Google AI Overview : బాబోయ్.. గూగుల్ AIతో జాగ్రత్త.. యూజర్ అడిగిన ప్రశ్నకు ఏం చెప్పిందంటే? మస్క్ రియాక్షన్ ఇదిగో..!

Google AI Overview : ఏఐని అసలు నమ్మొద్దు.. ఏఐ అడిగిన ప్రశ్నలకు తప్పుడు సమాధానాలే ఇస్తోంది. ఒక యూజర్ అడిగిన ప్రశ్నకు తప్పుగా సమాధానమిచ్చింది. దీనిపై ఎలన్ మస్క్ ఏమన్నారంటే?

Google AI Overview : బాబోయ్.. గూగుల్ AIతో జాగ్రత్త.. యూజర్ అడిగిన ప్రశ్నకు ఏం చెప్పిందంటే? మస్క్ రియాక్షన్ ఇదిగో..!

Google AI Overview (Image Credit To Original Source)

Updated On : January 7, 2026 / 3:36 PM IST
  • గూగుల్ ఏఐ ఓవర్‌వ్యూ రాంగ్ ఆన్సర్
  • యూజర్ అడిగిన ప్రశ్నకు వచ్చే ఏడాది 2026గా చెప్పిన ఏఐ
  • ఎలన్ మస్క్ ఎక్స్ వేదికగా స్పందన

Google AI Overview : ఇప్పుడంతా ఏఐ ట్రెండ్.. అన్నింటికి ఏఐనే తెగ వాడేస్తున్నారు. మీరు కూడా ఏఐ వాడుతున్నారా? ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎక్కువగా వాడేవారికి షాకింగ్ న్యూస్.. గూగుల్ ఏఐ మోడ్ తప్పుగా సమాధానాలిస్తోంది జాగ్రత్త.

ఏఐ యూజర్లు అడిగిన ప్రశ్నలకు సరైన సమాధానం ఇవ్వకుండా తప్పుగా సూచనలు చేస్తోంది. ఒక యూజర్ గూగుల్ ఏఐని అడిగిన ప్రశ్నతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. గూగుల్ ఏఐ ఓవర్వ్యూని వచ్చే సంవత్సరం 2027 అవుతుందా అని అడిగితే ఏఐ ఆశ్చర్యకరమైన సమాధానం ఇచ్చింది.

ప్రస్తుత సంవత్సరాన్ని మర్చిపోయిన ఏఐ 2027కి బదులుగా వచ్చే ఏడాది 2026 అని చెప్పింది. ఒక యూజర్ ఎక్స్ వేదికగా గూగుల్ సెర్చ్ క్వెరీ స్క్రీన్ షాట్ ను షేర్ చేశాడు. వచ్చే ఏడాది 2027 కాదా? అని గూగుల్ ఏఐని అడగ్గా లేదు.. 2027 వచ్చే ఏడాది కాదు. 2026 అంటూ సమాధానం ఇచ్చింది. ఏఐ చాట్‌బాట్, గ్రోక్ ఏఐ కొత్త ఫీచర్లపై మాట్లాడే ఎలన్ మస్క్ కూడా దీనిపై స్పందించారు. గూగుల్ ఏఐ ఇంకా అప్ గ్రేడ్ అవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.

రాంగ్ ఆన్సర్ చెప్పిన ఏఐ మోడ్ :

ప్రస్తుత రోజుల్లో చాలా మంది ఏఐపైనే ఆధారపడుతున్నారు. తమకు ఎలాంటి సందేహం ఉన్న ఏఐనే అడిగేస్తున్నారు. ఈ క్రమంలో గూగుల్ ఏఐ మోడ్ నుంచి యూజర్లు అడిగిన ప్రశ్నలకు తప్పుగా సమాధానం ఇస్తోంది. ఈ గూగుల్ ఏఐ మోడల్ చెప్పిన ఆన్సర్ కు సంబంధించి అనేక స్క్రీన్‌షాట్‌లు సోషల్ మీడియా వేదికగా షేర్ అవుతున్నాయి.

Read Also : Apple iPhone 21 : ఆపిల్ లవర్స్ మీకోసమే.. 200MP కెమెరాతో కొత్త ఐఫోన్ 21 వస్తోందోచ్.. 2028 వరకు ఆగాల్సిందే..

ఇదేం ఫస్ట్ టైమ్ కాదు :
గూగుల్ ఏఐ ఓవర్‌వ్యూ తప్పుడు సమాచారం ఇవ్వడం ఇదే మొదటిసారి కాదు. ఏఐ మోడ్ ప్రారంభంలో ఈ ఫీచర్ వినియోగదారులకు అనేక తప్పుడు సమాధానాలను అందించింది. పిజ్జాలో ‘జిగురు’ లేదా విటమిన్ల కోసం రాళ్ళు తినమని సూచించడం వివాదాస్పదమైంది.

అయితే, గూగుల్ జెమిని ఏఐ ఓవర్‌వ్యూలో లోపాలు తగ్గుతున్నాయి. అయినప్పటికీ, ఈ చాట్‌బాట్ ఏడాదిగా గందరగోళంగా ఉంది. గతంలో, ‘కాల్ ఆఫ్ డ్యూటీ: బ్లాక్ ఆప్స్ 7’ ను ఫేక్ గేమ్ అని సూచించింది. అయితే ఏఐ మోడ్‌లో ఒకే ప్రశ్న లేదా ఇలాంటి ప్రశ్నలు నేరుగా అడిగితే ఎలాంటి తప్పులు కనిపించవు.

ఆరోగ్యంపై కూడా ఏఐ రాంగ్ డేటా :
ది గార్డియన్ ప్రకారం.. గూగుల్ ఏఐ మోడ్ తప్పుడు ఆరోగ్య సమాచారాన్ని అందిస్తోంది. ఈ డేటాతో ప్రజలను తప్పుదారి పట్టించే అవకాశం ఉందని తేలింది. ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ ఉన్నవారు అధిక కొవ్వు పదార్ధాలను నివారించాలని ఏఐ తప్పుగా సూచించింది. నిపుణుల అభిప్రాయానికి కూడా విరుద్దంగా ఏఐ సమాధానం ఇచ్చింది. ఇలాంటి తప్పుడు సమాచారంతో ఏఐపై రానురాను వినియోగదారులు నమ్మే పరిస్థితి ఉండదు.