ఏసీ కొనాలనుకుంటున్నారా? ఈ బ్రాండెడ్ ఏసీలపై ఇప్పుడు వేలాది రూపాయల డిస్కౌంట్లు..
మీరు ఈ ఏసీని కేవలం రూ.19,990కే కొనుక్కోవచ్చు.

ఎండల వేడి మే నెలలో ఎంతగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పే అవసరం లేదు. ఇంట్లో ఏసీ లేకపోతే చాలా కష్టమే. ఉక్కపోతను తట్టుకోవడానికి ఏసీ కొనాలని అనుకుంటున్నారా? అయితే, ఫ్లిప్‌కార్ట్‌లో ఉన్న ఆఫర్ల గురించి తెలుసుకోవాల్సిందే. ఫ్లిప్‌కార్ట్ సాసా సేల్ ప్రస్తుతం అందుబాటులో ఉంది. ఏయే ఏసీలు భారీ డిస్కౌంట్‌కు లభిస్తున్నాయో చూద్దాం..
ఎల్జీ 1.5 టన్ స్ప్లిట్ ఏసీ
ఎల్జీ స్ప్లిట్ ఏసీపై మంచి ఆఫర్ అందుబాటులో ఉంది. ఫ్లిప్‌కార్ట్‌లో 1.5 టన్ డ్యూయల్ ఇన్వర్టర్ స్ప్లిట్ ఏసీపై ధర సాధారణంగా రూ.84,990గా ఉంటుంది. ఇప్పుడు 55 శాతం భారీ తగ్గింపుతో, మీరు దానిని కేవలం రూ.37,690కి పొందవచ్చు. అంతేకాకుండా, మీరు బ్యాంక్ ఆఫర్లను వాడుకుంటే రూ.1,000 ఆదా చేసుకోవచ్చు. అలాగే, రూ.5,600 వరకు ఎక్స్ఛేంజ్ ఆఫర్ కూడా ఉంది.
గోద్రేజ్ 1.5 టన్ స్ప్లిట్ ఏసీ
గోద్రేజ్ స్ప్లిట్ ఏసీపై భారీ డిస్కౌంట్లు కూడా అందుబాటులో ఉన్నాయి. 5-ఇన్-1 కన్వర్టిబుల్ కూలింగ్‌తో కూడిన 1.5 టన్ స్ప్లిట్ ఏసీ అసలు ధర రూ.45,900. దీనిపై ఇప్పుడు 29 శాతం ఫ్లాట్ డిస్కౌంట్‌లో రూ.32,490కి కొనుగోలు చేయవచ్చు. బ్యాంక్ ఆఫర్ వాడుకుంటే అదనంగా రూ.1,000 ఆదా చేసుకోవచ్చు. మీ పాత ఏసీని ఎక్స్ఛేంజ్ చేసుకుంటే అదనంగా రూ.5,600 వరకు ఆదా చేసుకోవచ్చు.
Also Read: మిడ్ రేంజ్ బడ్జెట్‌లో పోకో ఎఫ్7 స్మార్ట్‌ఫోన్.. అబ్బబ్బ ఎన్నెన్ని ప్రత్యేకతలో..
MarQ 1.5 టన్ స్ప్లిట్ ఏసీ
MarQ బ్రాండ్ దాని 1.5 టన్ స్ప్లిట్ AC (మోడల్ నంబర్ 103IPG25WQV2)పై భారీ ఆఫర్‌ను అందిస్తోంది. దీని ధర సాధారణంగా రూ. 48,999. ప్రస్తుతం ఉన్న SASA సేల్‌లో 59 శాతం తగ్గింపుతో, మీరు ఈ ఏసీని కేవలం రూ.19,990కే కొనుక్కోవచ్చు.
Voltas 1.5 టన్ స్ప్లిట్ ఏసీ
వోల్టాస్ ఏసీని కొనుగోలు చేయాలనుకుంటే, ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో మంచి ఆఫర్ ఉంది. 1.5 టన్ స్ప్లిట్ ఏసీ ధర సుమారు రూ.62,990 ఉంటుంది. ప్రస్తుతం దీనిపై 47 శాతం డిస్కౌంట్ ఉంది. ఈ డీల్‌తో ఈ ఏసీ ధర రూ.32,990కి తగ్గుతుంది. రూ.5,600 వరకు ఎక్స్ఛేంజ్ ఆఫర్ కూడా అందుబాటులో ఉంది.