Post Office Schemes : పోస్టాఫీస్‌లో అద్భుతమైన స్కీమ్స్.. రూ. 2లక్షలు డిపాజిట్ చేస్తే.. వడ్డీ ఎంత వస్తుందో తెలుసా? ఫుల్ డిటెయిల్స్..
Post Office Schemes : పోస్ట్ ఆఫీస్‌లో పెట్టుబడి పెడుతున్నారా? మీరు రూ. 2లక్షలు డిపాజిట్ చేస్తే గ్యారెంటీగా రూ. 89,989 స్థిర వడ్డీని పొందవచ్చు..

Post Office Scheme
Post Office Schemes : పోస్టాఫీసులో పెట్టుబడి పెట్టాలని అనుకుంటున్నారా? గత నెలలో ఆర్బీఐ రెపో రేటు తగ్గించిన తర్వాత దాదాపు అన్ని బ్యాంకులు FD వడ్డీ రేట్లను తగ్గించాయి.
కానీ, పోస్టాఫీసు ఇప్పటికీ కస్టమర్లకు FDపై బంపర్ రాబడిని ఇస్తోంది. పోస్టాఫీసు తన కస్టమర్లకు FDపై 6.9 శాతం నుంచి 7.5 శాతం వరకు వడ్డీని అందిస్తోంది. 1 సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, 5 సంవత్సరాల పాటు పోస్టాఫీసులో FD ఖాతాలను ఓపెన్ చేయొచ్చు.
ఈ పోస్టాఫీసు పథకాలలో రూ. 2 లక్షలు డిపాజిట్ చేయడం ద్వారా రూ. 89,989 స్థిర వడ్డీని పొందొచ్చు. దీనికి సంబంధించి పూర్తి వివరాలను తెలుసుకుందాం.
పోస్టాఫీసులో TD పేరుతో FD అకౌంట్లు ఓపెన్ చేయొచ్చు. పోస్టాఫీసులో ఏడాది FDపై 6.9 శాతం వడ్డీ, 2 ఏళ్ల FDపై 7.0 శాతం, 3 ఏళ్ల FDపై 7.1 శాతం, 5 ఏళ్ల FDపై 7.5 శాతం వడ్డీ అందిస్తోంది.
పోస్టాఫీసులో FDని టైమ్ డిపాజిట్ (TD)అని పిలుస్తారు. పోస్టాఫీసు TD స్కీమ్ అనేది బ్యాంకుల FD పథకం లాంటిది. పెట్టుబడిదారులు హామీతో స్థిర వడ్డీని పొందవచ్చు. ఈ పథకంలో జమ చేసిన ప్రతి పైసా పూర్తిగా సురక్షితమే కాదు.. హామీతో స్థిర వడ్డీని అందుకోవచ్చు.
రూ. 2లక్షలు డిపాజిట్ చేస్తే.. రూ. 89,989 స్థిర వడ్డీ :
5 ఏళ్ల TDపై పోస్టాఫీసు అత్యధికంగా 7.5 శాతం వడ్డీని అందిస్తోంది. మీరు పోస్టాఫీసులో 5 ఏళ్ల TDలో రూ. 2లక్షలు డిపాజిట్ చేస్తే.. మెచ్యూరిటీ సమయంలో మొత్తం రూ. 2,89,989 లభిస్తుంది.
ఇందులో మీరు డిపాజిట్ చేసిన రూ. 2లక్షలు.. రూ. 89,989 స్థిర, హామీ వడ్డీ కూడా ఉంటుంది. TD ఖాతాలోని కస్టమర్లందరికి సాధారణ పౌరుడైనా లేదా సీనియర్ సిటిజన్ అయినా పోస్టాఫీసు ఒకే వడ్డీని ఇస్తుంది.