Apple iPhone Price : ట్రంప్ చెప్పినట్టు అమెరికాలోనే ఐఫోన్ తయారైతే అప్పుడు ఫోన్ కాస్ట్ ఎన్ని లక్షలు అవుతుందో తెలుసా?
Apple iPhone Price : అమెరికాలో ఐఫోన్ల తయారీపై డొనాల్డ్ ట్రంప్ ప్రకటనతో ఐఫోన్ ధరలు మూడు రెట్లు పెంచవచ్చని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.

Apple iPhone Price
Apple iPhone Price : ఆపిల్ అభిమానులకు షాకింగ్ న్యూస్.. అమెరికాలో ఐఫోన్లు తయారు కానున్నాయా? అదే జరిగితే ఐఫోన్ల ధరలు ఆకాశనంటే అవకాశం ఉంది.
అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చెప్పినట్టు ఆ దేశంలో ఐఫోన్లు తయారైతే ఆపిల్ ఐఫోన్ కొనడం ఇక కలగానే మిగిలిపోతుంది. ఎందుకంటే.. అమెరికాలో ఐఫోన్ల తయారు చేయడం వల్ల ఖర్చు భారీగా పెరుగుతుంది.
ఫలితంగా ఆ ఖర్చు భారాన్ని ఐఫోన్ ధరలపై పడే అవకాశం ఉంటుంది. ప్రస్తుత స్థాయి నుంచి ఏకంగా ఐఫోన్ల ధరలు మూడు రెట్లు పెంచాల్సి వస్తుంది.
3 రెట్లు పెరగనున్న ఐఫోన్ ధరలు :
భారత్ కాకుండా అమెరికాలో ఐఫోన్‌లను తయారు చేయడం వల్ల ఖర్చులు 3 రెట్లు పెరుగుతాయని, యూనిట్‌కు ధర వెయ్యి డాలర్ల నుంచి 3వేల డాలర్లకు పెరుగుతుందని మార్కెట్ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.
ఆపిల్ సీఈఓ టిమ్ కుక్‌తో జరిగిన సంభాషణకు సంబంధించి ట్రంప్ ప్రకటన నేపథ్యంలో ఐఫోన్ల ధరలు పెరిగే అవకాశం ఉందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఆ సంభాషణలో ఆపిల్ భారత విస్తరణ ప్రణాళికలను ఆపేయాలని కోరారు. ప్రస్తుతం ఆపిల్ తయారీ కార్యకలాపాలలో 80శాతం చైనానే నిర్వహిస్తోంది.
దాదాపు 5 మిలియన్ల మందికి ఉపాధి కల్పిస్తోంది. ఒకవేళ, ఆపిల్ తయారీ కార్యకలాపాలను భారత్ నుంచి అమెరికా లేదా ఇతర పాశ్చాత్య దేశాలకు తరలిస్తే కార్మిక ఖర్చులు భారీగా పెరుగుతాయి. దాంతో ఉత్పత్తి ఖర్చులు పెరుగుతాయి.
ట్రంప్ ప్రకటనకు ప్రతిస్పందనగా MCCIA డైరెక్టర్ జనరల్ ప్రశాంత్ గిర్బానే మాట్లాడుతూ.. “ఆపిల్ కంపెనీ అమెరికాలో ఐఫోన్ల తయారీపై ఆలోచిస్తే ధరలు మరింత పెరిగే అవకాశం ఉంటుంది.
చైనా, భారత్ లేదా వియత్నాంతో పోలిస్తే.. అమెరికాలో తయారు చేయాలని నిర్ణయిస్తే.. వెయ్యి డాలర్ల ఐఫోన్ ధర 3వేల డాలర్లు అవుతుంది.
అమెరికన్ వినియోగదారులు ఆ ఐఫోన్ కోసం 3వేల డాలర్లు (భారత కరెన్సీలో రూ. 2లక్షల 57వేలు) చెల్లించడానికి సిద్ధంగా ఉన్నారా?” అని ఆయన ప్రశ్నించారు.
TEMA చైర్మన్ NK గోయల్ ప్రకారం.. అమెరికా అధ్యక్షుడు ప్రకటనలపై ప్రతిస్పందించడానికి కొంత సమయం వేచి ఉండాల్సి అవసరం ఉందన్నారు. ఆపిల్ విషయానికొస్తే.. గత ఏడాదిలో భారత్ నుంచి 22 బిలియన్ డాలర్లకు పైగా విలువైన ఐఫోన్‌లను తయారు చేసింది.
మరో 2 ఐఫోన్ తయారీ ప్లాంట్లు :
ఆపిల్ భారత్‌లో 3 తయారీ ప్లాంట్లను కలిగి ఉంది మరో రెండు తయారీ ప్లాంట్లను ఏర్పాటు చేసేందుకు ప్లాన్ చేస్తోంది” ఆపిల్ ఐఫోన్ల తయారీని చైనా నుంచి భారత్‌కు పాక్షికంగా తరలించడాన్ని ఇప్పటికే ప్రారంభించిందని గోయల్ వివరించారు.
అమెరికాలో ఐఫోన్ల తయారీని ప్రారంభించాలా వద్దా అనేది ఆపిల్ నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. పాక్షికంగా చైనా నుంచి భారత్‌కు తరలినా ఆపిల్ ఇండియా నుంచి వెళ్లిపోతే.. కంపెనీ భారీ నష్టాలను ఎదుర్కోవాల్సి రావొచ్చు.
ఎందుకంటే.. ప్రపంచవ్యాప్తంగా సుంకాల పరిమితులు పెరుగుతున్నాయి. ఆపిల్ భారత్ నుంచి బయటకు వెళ్లదని గట్టిగా విశ్వసిస్తున్నామని గోయల్ అన్నారు.
గతంలో KPMGలో భాగస్వామిగా అయిన జైదీప్ ఘోష్ మాట్లాడుతూ.. భారత్‌లో ఐఫోన్ ఉత్పత్తి 2025 ఆర్థిక సంవత్సరంలో రూ. 1.75 లక్షల కోట్లకు చేరుకుందని అన్నారు. మార్చితో ముగిసిన ఈ ఏడాదిలో రూ. 1.2 లక్షల కోట్లకు పెరిగిందని పేర్కొన్నారు. “ఆపిల్ ఎకో సిస్టమ్ భారత్‌కు చాలా ముఖ్యమైనది” అని ఆయన తెలిపారు.
భవిష్యత్తులో ఆపిల్ భారత్ నుంచి వైదొలగితే ఎదురయ్యే సంభావ్య పరిణామాలపై ఆయన హెచ్చరించారు. ముఖ్యంగా దేశీయ మార్కెట్లు, ఉద్యోగ రంగాన్ని తీవ్ర ప్రభావితం చేస్తుందన్నారు. అమెరికాలో ఐఫోన్ల తయారీని ప్రారంభించడం అంత సులభం కాదని ఘోష్ వ్యాఖ్యానించారు.