Rare Planetary Parade on January 25
Planetary Parade 2025 : ఆకాశంలో మరికొద్దిరోజుల్లో మహా అద్భుతం ఆవిష్కతం కానుంది. ఈ నెల (జనవరి) 25న సౌర వ్యవస్థలో అరుదైన ప్లానెట్ పరేడ్ ఏర్పడనుంది. ఒకే వరుసులోకి ఆరు గ్రహాలు రానున్నాయి. ఈ అరుదైన ఖగోళ దృగ్విషయాన్ని వీక్షించేందుకు అద్భుతమైన అవకాశం.
జీవితంలో ఒకసారి ఆకాశంలో ఆవిష్కృతమయ్యే ఈ అద్భుత ఖగోళ దృశ్యాన్ని ఎవరు మిస్ చేసుకోరు. అమెరికాలో ఆకాశాన్ని వీక్షించేవారికి ఈ అద్భుత ఘట్టం కనువిందు చేయనుంది. మొత్తం 6 గ్రహాలు భూమికి సమాంతర రేఖలో వరుసగా కనిపించనున్నాయి. ఒకే వరుసలో 6 గ్రహాలు కనిపించడాన్ని ప్లానెట్ పరేడ్ అంటున్నారు శాస్త్రవేత్తలు.
Read Also : Saif Ali Khan : అయిదు కార్లు ఉన్నా.. దాడి తర్వాత సైఫ్ అలీఖాన్ ని ఆటోలో హాస్పిటల్ కి తీసుకెళ్లిన తనయుడు..
సైంటిస్టుల ప్రకారం… ఇలాంటి ఘటనలు చాలా అరుదుగా జరుగుతాయి. ఆరు గ్రహాల్లో అంగారకుడు, శుక్రుడు, శని, బృహస్పతి, శని, నెప్ట్యూన్, యురేనస్ రాత్రిపూట ఆకాశంలో ఒకే వరుసలో ఆర్క్ మాదిరిగా కనిపించనున్నాయి. జనవరి అంతటా కనిపించే ఈ ఖగోళ దృశ్యం జనవరి 25న గరిష్ట స్థాయికి చేరుకుంటుంది. మెర్క్యురీ లైనప్‌లో చేరి మరింత అద్భుతంగా కనిపించనుంది.
ప్లానెటరీ పరేడ్ అంటే ఏమిటి? :
భూమి దృక్కోణం నుంచి అనేక గ్రహాలు ఒకే రేఖపై వరుసలో కనిపించడాన్నే ప్లానెటరీ పరేడ్ అని పిలుస్తారు. అంతరిక్షంలో ఈ ఖగోళ దృగ్విషయం పరిశీలకులకు మరింత ఆకర్షణీయంగా కనిపించనుంది. నాసా ప్రకారం.. ఇలాంటి ఖగోళ సంఘటనలు, ముఖ్యంగా నాలుగు లేదా అంతకంటే ఎక్కువ గ్రహాలతో సంబంధం కలిగి ఉంటాయి. ప్రతి సంవత్సరం ఈ తరహా ఖగోళ అద్భుతాలు జరగవు.
యురేనస్, నెప్ట్యూన్‌లను వీక్షించేందుకు టెలిస్కోప్ తప్పనిసరిగా ఉండాలి. ఈ ఆరు గ్రహాలన్నీ ఒకే వరుసలో కనిపిస్తుంటాయి. ఈ గ్రహాల అమరిక సూర్యుడికి ఒకవైపుగా ఆవిష్కృతం కానుంది. ఈ ఖగోళ అద్భుతం 2025లో రెండు సార్లు కనువిందు చేయనుంది. జనవరి 25వ తేదీ, ఫిబ్రవరి 2వ తేదీన ఈ గ్రహాలన్నీ ఒకేవరుసలో కనిపించనున్నాయి.
ప్లానెట్ పరేడ్ వీక్షించేందుకు సమయం, పద్ధతులివే :
ఈ గ్రహాల అమరికను సూర్యాస్తమయం తర్వాత సమయంలో వీక్షించవచ్చు. ఆకాశంలో గ్రహాలను గుర్తించేంత చీకటిగా ఉన్నప్పుడు మాత్రమే వీక్షించవచ్చు. సూర్యాస్తమయానికి కనీసం 30 నిమిషాల ముందు మీరు ఎంచుకున్న ప్రదేశానికి చేరుకోండి.
వ్యూ లొకేషన్ : సిటీ లైట్లకు దూరంగా పశ్చిమ హోరిజోన్ వ్యూ కలిగిన బహిరంగ ప్రాంతంలో స్పష్టంగా వీక్షించవచ్చు.
వీక్షించే పరికరాలు : శుక్రుడు, అంగారకుడు, బృహస్పతి, శని గ్రహాలను కంటితో చూడగలిగినప్పటికీ, బైనాక్యులర్‌లు లేదా టెలిస్కోప్ ద్వారా స్పష్టంగా చూడవచ్చు. ముఖ్యంగా నెప్ట్యూన్, యురేనస్ చూడాలంటే కచ్చితంగా ఈ పరికరాలను ఉపయోగించాలి.
వాతావరణ పరిస్థితుల ఆధారంగా :
గ్రహాలు సరిగా కనిపించాలంటే స్పష్టంగా ఆకాశం కనిపించాలి. ఎంపిక చేసిన అమెరికా నగరాల్లో జనవరి 25, 2025న ఈ ఖగోళ అద్భుతం కనిపించనుంది. న్యూయార్క్, హ్యూస్టన్, చికాగో, ఫీనిక్స్ ప్రాంతాల్లో ఆయా వాతావరణ పరిస్థితులను బట్టి ఈ గ్రహాల అమరికను వీక్షించవచ్చు.
Read Also : 8th Pay Commission : కేంద్ర కేబినెట్లో కీలక నిర్ణయాలు.. 8వ వేతన సంఘం ఏర్పాటు!