ఒప్పో రెనో 14 సిరీస్ త్వరలోనే లాంచ్ కానుంది. మొదట చైనాలో ఈ స్మార్ట్‌ఫోన్లు విడుదల అవుతాయి. అనంతరం భారత్‌లో ఈ ఫోన్లను లాంచ్ చేస్తారు. గీక్‌బెంచ్ బెంచ్ మార్క్ వెబ్‌సైట్‌లో ఈ స్మార్ట్‌ఫోన్ల ఫీచర్లను పేర్కొన్నారు. అందులో తెలిపిన వివరాల ప్రకారం ఒప్పో రెనో 14 మీడియాటెక్ 8400 చిప్‌తో ఈ స్మార్ట్‌ఫోన్లు నడుస్తాయి.
ఒప్పో రెనో 14ను ఈ నెలలోనే లాంచ్ చేస్తామని ఇప్పటికే ఆ కంపెనీ అధికారికంగా ప్రకటించింది. ఇండియాలో ఈ నెలలో లాంచ్ చేస్తారన్న వివరాలను ఆ కంపెనీ ఇంకా చెప్పలేదు. ఒప్పో రెనో 13 సిరీస్ 2025 జనవరిలో భారత్‌లో లాంచ్ అయింది. ఆ సిరీస్‌కు కొనసాగింపుగా వస్తున్న ఒప్పో రెనో 14 కూడా భారత్‌లోనే కొన్ని వారాల్లోనే రావచ్చని తెలుస్తోంది.
ఒప్పో రెనో సిరీస్‌లను సాధారణంగా చైనాలో లాంచ్ చేసిన కొన్ని వారాలకి భారత్‌లో రిలీజ్ చేస్తారు. ఉదాహరణకు రెనో 13 సిరీస్‌ను 2024 నవంబర్‌లో చైనాలో లాంచ్ చేశారు. తరువాత రెండు నెలలకు భారత్‌లో విడుదలైంది.
Also Read: ఏసీ కొనాలనుకుంటున్నారా? ఈ బ్రాండెడ్ ఏసీలపై ఇప్పుడు వేలాది రూపాయల డిస్కౌంట్లు..
ఫీచర్లు
ఒప్పో ఇంకా అధికారికంగా ఈ సిరీస్‌కు సంబంధించిన వివరాలను వెల్లడించనప్పటికీ ఇటీవల వచ్చిన లీక్‌ల వల్ల పలు వివరాలు తెలిశాయి. టిప్‌స్టర్ డిజిటల్ చాట్ స్టేషన్ వీబోలో రెండు కొత్త ఫొటోలను పోస్ట్ చేసింది. OPPO రెనో 14 ఎలా ఉండనుందన్న వివరాలు దీని ద్వారా తెలుసుకోచ్చు. ఇందులో రీవాంపెడ్ కెమెరా లేఅవుట్ ఉన్నట్లు తెలుస్తోంది.
కెమెరా సిస్టమ్ డిజైన్ విషయానికి వస్తే దీర్ఘచతురస్రాకార మాడ్యూల్‌లో R-ఆకారపు కాన్ఫిగరేషన్‌తో ఉండొచ్చు. క్యాప్సూల్-ఆకారపు రింగ్‌లో మూడవ లెన్స్, ట్రిపుల్ LED ఫ్లాష్ ఉంది. కెమెరా.. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS)తో 50MP ప్రధాన సెన్సార్‌తో రావచ్చు. 8MP అల్ట్రా-వైడ్ లెన్స్ ఉండొచ్చు.
అలాగే, 3.5x జూమ్‌తో 50MP పెరిస్కోప్ టెలిఫొటో కెమెరాతో దీన్ని లాంచ్ చేయవచ్చు. రెనో 13 సిరీస్‌తో పోల్చితే ఒప్పో రెనో 14 డిజైన్‌లో భారీ మార్పులు ఏమీ లేవు. డిస్ప్లే ఫ్లాట్ 120Hz OLED ప్యానెల్‌తో ఉంటుంది.