Samsung Galaxy Ultras : వారెవ్వా.. భారీగా తగ్గిన శాంసంగ్ గెలాక్సీ అల్ట్రా ఫోన్లు.. ఏ ఫోన్ కొంటే బెటర్? ఫుల్ డిటెయిల్స్
Samsung Galaxy S26 Ultra : శాంసంగ్ గెలాక్సీ ఫోన్లపై అద్భుతమైన డిస్కౌంట్లు.. గెలాక్సీ S26 అల్ట్రా లాంచ్‌కు ముందే శాంసంగ్ గెలాక్సీ S25 అల్ట్రా, గెలాక్సీ S24 అల్ట్రా ఫోన్ల ధరలు తగ్గాయి.. ఏ ఫోన్ ధర ఎంతంటే?
Samsung Galaxy Ultras (Image Credit To Original Source)
- ఫిబ్రవరి 25న శాంసంగ్ గెలాక్సీ S26 అల్ట్రా లాంచ్
- శాంసంగ్ గెలాక్సీ S25 అల్ట్రా భారీగా తగ్గింపు
- శాంసంగ్ గెలాక్సీ S24 అల్ట్రా ఫోన్‌పై రూ.32,009 ఫ్లాట్ డిస్కౌంట్
Samsung Galaxy Ultras : శాంసంగ్ అభిమానులకు గుడ్ న్యూస్.. వచ్చే ఫిబ్రవరి 25న ప్రపంచవ్యాప్తంగా శామ్సంగ్ గెలాక్సీ S26 సిరీస్ లాంచ్ కానుంది. ఈ నేపథ్యంలో కంపెనీ పాత ఫ్లాగ్‌షిప్‌లపై భారీ తగ్గింపు అందిస్తోంది. టాప్ రేంజ్ శాంసంగ్ ఫోన్లు కొనేందుకు ఇదే బెస్ట్ టైమ్.
శాంసంగ్ గెలాక్సీ S25 అల్ట్రా, శాంసంగ్ గెలాక్సీ S24 అల్ట్రా రెండూ ఆన్‌లైన్‌లో భారీ తగ్గింపుతో లభిస్తున్నాయి. మీరు కొనాలనుకుంటే ఈ శాంసంగ్ ఫోన్లలో ఏదైనా ఒకటి కొనేసుకోవచ్చు.. ఏ ఫోన్ ధర ఎంత తగ్గిందో ఇప్పడు వివరంగా తెలుసుకుందాం..
అమెజాన్‌లో శాంసంగ్ గెలాక్సీ S25 అల్ట్రా ధర తగ్గింపు :
భారత మార్కెట్లో గత ఏడాదిలో శాంసంగ్ గెలాక్సీ S25 అల్ట్రా రూ.1,29,999 ధరకు లాంచ్ అయింది. ప్రస్తుతం, అమెజాన్ ఈ ఫోన్‌ను రూ.1,06,290 ధరకు లిస్ట్ చేసింది. అంటే నేరుగా రూ.23,709 తగ్గింపు అందిస్తోంది. మీరు ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌తో పేమెంట్ చేస్తే మరింత తగ్గింపు పొందవచ్చు.
అమెజాన్‌లో రూ.3,207 అమెజాన్ పే క్యాష్‌బ్యాక్‌ను అందిస్తోంది. దాంతో ధర దాదాపు రూ.1,03,083కి తగ్గుతుంది. అన్ని కలిపితే మొత్తం సేవింగ్స్ దాదాపు రూ.26,916కి పెరుగుతుంది. ఎక్స్ఛేంజ్ ఆప్షన్ కూడా అందుబాటులో ఉంది. మీరు ట్రేడింగ్ చేస్తున్న ఫోన్‌ను బట్టి ఫైనల్ వాల్యూ ఉంటుంది.
ఫ్లిప్‌కార్ట్‌లో శాంసంగ్ గెలాక్సీ S24 అల్ట్రా ధర తగ్గింపు :
2024లో రూ.1,29,999 ధరకు లాంచ్ అయిన శాంసంగ్ గెలాక్సీ S24 అల్ట్రా ఇప్పుడు మరింత తగ్గింది. ఫ్లిప్‌కార్ట్‌లో ఈ శాంసంగ్ ఫోన్ ప్రస్తుతం రూ.97,990కి లిస్ట్ అయింది. తద్వారా రూ.32,009 ఫ్లాట్ డిస్కౌంట్ లభిస్తుంది.

Samsung Galaxy Ultras (Image Credit To Original Source)
ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ యూజర్లు అదనంగా రూ.4వేలు తగ్గింపు పొందవచ్చు. తద్వారా ధర దాదాపు రూ.93,990కి తగ్గుతుంది. దాదాపు ధర మొత్తానికి రూ.36,009కి తగ్గింది. అమెజాన్ మాదిరిగానే ఫ్లిప్‌కార్ట్ కూడా ఇదే ఆఫర్‌తో ఎక్స్ఛేంజ్ డీల్స్ కూడా అందిస్తుంది.
శాంసంగ్ గెలాక్సీ S25 అల్ట్రా vs శాంసంగ్ గెలాక్సీ S24 అల్ట్రా.. ఏది బెటర్? :
శాంసంగ్ గెలాక్సీ S25 అల్ట్రా 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.9-అంగుళాల అమోల్డ్ డిస్‌ప్లే, స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ చిప్‌సెట్, 16GB ర్యామ్ వరకు 1TB వరకు స్టోరేజీ ఆప్షన్లను అందిస్తుంది. 45W ఫాస్ట్ ఛార్జింగ్‌తో 5000mAh బ్యాటరీని అందిస్తుంది. ఆండ్రాయిడ్ 16 ఆధారంగా వన్ యూఐ 8తో రన్ అవుతుంది.
కెమెరా సెటప్‌లో 200MP మెయిన్ సెన్సార్, 50MP అల్ట్రా-వైడ్, 50MP పెరిస్కోప్ 10MP టెలిఫోటో లెన్స్ ఉన్నాయి.గెలాక్సీ S24 అల్ట్రా టైటానియం ఫ్రేమ్, 6.8-అంగుళాల డైనమిక్ అమోల్డ్ 2X డిస్‌ప్లే, చిప్‌సెట్ కోసం స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 ఇలాంటి 200MP, ఎల్ఈడీ కెమెరా సెటప్ అందిస్తుంది. బ్యాటరీ సామర్థ్యం, ఛార్జింగ్ స్పీడ్ కూడా ఒకేలా ఉంటాయి.
