పబ్‌జీ రెండు కొత్త గేమ్‌లతో వస్తోంది.. పీసీ, మొబైల్ రెండింట్లో ఆడొచ్చు!

PUBG getting two new games by 2022 : పాపులర్ వీడియో గేమ్.. పబ్‌జీ బాటిల్ రాయల్ యూనివర్స్‌లో రెండు కొత్త గేములతో వస్తోంది. ఈ విషయాన్ని క్రాఫ్టాన్ సీఈఓ కిమ్ చాంగ్ హన్ ఒక ప్రకటనలో వెల్లడించారు. సౌత్ కొరియన్ సంస్థ అయిన క్రాఫ్టన్‌ పబ్‌జీ కార్పొరేషన్‌తో పాపులర్ ప్లేయర్ అన్ నౌన్ బాటిల్ గ్రౌండ్ గేమ్‌తో మరింత క్రేజ్ సంపాదించుకుంది. 2022 నాటికి కొత్త పబ్ జీ ఆధారిత గేమ్ ఒకటి ప్రత్యేకించి పీసీ కన్సోల్ కోసం ప్రవేశపెట్టనుంది. అలాగే మొబైల్ యూజర్ల కోసం కొత్త బాటిల్ రాయల్ టైటిల్ లాంచ్ చేసే అవకాశం ఉందని కంపెనీ సీఈఓ పేర్కొన్నారు.

పబ్ జీ ఆధారిత హార్రర్ గేమ్.. దీనికి ‘The Callisto Protocol’ అని పేరు పెట్టారు. 2022 నాటికి ఈ కొత్త గేమ్ రెండు అప్ డేట్లతో రిలీజ్ చేయనుంది. పబ్ జీ వరల్డ్ మాదిరిగా ఉంటుంది. స్ట్రయికింగ్ డిస్టాన్స్ స్టూడియోస్ ఈ పబ్ జీ గేమ్ ఎలిమెంట్లను డెవలప్ చేస్తోంది. పబ్‌జీ, పబ్ జీ మొబైల్ రెండు గేమ్‌లను (PUBG 2, PUBG Mobile 2) పేరుతో ప్రవేశపెట్టబోతోంది.

ఇప్పటికే ఈ రెండు గేమ్ లకు సంబంధించి లీక్ లు మొదలయ్యాయి. పబ్ జీ మొబైల్ 2లో కోడ్ నేమ్ ‘Project XTRM’ గా వస్తోందని లీక్ లు బట్టి తెలుస్తోంది. ఈ టెక్నాలజీ పీసీ, గేమింగ్ కన్సోల్స్, మొబైల్ అన్ని ప్లాట్ ఫాంలపై (క్రాస్ ప్లాట్ ఫాం క్యాపబిలిటీ) సపోర్టు చేసేలా డెవలప్ చేస్తున్నారంట. అదనంగా పబ్ జీ, పబ్ జీ మొబైల్ లైట్ వెర్షన్లు కూడా ఈ ఏడాది తర్వాత రిలీజ్ అయ్యే అవకాశం ఉంది.