మే 15 లాస్ట్.. డిస్కౌంట్ ఆఫర్ : PUBG గేమ్.. ‘బాహుబలి’ ఔట్ ఫిట్

ఇండియన్ పబ్ జీ గేమ్ యూజర్ల కోసం దేశీయ ఎలిమెంట్లతో కొత్త ఔట్ ఫిట్ ను విడుదల చేశారు. అదే.. బాహుబలి ఔట్ ఫిట్.

  • Publish Date - May 10, 2019 / 12:20 PM IST

ఇండియన్ పబ్ జీ గేమ్ యూజర్ల కోసం దేశీయ ఎలిమెంట్లతో కొత్త ఔట్ ఫిట్ ను విడుదల చేశారు. అదే.. బాహుబలి ఔట్ ఫిట్.

PUBG .. పరిచయం అక్కర్లేని వీడియో గేమ్. ఇండియాలో పబ్ జీ వీడియో గేమ్ కు ఫుల్ క్రేజ్ ఉంది. ప్రత్యేకించి యూత్ పబ్ జీ మాయలో పడిపోయారు. పబ్ జీ నే ప్రపంచం అనేంతగా. తినకుండైనా ఉంటారేమో.. పబ్ జీ గేమ్ మాత్రం ఆడకుండా ఉండలేరు. ఇటీవల పబ్ జీ మొబైల్ వెర్షన్ లో కొత్త ఔట్ ఫిట్ ఒకటి రిలీజ్ అయింది. ఇండియాలో గేమింగ్ ఇండస్ట్రీకి ఒకప్పుడు పెద్దగా ఆదరణ లేదు. ఎప్పుడైతే దేశంలో 4G డేటా రేట్లు అతి చౌకైన ధరకే అందుబాటులోకి వచ్చాయో మొబైల్ గేమింగ్ ఇండస్ట్రీకి ఎన్నడూలేని క్రేజ్ వచ్చింది.  

అలాంటి PUBG  గేమ్ కారణంగా చెడ్ ప్రభావానికి గురవుతున్నారని, ఇండియాలో వెంటనే ఈ గేమ్ ను బ్యాన్ చేయాలంటూ డిమాండ్ లు వెల్లువెత్తాయి. అయినప్పటికీ పబ్ జీ గేమ్ లవర్స్ దీన్ని వదిలిపెట్టడం లేదు. ఇండియన్ పబ్ జీ Game యూజర్ల కోసం దేశీయ ఎలిమెంట్లతో New Outfit ను విడుదల చేశారు. అదే.. బాహుబలి ఔట్ ఫిట్. ఇండియన్ బ్లాక్ బస్టర్ మూవీ బాహుబలికి ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకించి చెప్పన్కర్లేదు. ఈ మూవీ ఎలిమెంట్లతోనే పబ్ జీ గేమ్ ఔట్ ఫిట్ ను యూజర్లకు అందుబాటులోకి తెచ్చారు. 

డిస్కౌంట్.. లిమిటెడ్ ఆఫర్ :
అదే.. ‘The Great Indian Warrior Outfit’. బాహుబలి తరహాలోనే ఇందులో రెండు పార్టులు ఉన్నాయి. ఒకటి.. ఆర్మడ్ ఔట్ ఫిట్.. రెండోవది హెడ్ గేర్. పబ్ జీ గేమ్ యూజర్లు.. గేమ్ షాప్ సెలక్షన్ నుంచి తమకు నచ్చిన పార్ట్ ను ఎంపిక చేసుకోవచ్చు. బాహుబలి హెడ్ గేర్ ధర 360 UC (Unknown Cash), (చెస్ట్ ఆర్మర్) ఉదర కవచం, మణికట్టు, ఆర్మ్ ప్రొటక్షన్, బాటమ్ వేర్ కావాలంటే 900UC ఖర్చు చేయాలి.  

Head Gear ధర.. లిమిటెడ్ Period Offer తో అందిస్తున్నారు.  బాహుబలి ఇన్స్ పైరడ్.. గేమ్ లాంచ్ చేయగానే కనిపిస్తుంది. అదొక ఇన్ గేమ్ అడ్వర్టైజింగ్. గేమ్ ప్రారంభంలో.. యూజర్లు 25శాతం వరకు డిస్కౌంట్ ఆఫర్ పొందవచ్చు. మొత్తం వారియర్ గేమ్ కొనాలంటే 1,260 UC అవుతుంది. ఈ డిస్కౌంట్ ఆఫర్ మే 15, 2019 వరకే వ్యాలీడ్ ఉంటుంది. 

బాహుబలి ఇన్స్ పైరడ్ కాస్టూమ్స్ ను.. మూవీ మేకర్లతో కలిసి క్రియేట్ చేసినవి కావు. రెసిడెంట్ ఎవిల్ ఇన్స్ పైరడ్ కంటెంట్ తో పబ్ జీ మొబైల్ ను ఇటీవల కొత్తగా ప్రవేశపెట్టారు. పబ్ జీ వీడియో గేమర్స్ ఇండియన్ ఆడియన్స్ టార్గెట్ చేయడం తొలిసారి కాదు. టెన్సెంట్ గేమ్స్ కూడా ఇండియా ఇన్స్ పైరడ్ ఔట్ ఫిట్స్ ను ఈ గేమ్ లో రిలీజ్ చేసింది. 2018లో పబ్ జీ మొబైల్ ట్రేడిషనల్ కుర్తా, పజామాను దీపావళి సందర్భంగా ప్రవేశపెట్టింది. అంతేకాదు.. ఐపీఎల్ సీజన్ కోసం క్రికెట్ జెర్సీలు, ఔట్ ఫిట్స్ ను కూడా పబ్ జీ గేమర్లు రిలీజ్ చేశారు.