Raft indus Electric Scooter: ఒక్కసారి ఛార్జ్ చేస్తే 480 కిలోమీటర్లు ఎలక్ట్రిక్ స్కూటర్

ట్రెండ్ కు తగ్గట్లు ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలు పెరిగిపోతుంది. మార్కెట్లో కనిపిస్తున్న పోటీకి వినియోగదారుడికి ఏ వాహనం కొనుగోలు చేయాలో అర్థం కాని పరిస్థితి.

Raft indus Electric Scooter: ఒక్కసారి ఛార్జ్ చేస్తే 480 కిలోమీటర్లు ఎలక్ట్రిక్ స్కూటర్

Raft Motors

Updated On : September 27, 2021 / 8:00 PM IST

Raft indus Electric Scooter: ట్రెండ్ కు తగ్గట్లు ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలు పెరిగిపోతుంది. మార్కెట్లో కనిపిస్తున్న పోటీకి వినియోగదారుడికి ఏ వాహనం కొనుగోలు చేయాలో అర్థం కాని పరిస్థితి. ఇప్పటికే, ఓలా ఎలక్ట్రిక్, అథర్, బజాజ్, టీవీఎస్ కంపెనీలు మార్కెట్లో తమ మోడల్స్‌ను విడుదల చేసేశాయి. తమకంటూ ప్రత్యేకతను చాటుకున్న మరో కంపెనీ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను తీసుకొచ్చేందుకు రెడీ అయిపోయింది.

రాఫ్ట్ మోటార్స్ అనే కంపెనీ Indus NX పేరుతో మార్కెట్లోకి కొత్త మోడల్ తీసుకురానుంది. నవంబర్ 2, 2021న దీని లాంఛింగ్‌కు ప్లాన్ చేస్తున్నారు. దీనిని ఒక్కసారి చార్జ్ చేస్తే 480 కి.మీ దూరం వెళ్లొచ్చని కంపెనీ వెల్లడించింది. రెండు రకాల మోడ్స్‌తో అందుబాటులోకి వస్తున్న ఈ స్కూటర్.. ఎకో మోడ్, మరొకటి స్పీడ్ మోడ్.

ఎకో మోడ్‌లో(25 కి.మీ/గం) వెళ్తే ఈ స్కూటర్ 550 కిలోమీటర్ల వరకు వెళ్లనుండగా స్పీడ్ మోడ్‌లో(40-45 కి.మీ/గం) వెళ్తే 480 కిలోమీటర్ల వరకు వెళ్లనున్నట్లు కంపెనీ వెల్లడించింది. ఈ స్కూటర్‌ను మూడు వేరియంట్లలో అందుబాటులో ఉండనుంది. వేరియంట్ ను బట్టి ధర మారుతుంది.

………………………………………Amazon : ఈస్ట్ ఇండియా కంపెనీ 2.0 వివాదంపై స్పందించిన అమెజాన్

ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను నార్మల్ చార్జర్ ద్వారా ఫుల్ చార్జ్ చేయడానికి కనీసం 8 నుంచి 24 గంటల సమయం తీసుకుంటుంది. అదే కంపెనీ అందించే ఫాస్ట్ చార్జర్ ద్వారా అయితే 5 గంటల్లో ఫుల్ ఛార్జ్ చేసుకోవచ్చు. రెండు బ్యాటరీలతో ఉండే ఈ స్కూటర్ రివర్స్ మోడ్ కూడా అందుబాటులో ఉంది.

ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ బ్యాటరీ కెపాసిటీ 11.5 కిలోవాట్లు. కాకపోతే గరిష్ఠంగా 50కిలోమీటర్లు/గంటకు మించి వెళ్లలేదు.