యామ్, 1TB UFS 3.1 స్టోరేజీని అందిస్తాయి.
డిస్‌ప్లేలు పదునైన OLED ప్యానెల్‌లు – 6.59-అంగుళాల రెనో 14 6.83-అంగుళాల రెనో 14 ప్రో 1.5K రిజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్, 3,840Hz PWM డిమ్మింగ్‌తో ఉంటాయి.
కెమెరా సెటప్ : ట్రిపుల్ 50MP పవర్
ఈ రెండు ఫోన్లలో ట్రిపుల్ 50MP కెమెరాలు ఉన్నాయి. ఇందులో OISతో కూడిన మెయిన్ సెన్సార్, 50MP పెరిస్కోప్ లెన్స్ (3.5x జూమ్) 50MP సెల్ఫీ షూటర్ ఉన్నాయి. ప్రో మోడల్ 50MP అల్ట్రా-వైడ్ కెమెరాను అందిస్తుంది. అయితే, స్టాండర్డ్ వెర్షన్ 8MP అల్ట్రా-వైడ్‌కు సరిపోతుంది.
బ్యాటరీ, ఛార్జింగ్ :
రెనో 14 6,000mAh బ్యాటరీతో వస్తుంది. రెనో 14 ప్రో ఫోన్ 6,200mAh ఉంటుంది. రెండూ 80W వైర్డ్ ఛార్జింగ్‌కు సపోర్టు ఇస్తాయి. రెనో 14 ప్రో 50W వైర్‌లెస్ AIRVOOC ఛార్జింగ్‌ను కూడా అందిస్తుంది.
ఇతర ముఖ్య ఫీచర్లు :
భారత మార్కెట్లో త్వరలో లాంచ్ కానున్న ఒప్పో రెనో 14 సిరీస్, స్టైల్, పర్ఫార్మెన్స్, ఫ్లాగ్‌షిప్- లెవల్ ఫీచర్లతో ప్రీమియం మిడ్-రేంజ్ సెక్షన్ లక్ష్యంగా చేసుకుంది.