Moto G96 vs CMF Phone 2 Pro: ఈ రెండు స్మార్ట్‌ఫోన్లు ఏం ఉన్నాయ్ భయ్యా? రెండింటిలో ఏది బెటర్ అంటే?
ఈ రెండు స్మార్ట్‌ఫోన్ల ఫీచర్లను పోల్చి చూద్దాం..

కొత్త ఫోన్ కొనాలనుకున్నప్పుడు మనకు నచ్చిన రెండు మంచి ఫోన్లు ఒకేసారి మార్కెట్లోకి వస్తే కన్ఫ్యూజ్ అవ్వడం సహజం. ఇప్పుడు చాలామంది టెక్ ప్రియులు మోటోరోలా మోటో G96 5G, అలాగే సీఎంఎఫ్ ఫోన్2 ప్రో 5Gలో ఏది కొనాలో తెలియక సతమతమవుతున్నారు. రెండూ మంచి ఫీచర్లతో, ఆకర్షణీయమైన ధరలతో వచ్చాయి.
ఈ రెండు స్మార్ట్‌ఫోన్ల ఫీచర్లను పోల్చి చూద్దాం..
స్పీడ్, పర్ఫార్మెన్స్
సీఎంఎఫ్ ఫోన్2 ప్రో: గేమ్స్ ఆడటానికి, ఫోన్ స్మూత్‌గా పనిచేయడానికి ప్రాసెసర్ చాలా ముఖ్యం. ఇందులో మీడియాటెక్ డైమెన్‌సిటీ 7300 ప్రో ప్రాసెసర్ ఉంది. సింపుల్‌గా చెప్పాలంటే ఇది చాలా పవర్‌ఫుల్.
మోటోరోలా మోటో G96 5G: ఇందులో స్నాప్‌డ్రాగన్ 7ఎస్ జన్ 2 ప్రాసెసర్ ఉంది. ఇది కూడా మంచిదే, కానీ CMF ఫోన్‌తో పోలిస్తే కొంచెం వెనుకబడింది.
పర్ఫార్మెన్స్ విషయంలో సీఎంఎఫ్ ఫోన్2 ప్రో కొంచెం బెటర్.
డిస్‌ప్లే, బ్యాటరీ
మంచి స్క్రీన్ ఎక్స్‌పీరియన్స్, ఎక్కువ బ్యాటరీ లైఫ్ చాలా ముఖ్యం.
మోటోరోలా మోటో G96 5G: దీనికి రెండు పెద్ద ప్లస్ పాయింట్లు ఉన్నాయి. ఒకటి, 5500mAh భారీ బ్యాటరీ, అంటే రోజంతా చార్జింగ్ ఆగకుండా వస్తుంది. రెండు, 144Hz రిఫ్రెష్ రేట్ డిస్‌ప్లే, దీనివల్ల స్క్రీన్ స్క్రోలింగ్ చాలా స్మూత్‌గా ఉంటుంది.
సీఎంఎఫ్ ఫోన్2 ప్రో: దీని డిస్‌ప్లే క్వాలిటీ (Flex AMOLED, HDR10+) చాలా బాగుంటుంది, వీడియోలు చూసేటప్పుడు రంగులు ప్రకాశవంతంగా కనిపిస్తాయి. కానీ బ్యాటరీ (5000mAh) కొంచెం చిన్నది.
ఎక్కువ బ్యాటరీ లైఫ్, స్మూత్ స్క్రోలింగ్ కోసం అయితే Moto G96 బెస్ట్. బెస్ట్ వీడియో క్వాలిటీ కోసం అయితే సీఎంఎఫ్ ఫోన్2 ప్రో బెటర్.
కెమెరా
మోటోరోలా మోటో G96 5G: సెల్ఫీల విషయంలో ఇదే బెటర్. ఇందులో 32MP ఫ్రంట్ కెమెరా ఉంది. సోషల్ మీడియాలో పోస్ట్ చేయడానికి మంచి సెల్ఫీలు కావాలనుకునే వారికి ఇది బాగా నచ్చుతుంది.
సీఎంఎఫ్ ఫోన్2 ప్రో: బ్యాక్‌సైడ్ ట్రిపుల్ కెమెరా సెటప్ (50MP + 50MP + 8MP) ఉంది. దీనివల్ల వైడ్ యాంగిల్ ఫొటోలు, జూమ్ ఫొటోలు వంటివి బాగా తీయొచ్చు. కానీ సెల్ఫీ కెమెరా (16MP) అంత గొప్పగా లేదు.
బెస్ట్ సెల్ఫీలు కావాలంటే మోటో G96 5G కొనండి. బ్యాక్ కెమెరాతో రకరకాల ఫొటోలు తీయాలనుకుంటే CMF Phone 2 Pro బెటర్.
ధర
మోటోరోలా మోటో G96 5G: దీని ధర రూ.17,999. ఫ్లిప్‌కార్ట్‌లో EMI ఆప్షన్లు, ఆఫర్లు కూడా అందుబాటులో ఉన్నాయి.
సీఎంఎఫ్ ఫోన్2 ప్రో: దీని ధర రూ.20,900. ప్రస్తుతం పెద్దగా డిస్కౌంట్లు లేవు. ఇది మోటో కంటే కొంచెం ఖరీదైనది.
తక్కువ ధరలో మంచి ప్యాకేజీ కావాలంటే మోటో G96 5G కొనండి.
మీకు ఏది బెటర్?
మీకు సూపర్ సెల్ఫీ కెమెరా, రోజంతా వచ్చే బ్యాటరీ, చాలా స్మూత్ డిస్‌ప్లే.. అదీ తక్కువ ధరలో కావాలనుకుంటే మోటోరోలా మోటో G96 5G 5G కొనండి.
మీరు కొంచెం ఎక్కువ ఖర్చు చేసి, బెస్ట్ పర్ఫార్మెన్స్, మంచి కెమెరా సిస్టమ్, అద్భుతమైన వీడియో క్వాలిటీ కావాలంటే… సీఎంఎఫ్ ఫోన్2 ప్రో 5G బెటర్.