Paytm Payments Bank : పేటీఎంకు ఆర్బీఐ గుడ్‌న్యూస్..!

డిజిటల్ పేమెంట్ కంపెనీ పేటీఎం (Paytm)కు రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా (RBI) గుడ్ న్యూస్ చెప్పింది. పేటీఎం పేమెంట్ బ్యాంకు‌కు ఆర్బీఐ షెడ్యూల్ పేమెంట్స్ బ్యాంకు స్టేటస్ అందించింది.

Paytm Payments Bank : డిజిటల్ పేమెంట్ కంపెనీ పేటీఎం (Paytm)కు రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా (RBI) గుడ్ న్యూస్ చెప్పింది. పేటీఎం పేమెంట్ బ్యాంకు (Paytm Payments Bank)కు ఆర్బీఐ షెడ్యూల్ పేమెంట్స్ బ్యాంకు స్టేటస్ ఇస్తున్నట్టు ప్రకటించింది. పేటీఎం 2017లో పేటీఎం పేమెంట్ బ్యాంకు (Paytm Payments Bank) సర్వీసును పేటీఎం లాంచ్ చేసింది. అయితే తాజాగా ఈ సర్వీసుకు ఆర్భీఐ షెడ్యూల్ పేమెంట్ బ్యాంకు సర్వీసును అందించింది. RBI యాక్ట్-1934 కింద ఈ నిర్ణయం తీసుకున్నట్లు రిజర్వ్ బ్యాంకు ఒక ప్రకటనలో వెల్లడించింది. తద్వారా పేటీఎం కంపెనీ కొత్త బిజినెస్ వ్యవహారాలపై దృష్టిపెట్టనుంది.

వ్యాపారపరంగా పేటీఎంకు మరిన్ని అవకాశాలను పొందనుంది. ప్రభుత్వంతో పాటు పెద్ద కంపెనీలు జారీ చేసే రిక్వెస్ట్ ఆఫ్ ప్రొపోజల్స్(RFP)లో పేటీఎం భాగస్వామ్యం కావొచ్చు. ప్రైమరీ వేలాల్లో కూడా పాల్గొనే అవకాశం పేటీఎంకు దక్కనుంది. పేటీఎం షెడ్యూల్‌ బ్యాంకు స్టేటస్‌పై సెప్టెంబర్‌లోనే RBI నిర్ణయం తీసుకుంది. అయితే దానిపై నోటిఫికేషన్‌ను గత అక్టోబర్‌ నెలలో ఆర్బీఐ జారీ చేసింది. తమకు షెడ్యూల్ బ్యాంకు స్టేటస్ వచ్చిన విషయాన్ని పేటీఎం పేమెంట్స్ బ్యాంకు తాజాగా ప్రకటించింది. అసలు ఈ షెడ్యూల్ బ్యాంకు స్టేటస్ ద్వారా పేటీఎంకు అనేక ప్రయోజనాలు దక్కనున్నాయి.

ఆర్బీఐ నిబంధనలను షెడ్యూల్ బ్యాంకులు ఫాలో అవుతుంటాయి. ఆర్బీఐ అందించే రుణాలను కూడా పొందవచ్చు. రోజువారీ బ్యాంకింగ్ లావాదేవీలకు ఆర్బీఐ నుంచి నగదును కూడా రుణంగా తీసుకునే సౌకర్యం షెడ్యూల్ బ్యాంకులకు ఉంటుంది. మార్చి 31, 2021 నాటికి పేటీఎం పేమెంట్స్ బ్యాంకులో సుమారు 6.4 కోట్లకు పైగా సేవింగ్స్ అకౌంట్లు ఉన్నాయి. సేవింగ్స్ అకౌంట్లు, కరెంట్ అకౌంట్లు, పార్టనర్ బ్యాంకుల ఫిక్స్‌డ్ డిపాజిట్ల మొత్తం రూ.5200 కోట్లపైనే ఉన్నాయి. రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా ఈ షెడ్యూల్డ్ బ్యాంకు స్టేటస్ కల్పించడం ద్వారా పేటీఎంకు మరిన్ని అవకాశాలను సొంతం చేసుకోనుంది.

Read Also : OnePlus 9 Discounts : వన్+ స్మార్ట్ ఫోన్లపై భారీ డిస్కౌంట్లు.. డోంట్ మిస్!

ట్రెండింగ్ వార్తలు