మిడ్ రేంజ్ బడ్జెట్‌లో పోకో ఎఫ్7 స్మార్ట్‌ఫోన్.. అబ్బబ్బ ఎన్నెన్ని ప్రత్యేకతలో..

చైనాలో విడుదలైన మోడల్‌తో పోలిస్తే, కొన్ని మార్పులు ఉండొచ్చు

మిడ్ రేంజ్ బడ్జెట్‌లో పోకో ఎఫ్7 స్మార్ట్‌ఫోన్.. అబ్బబ్బ ఎన్నెన్ని ప్రత్యేకతలో..

Updated On : May 2, 2025 / 8:57 PM IST

పోకో ఎఫ్7 ఫొటోలు ఓ సర్టిఫైడ్ వెబ్‌సైట్‌లో కనిపించాయి. దీంతో ఈ స్మార్ట్‌ఫోన్‌ త్వరలో లాంచ్ కానుందని తెలుస్తోంది. ఇంతకుముందు ఈ ఫోన్ BIS వెబ్‌సైట్‌లో కూడా కనిపించింది. పోకో ఎఫ్6 తరువాతి మోడల్‌గా పోకో ఎఫ్7 భారత్‌లో విడుదల కానుంది.

పోకో ఎఫ్7 చైనాలో ఏప్రిల్‌లో విడుదలైన Redmi Turbo 4 Proకు రీబ్రాండెడ్ వెర్షన్ కావచ్చని నిపుణులు భావిస్తున్నారు. ఇప్పటికే పోకో ఎఫ్7అల్ట్రా, పోకో ఎఫ్7 ప్రో మోడళ్లను కొన్ని గ్లోబల్ మార్కెట్లలో 2025 మార్చిలోనే విడుదల చేశారు.

పోకో ఎఫ్ 7 గ్లోబల్ సర్టిఫికేషన్, లాంచ్ వివరాలు
పోకో ఎఫ్7కి సంబంధించిన 25053PC47G మోడల్ నంబర్ సింగపూర్ IMDA సర్టిఫికేషన్ వెబ్‌సైట్‌లో కనిపించింది. ఇందులో “G” అంటే ఇది గ్లోబల్ వెర్షన్ అని అర్థం. అదే విధంగా ఇది భారత BIS వెబ్‌సైట్‌లో కూడా కనిపించింది. అంటే భారత్‌లో కూడా త్వరలో విడుదల కావచ్చు.

లీక్‌ అయిన సమాచారం ప్రకారం.. ఈ ఫోన్ మే నెల చివరలో గ్లోబల్ మార్కెట్లలో ఈ స్మార్ట్‌ఫోన్ విడుదల అయ్యే అవకాశం ఉంది. చైనాలో విడుదలైన మోడల్‌తో పోలిస్తే, కొన్ని మార్పులు ఉండొచ్చు (బ్యాటరీ పరిమాణం, ఛార్జింగ్ వేగం వంటివాటిలో).

ఫీచర్లు

Redmi Turbo 4 Pro లాంటి ఫీచర్లే Poco F7లో ఉండొచ్చు

6.83-ఇంచ్ OLED డిస్‌ప్లే
120Hz రిఫ్రెష్ రేట్
1.5K రిజల్యూషన్
Dolby Vision సపోర్ట్

కెమెరాలు
50MP Sony LYT-600 మెయిన్ కెమెరా
8MP అల్ట్రా వైడ్ కెమెరా
20MP సెల్ఫీ కెమెరా

ప్రాసెసర్: Snapdragon 8s Gen 4 చిప్‌సెట్
ఆపరేటింగ్ సిస్టం: HyperOS 2 (Android 15 ఆధారంగా)
బ్యాటరీ: 7,550mAh బ్యాటరీ కెపాసిటీ, 90W ఫాస్ట్ ఛార్జింగ్, 22.5W రివర్స్ ఛార్జింగ్

ఇతర ఫీచర్లు
IP66, IP68, IP69 రేటింగ్స్ (డస్ట్, వాటర్‌ రెసిస్టెన్స్‌)
ఇన్-డిస్‌ప్లే ఆప్టికల్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్

ఇక, పోకో ఎఫ్7 మిడ్-రేంజ్ బడ్జెట్‌ ఫోన్. పూర్తి వివరాలను Poco అధికారికంగా త్వరలో ప్రకటించనుంది.