Oppo Reno13 5G Deal : వారెవ్వా.. కిర్రాక్ డిస్కౌంట్.. ఈ ఒప్పో 5జీ ఫోన్ చాలా చీప్ బ్రో.. ధర తెలిస్తే కొనకుండా ఉండలేరు
Oppo Reno13 5G Deal : ఫ్లిప్‌కార్ట్ గోట్ సేల్ ముగుస్తోంది.. మీరు రూ. 35,000 లోపు కొత్త ఫోన్ కొనాలని చూస్తుంటే ఇంతకన్నా అద్భుతమైన టైమ్ ఉండదు.. ఇలా కొన్నారంటే తక్కువకే సొంతం చేసుకోవచ్చు.
Oppo Reno13 5G Deal
- 6.59-అంగుళాల 1.5K ఫ్లాట్ ఓఎల్ఈడీ కర్వ్డ్ డిస్ప్లే ఆప్షన్
- 50MP ప్రైమరీ కెమెరా, 50MP ఫ్రంట్ కెమెరా సెటప్
- ప్రారంభ ధర కన్నా సుమారుగా రూ. 5,225 తక్కువకే
Oppo Reno13 5G Deal : ఒప్పో లవర్స్ డోంట్ మిస్.. మీరు రూ. 35వేల లోపు కొత్త ఫోన్ కొనాలని చూస్తుంటే ఇది మీకోసమే.. ధర తగ్గింపులు, బ్యాంక్ ఆఫర్లతో సహా ఒప్పో రెనో 13 5జీ ఫోన్ అతి చౌకైన ధరకే లభిస్తోంది. ఈ ఫోన్ భారీ డిస్కౌంట్లతో లభిస్తోంది. ఎక్స్ఛేంజ్ ఆఫర్లతో కూడా అదనపు డిస్కౌంట్ పొందవచ్చు. ఒప్పో రెనో 13 5జీపై ఆఫర్లు, డిస్కౌంట్లు, ధరను వివరంగా ఇప్పుడు పరిశీలిద్దాం..
ఒప్పో రెనో 13 5జీ ధర, ఆఫర్లు :
2025 జనవరిలో ఒప్పో రెనో 13 5జీ రూ. 37,999 ధరకు లాంచ్ కాగా ప్రస్తుతం 8జీబీ+128జీబీ స్టోరేజ్ వేరియంట్ ఈ-కామర్స్ సైట్లో రూ. 34,999 ధరకే లభిస్తోంది. ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ లావాదేవీలపై రూ. 2,225 తగ్గింపుతో బ్యాంక్ ఆఫర్లు పొందవచ్చు. దాంతో అసలు ధర రూ. 32,774కు చేరింది. ఈ ఫోన్ ప్రారంభ ధర కన్నా సుమారుగా రూ. 5,225 తక్కువకే లభిస్తోంది.
ఒప్పో రెనో 13 5జీ ఫీచర్లు, స్పెసిఫికేషన్లు :
ఒప్పో రెనో 13 5జీ ఫోన్ 6.59-అంగుళాల 1.5K ఫ్లాట్ ఓఎల్ఈడీ కర్వ్డ్ డిస్ప్లే ఉంది. రిజల్యూషన్ 2760×1256 పిక్సెల్స్, రిఫ్రెష్ రేట్ 120Hz అందిస్తుంది. ఇన్-డిస్ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్‌తో వస్తుంది. ఆక్టా-కోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 8350 చిప్సెట్తో వస్తుంది.
ఆండ్రాయిడ్ 15 ఆధారిత కలర్ఓఎస్ 15పై రన్ అవుతుంది. 80W సూపర్‌వూక్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టు ఇచ్చే 5800mAh బ్యాటరీతో వస్తుంది. కొలతల పరంగా పొడవు 157.90mm, వెడల్పు 74.73mm, మందం 7.24mm, బరువు 181 గ్రాములు ఉంటుంది.
కెమెరా సెటప్ విషయానికి వస్తే..
ఒప్పో రెనో 13 5జీ ఫోన్ బ్యాక్ సైడ్ ఎఫ్/1.8 అపర్చర్, OIS సపోర్ట్‌తో 50MP ప్రైమరీ కెమెరా, ఎఫ్/2.2 అపర్చర్‌తో 8MP అల్ట్రా-వైడ్ కెమెరా ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాలింగ్ కోసం ఎఫ్/2.0 అపర్చర్‌తో 50MP ఫ్రంట్ కెమెరా కూడా ఉంది. ఈ ఫోన్ డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ కోసం IP66 + IP68 + IP69 రేటింగ్‌తో వస్తుంది. కనెక్టివిటీ ఆప్షన్లలో 5G, Wi-Fi 6, బ్లూటూత్ 5.4, GPS, యూఎస్బీ టైప్-సి పోర్ట్ ఉన్నాయి.
