Poco X7 Series : అద్భుతమైన ఫీచర్లతో పోకో X7 సిరీస్ వచ్చేసింది.. ఈ ఫోన్ ధర ఎంతో తెలుసా?

Poco X7 Series : పోకో X7 బేస్ వేరియంట్ ధర రూ. 21,999కి లాంచ్ అయింది. 8జీబీ+ 256జీబీ మోడల్‌కు రూ. 23,999కి చేరుకుంది.

Poco X7 And X7 Pro With MediaTek Dimensity Chipset Launched

Poco X7 Series : భారత మార్కెట్లో పోకో కొత్త X7 సిరీస్‌ను ప్రకటించింది. కొత్త సంవత్సరంలో ఇదే ఫస్ట్ ఫోన్. పోకో పవర్-ప్యాక్డ్ ఫోన్లను కలిగి ఉంది. పోకో ఎక్స్7 సిరీస్ రాబోయే నెలల్లో పవర్ ఫ్యాకింగ్ ఫోన్లను తీసుకు రావాలని భావిస్తోంది. పోకో కొత్త X7, పోకో X7 ప్రో మోడల్‌లను మీడియాటెక్ డైమెన్సిటీ చిప్‌సెట్‌ని ఉపయోగిస్తోంది. మీరు హైపర్‌ఓఎస్ వెర్షన్‌ను బాక్స్ నుంచి పొందవచ్చు.

Read Also : Apple iPhone 17 Launch : భారీ అప్‌గ్రేడ్‌లతో ఆపిల్ ఐఫోన్ 17 వచ్చేస్తోంది.. మునుపెన్నడూ చూడని ఫీచర్లు..!

భారత్‌లో పోకో ఎక్స్7, పోకో ఎక్స్7 ప్రో ధర :
భారత మార్కెట్లో పోకో X7 బేస్ వేరియంట్ ధర రూ. 21,999కి లాంచ్ అయింది. 8జీబీ+ 256జీబీ మోడల్‌కు రూ. 23,999కి చేరుకుంది. పోకో X7 ప్రో భారత మార్కెట్లో ప్రారంభ ధర రూ. 26,999గా ఉంది. ఈ రెండు ఫోన్‌లు జనవరి 14 నుంచి దేశంలో అందుబాటులోకి రానున్నాయి.

పోకో ఎక్స్7, ఎక్స్7 ప్రో ఫీచర్లు :
పోకో ఎక్స్7 మోడల్‌లు 120Hz రిఫ్రెష్ రేట్, డాల్బీ విజన్‌తో 6.67, 6.73-అంగుళాల అమోల్డ్ డిస్‌ప్లేలను కలిగి ఉన్నాయి. పోకో ఎక్స్7 మీడియా టెక్ డైమెన్సిటీ 7300 అల్ట్రా ద్వారా పవర్ పొందుతుంది.

Poco X7 And X7 Pro Series

అయితే, పోకో ఎక్స్7 ప్రో డైమెన్సిటీ 8400 అల్ట్రా వెర్షన్‌ను ఉపయోగిస్తుంది. మీరు గరిష్టంగా 12జీబీ ర్యామ్, 256జీబీ స్టోరేజీతో ఫోన్లను పొందుతారు. మీరు పోకో ఫోన్ స్టోరేజీని విస్తరించలేరు. పోకో కొత్త ఆండ్రాయిడ్ 15 ఆధారిత హైపర్ఓఎస్ 2 వెర్షన్‌ను ఆఫర్ చేస్తోంది.

ఇమేజింగ్ ఫీచర్ల విషయానికి వస్తే.. పోకో ఎక్స్7 ఫోన్ 8ఎంపీ అల్ట్రావైడ్ లెన్స్‌తో పాటు ప్రైమరీ 50ఎంపీ సెన్సార్‌ను కలిగి ఉంది. పోకో ఎక్స్7 ప్రో 50ఎంపీ ప్రైమరీ సెన్సార్, 8ఎంపీ అల్ట్రావైడ్ లెన్స్‌తో వస్తుంది.

ఈ ఫోన్‌ల ఫ్రంట్ సైడ్ 20ఎంపీ సెల్ఫీ కెమెరా ఉంటుంది. పోకో ఎక్స్7 45డబ్ల్యూ ఛార్జింగ్ స్పీడ్‌కు సపోర్టుతో 5,500mAh బ్యాటరీని అందిస్తుంది. అయితే, పోకో X7 ప్రో వేరియంట్ 90డబ్ల్యూ వైర్డ్ ఛార్జింగ్ స్పీడ్‌కు సపోర్టుతో 6,550mAh బ్యాటరీని అందిస్తుంది.

Read Also : iPhone 16E Launch : కొత్త ఐఫోన్ కోసం చూస్తున్నారా? చౌకైన ధరకే ఐఫోన్ 16E వచ్చేస్తోంది.. ఫీచర్లు, డిజైన్ వివరాలివే!