Poco M3 Pro 5G : పోకో నుంచి 5G స్మార్ట్‌ఫోన్.. ఫ్లిప్ కార్ట్‌లో సేల్
ప్రముఖ స్మార్ట్ ఫోన్ దిగ్గజం పోకో నుంచి 5G స్మార్ట్ ఫోన్ రాబోతోంది. జూన్ 8న భారత స్మార్ట్ ఫోన్ మార్కెట్లో లాంచ్ కానుంది. ఈకామర్స్ దిగ్గజం ఫ్లిప్ కార్ట్ లో అందుబాటులోకి రానుంది.

Poco M3 Pro 5g
Poco M3 Pro 5G : ప్రముఖ స్మార్ట్ ఫోన్ దిగ్గజం పోకో నుంచి 5G స్మార్ట్ ఫోన్ రాబోతోంది. జూన్ 8న భారత స్మార్ట్ ఫోన్ మార్కెట్లో లాంచ్ కానుంది. ఈకామర్స్ దిగ్గజం ఫ్లిప్ కార్ట్ లో అందుబాటులోకి రానుంది. ఈ మోడల్ భారతీయ వేరియంట్ గ్లోబల్ వేరియంట్‌తో సమానంగా ఉంటుందని టాక్.. ఫ్లిప్‌కార్ట్ లో ఈ స్మార్ట్‌ఫోన్ కోసం ప్రత్యేకమైన పేజీని ఏర్పాటు చేసింది. FHD+ డిస్‌ప్లే, 90Hz రిఫ్రెష్ రేట్‌తో వస్తుందని నిర్ధారిస్తుంది.
పోకో M3 ప్రో 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్‌కు సపోర్టు చేస్తుంది. 6.5-అంగుళాల FHD+ డిస్‌ప్లేతో వస్తుంది. 5G స్మార్ట్‌ఫోన్‌కు మీడియాటెక్ డైమెన్సిటీ 700 చిప్‌తో పాటు 6GB ర్యామ్, 128GB స్టోరేజ్ ఉంటుంది. ట్రిపుల్ కెమెరా సెటప్‌తో పాటు 48MP కెమెరా, 2MP మాక్రో కెమెరా, 2MP డెప్త్ సెన్సార్‌తో ఈ డివైస్ వస్తుంది. ఫ్రంట్ సైడ్ కెమెరా 8MP ఉంటుంది.
Need for speed? We got you covered! 😉 #POCOM3Pro with Mad Speed, Killer Looks is launching on 8th June, at 11:30 AM on @Flipkart. pic.twitter.com/bMpJHuAk04
— POCO India – Register for Vaccine ?? (@IndiaPOCO) June 3, 2021
POCO M3 ప్రో జూన్ 8న భారతదేశంలో లాంచ్ అవుతుంది. గ్లోబల్ ప్రారంభ ధర 159 యూరోలకు లభ్యం కానుంది. భారత కరెన్సీలో ఈ మోడల్ ధర రూ.14వేల నుంచి రూ.15వేల మధ్య అందుబాటులో ఉంటుంది. ఈ ఫోన్ 18W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టుతో వస్తుంది. 5,000mAh బ్యాటరీని కలిగి ఉంది. ఆండ్రాయిడ్ 11 ఆధారంగా MIUI 12లో రన్ అవుతుంది. స్మార్ట్‌ఫోన్‌లో సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ కూడా ఉంటుంది. పోకో M3 ప్రో కూల్ బ్లూ, పవర్ బ్లాక్, పోకో ఎల్లో సహా 3 కలర్ వేరియంట్లలో రానుంది.