×
Ad

Oppo Reno 15 Series : ఒప్పో ఫ్యాన్స్ గెట్ రెడీ.. ఒప్పో 3 కొత్త 5G ఫోన్లు వచ్చేస్తున్నాయ్.. జనవరి 8నే లాంచ్.. ధర, ఫీచర్లు లీక్..!

Oppo Reno 15 Series : ఒప్పో మూడు కొత్త 5జీ ఫోన్లు వచ్చేస్తున్నాయి. లాంచ్‌కు ముందుగానే ధర, కీలక ఫీచర్లు రివీల్ అయ్యాయి. ఏయే ఫోన్ ధర ఎంత ఉంటుందో వివరంగా చూద్దాం..

Oppo Reno 15 Series (Image Credit To Original Source)

  • భారత్‌లో ఒప్పో రెనో 15 సిరీస్‌లో 3 మోడళ్లు ఉంటాయి
  • ఒప్పో రెనో 15లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్
  • ఒప్పో ఫోన్ల ధరలను కంపెనీ ఇంకా వెల్లడించలేదు

Oppo Reno 15 Series : ఒప్పో నుంచి మూడు సరికొత్త ఫోన్లు రాబోతున్నాయి. జనవరి 8న భారత మార్కెట్లో ఒప్పో రెనో 15 సిరీస్ లాంచ్ కానుంది. ఈ మూడు కొత్త 5G సిరీస్‌లో ఒప్పో రెనో 15, రెనో 15 ప్రో రెనో 15 ప్రో మినీ ఉన్నాయి. ఈ 3 ఒప్పో ఫోన్లు గురువారం మధ్యాహ్నం 12 గంటలకు లాంచ్ అవుతాయి.

ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ నుంచి కొనుగోలు చేయొచ్చు. లాంచ్‌కు ముందే ఒప్పో రెనో 15 సిరీస్ ధరలు, స్టోరేజీ కాన్ఫిగరేషన్‌లు ఆన్‌లైన్‌లో కనిపించాయి. ఒప్పో రెనో 15 సిరీస్ భారతీయ వేరియంట్ల బ్యాటరీ కెపాసిటీ, చిప్‌సెట్,స్పెసిఫికేషన్‌లను కూడా వెల్లడించింది. ఏయే ఫోన్ ధర ఎంత ఉందో ఇప్పుడు తెలుసుకుందాం..

ఒప్పో రెనో 15 సిరీస్ ధర (అంచనా) :
టిప్‌స్టర్ అభిషేక్ యాదవ్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్ వేదికగా రాబోయే 3 ఒప్పో రెనో 15 సిరీస్ ఫోన్‌ల ధరలు స్టోరేజ్ కాన్ఫిగరేషన్‌లను షేర్ చేశారు. భారత మార్కెట్లో రెనో 15 బేస్ 8GB ర్యామ్ + 256GB స్టోరేజ్ వేరియంట్‌కు దాదాపు ధర రూ. 46వేలు, 12GB ర్యామ్ + 256GB స్టోరేజ్ మోడల్‌ ధర రూ.50వేల కన్నా తక్కువ ఉంటుంది. 12GB ర్యామ్, 512GB స్టోరేజ్‌తో టాప్-ఆఫ్-ది-లైన్ ఆప్షన్ ధర రూ. 54వేలు ధర ఉంటుందని అంచనా.

Oppo Reno 15 Series (Image Credit To Original Source)

Read Also : Samsung Galaxy Ultras : వారెవ్వా.. భారీగా తగ్గిన శాంసంగ్ గెలాక్సీ అల్ట్రా ఫోన్లు.. ఏ ఫోన్ కొంటే బెటర్? ఫుల్ డిటెయిల్స్

భారత మార్కెట్లో ఒప్పో రెనో 15 ప్రో మినీ 12GB ర్యామ్ + 256GB స్టోరేజ్, 12GB ర్యామ్ + 512GB స్టోరేజ్ కాన్ఫిగరేషన్‌లకు వరుసగా ధర రూ. 60వేలు, రూ. 65వేలు ఉంటుందని అంచనా. రెనో 15 ప్రో కూడా అదే స్టోరేజ్ ఆప్షన్లలో అందుబాటులో ఉండనుంది. ఇందులో ఫస్ట్ ఫోన్ రూ. 68వేల నుంచి రెండోది రూ. 73వేల నుంచి ప్రారంభం కానుంది.

ఒప్పో రెనో 15 సిరీస్ ఫీచర్లు :
ఒప్పో రెనో 15 సిరీస్ లాంచ్‌కు ముందే ఫ్లిప్‌కార్ట్, అమెజాన్‌ ల్యాండింగ్ పేజీలను అప్‌డేట్ చేశాయి. ఒప్పో కొత్త సిరీస్‌లో రాబోయే ఫోన్లపై అద్భుతమైన ఫీచర్లను అందిస్తుంది. ఒప్పో రెనో 15 సిరీస్ భారతీయ వేరియంట్ 4nm-ఆధారిత ప్రాసెసర్ మీడియాటెక్ 8450 చిప్‌సెట్‌ కలిగి ఉంటుందని భావిస్తున్నారు. గేమింగ్ కోసం సిగ్నల్ రిసెప్షన్ ఏఐ గేమింగ్ యాంటెన్నా సిస్టమ్ కూడా ఉంది.

ఒప్పో కొత్త సిరీస్‌లో 80W వైర్డు ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టుతో 6,200mAh బ్యాటరీతో వస్తుంది. ఒప్పో రెనో 15 సిరీస్ 2.36 రోజుల బ్యాటరీ లైఫ్ అందిస్తుంది. ఈ ఫోన్ 53 నిమిషాల్లో 1 శాతం నుంచి 100 శాతం వరకు ఛార్జ్ అవుతుంది. 10 నిమిషాల ఛార్జింగ్ 4.3 గంటల వీడియో ప్లేబ్యాక్ టైమ్ అందించగలదు.