PM Surya Ghar Solar Scheme : ఉచిత విద్యుత్ కోసం ‘రూఫ్‌టాప్ సోలార్ స్కీమ్’.. ఎలా దరఖాస్తు చేసుకోవాలో తెలుసా?

Rooftop Solar Scheme : సామాన్య పౌరుల కోసం ఉచిత విద్యుత్ అందించేందుకు రూఫ్‌టాప్ సోలార్ పథకాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. ఇందుకోసం ఎలా దరఖాస్తు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

PM Modi Announces Rooftop Solar Scheme For Free Electricity

How to Apply for Rooftop Solar Scheme : సామాన్యులపై విద్యుత్ ఛార్జీల భారాన్ని తగ్గించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ ‘రూఫ్‌టాప్ సోలార్ స్కీమ్’ను ప్రకటించారు. ప్రజల శ్రేయస్సు కోసం ఇంటి పైకప్పులపై సోలార్ ప్యానెళ్ల ఏర్పాటును ప్రోత్సహించే దిశగా చేపట్టిన ఈ కార్యక్రమానికి ‘పీఎం సూర్య ఘర్: ముఫ్త్ బిజిలీ యోజన’ అని పేరు పెట్టినట్టు ఆయన తెలిపారు.

Read Also : Gemini AI Virtual Assistant : ఆండ్రాయిడ్ ఫోన్లలో ‘డిఫాల్ట్ వర్చువల్ అసిస్టెంట్’గా జెమిని ఏఐ మోడల్.. ఇదేలా వాడాలంటే?

అంతేకాదు.. ఈ స్కీమ్ కింద రూ.75వేల కోట్ల పెట్టుబడితో ప్రతి నెలా 300 యూనిట్ల వరకు దేశవ్యాప్తంగా ఉచిత విద్యుత్ అందించడం ద్వారా కోటి కుటుంబాల్లో వెలుగులు నింపాలని లక్ష్యంగా పెట్టుకుందని మోదీ ట్విట్టర్ (X)వేదికగా వెల్లడించారు. ఈ పథకాన్ని పొందడానికి ఎలా అప్లయ్ చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. pmsuryaghar.gov.in అనే వెబ్‌సైట్‌ విజిట్ చేయాల్సి ఉంటుంది. ఈ సైట్లోనే ఉచిత విద్యుత్ కోసం అప్లయ్ చేసుకోవచ్చు.

రూఫ్‌టాప్ సోలార్ స్కీమ్ కోసం ఎలా దరఖాస్తు చేయాలంటే?

  • pmsuryaghar వెబ్‌సైట్‌లో ‘Apply for rooftop solar’కి వెళ్లండి.
  • ఈ పోర్టల్ వెబ్‌సైట్లో మీ పేరును రిజిస్టర్ చేసుకోండి.
  • మీ రాష్ట్రం, విద్యుత్ సరఫరా చేసే కంపెనీని ఎంచుకోవాలి.
  • ఆపై పోర్టల్‌లో పూర్తి వివరాలను ఎంటర్ చేయండి.
  • మీ విద్యుత్ కన్జ్యూమర్‌ నెంబర్ తప్పనిసరిగా ఎంటర్ చేయాలి.
  • మొబైల్ నంబర్‌ని ఎంటర్ చేయాలి.
  • ఇమెయిల్‌ ఐడీ కూడా ఎంటర్ చేయాల్సి ఉంటుంది.
  • మీ కన్జ్యూమర్‌ నంబర్ & మొబైల్ నంబర్‌ని ఉపయోగించి లాగిన్ చేయండి.
  • ఫారమ్ ప్రకారం.. రూఫ్‌టాప్ సోలార్ కోసం ఇలా దరఖాస్తు చేసుకోండి
  • (DISCOM) నుంచి ఆమోదం వచ్చేంత వరకు వేచి ఉండాలి.
  • ఆమోదం పొందిన తర్వాత మీ DISCOM నమోదిత విక్రేతల ద్వారా సోలార్ ప్లాంట్‌ను ఇన్‌స్టాల్ చేయండి.
  • ఇన్‌స్టాలేషన్ పూర్తయిన తర్వాత, ప్లాంట్ వివరాలను సమర్పించి నెట్ మీటర్ కోసం దరఖాస్తు చేసుకోండి.
  • నెట్ మీటర్‌ను ఇన్‌స్టాల్ చేసిన తర్వాత డిస్కం అధికారులు వచ్చి తనిఖీ చేస్తారు.
  • ఆ తర్వాత అధికారులు పోర్టల్ నుంచి కమీషనింగ్ సర్టిఫికేట్‌ను మీకు అందిస్తారు.
  • మీరు కమీషన్ నివేదికను స్వీకరించిన తర్వాత పోర్టల్ ద్వారా బ్యాంక్ అకౌంట్ వివరాలను క్యాన్సిల్డ్ చెక్కును సమర్పించండి.
  • ఈ స్కీమ్ కింద పొందిన సబ్సిడీ 30 రోజుల్లోగా మీ బ్యాంక్ అకౌంట్లోకి బదిలీ అవుతుంది.

Read Also : Tata Motors EV Price Cut : భారత్‌లో ఎలక్ట్రిక్ కార్ల ధరలను భారీగా తగ్గించిన టాటా మోటార్స్.. కొంటే ఇప్పుడే కొనేసుకోండి!

ట్రెండింగ్ వార్తలు