Realme 11X 5G at a Special discount of Rs 1000 on Flipkart _ Check Price, offers, and specs
Realme 11X 5G Discount : ప్రముఖ చైనా స్మార్ట్‌ఫోన్ దిగ్గజం రియల్‌మి (Realme) భారతీయ మార్కెట్లో (Realme 11 5G), Realme 11X 5G స్మార్ట్‌ఫోన్‌లను లాంచ్ చేసింది. రియల్‌మి 11 5G ఫోన్ ఇప్పటికే కొనుగోలుకు అందుబాటులో ఉండగా, దేశంలో మొదటిసారిగా రియల్‌మి 11X 5G అమ్మకానికి రానుంది. రియల్‌మి 11X 5G ఫోన్ అత్యంత సరసమైన రియల్‌మి 11 సిరీస్ స్మార్ట్‌ఫోన్, 5G రెడీ MediaTek డైమెన్సిటీ 6100+ ప్రాసెసర్‌తో ఆధారితంగా పనిచేస్తుంది.
రియల్‌మి 11X 5G ఫోన్ 680నిట్స్ పీక్ బ్రైట్‌నెస్, సెంటర్డ్ పంచ్ హోల్ నాచ్‌తో 120Hz LCD డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ 64MP ప్రైమరీ రియర్ కెమెరా, 8MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది. రియల్‌మి 11X 5G ఫోన్ 5000mAh బ్యాటరీ యూనిట్, 33W SuperVOOC ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో వస్తుంది. సెక్యూరిటీ ముందు.. సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్‌ను అందిస్తుంది. భారత మార్కెట్లో రియల్‌మి 11X 5G ఫోన్ ధర, లాంచ్ ఆఫర్‌లు, స్పెసిఫికేషన్‌లు, ఫీచర్‌లు, లభ్యతను పరిశీలిద్దాం.
రియల్‌మి 11X 5G ఫోన్.. ధర, ఆఫర్లు ఎంత? :
భారత మార్కెట్లో రియల్‌మి 11X 5G ఫోన్ ధర 6GB + 128GB కాన్ఫిగరేషన్ ఆప్షన్ ధర రూ. 14,999, హ్యాండ్‌సెట్ 8GB + 128GB వేరియంట్‌లో కూడా వస్తుంది. ఈ ఫోన్ ధర రూ. 15,999కు పొందవచ్చు. లాంచ్ ఆఫర్‌గా HDFC బ్యాంక్, SBI కార్డ్ లావాదేవీలతో రియల్‌మి 11X 5G ఫోన్ కొనుగోలుపై రియల్‌మి ఫ్లాట్ రూ.1000 డిస్కౌంట్ అందిస్తోంది.
రియల్‌మి 11X 5G ఫోన్ (ఆగస్టు 30) మధ్యాహ్నం 12:00 గంటలకు ప్రత్యేకంగా (Flipkart), (Realme) స్టోర్ ద్వారా కొనుగోలుకు అందుబాటులో ఉంటుంది. రియల్‌మి స్టోర్ ద్వారా రియల్‌మి 11X 5G ఫోన్ కొనుగోలుతో 6-నెలల స్క్రీన్ డ్యామేజ్ ప్రొటెక్షన్ (రూ. 699) కూడా అందిస్తోంది.
Realme 11X 5G at a Special discount of Rs 1000 on Flipkart
రియల్‌మి 11X 5G స్పెసిఫికేషన్‌లు, ఫీచర్లు :
డిస్‌ప్లే : 6.72- అంగుళాల LCD డిస్‌ప్లే, ఫుల్ HD+ (2400 × 1080 పిక్సెల్‌లు) రిజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్, 180Hz టచ్ శాంప్లింగ్ రేట్, 680 nits పీక్ బ్రైట్‌నెస్
ప్రాసెసర్ : MediaTek డైమెన్సిటీ 6100+ (TSMC 6nm ప్రాసెస్), Mali G57 GPU.
మెమరీ, స్టోరేజ్ : 6GB / 8GB LPDDR4X RAM, 128GB UFS 2.2 స్టోరేజ్, 8GB డైనమిక్ RAM, (2TB వరకు) (డెడికేటెడ్ స్లాట్) మైక్రో SD కార్డ్ స్టోరేజీ
సాఫ్ట్‌వేర్ : Realme UI 4.0, Android 13 ఆధారంగా
కెమెరాలు : 64MP ప్రైమరీ కెమెరా, 2MP పోర్ట్రెయిట్ కెమెరా, LED ఫ్లాష్
ఫ్రంట్ కెమెరా : 8MP సెల్ఫీ కెమెరా
బ్యాటరీ – ఛార్జింగ్ : 5000mAh బ్యాటరీ, 33W SuperVOOC ఫాస్ట్ ఛార్జింగ్, USB టైప్-C పోర్ట్
భద్రత : సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్
ఆడియో : హై-రెస్ ఆడియో, 3.5mm ఆడియో జాక్
కొలతలు : 165.7 × 76 × 7.89 మి.మీ
బరువు : 190 గ్రాములు
కనెక్టివిటీ : 5G, Wi-Fi 802.11ac, బ్లూటూత్ 5.2, GPS, గ్లోనాస్, గెలీలియో, బీడౌ
కలర్ ఆప్షన్లు : పర్పుల్ డాన్, మిడ్నైట్ బ్లాక్
రియల్‌మి 11X 5G ఫోన్‌కు పోటీగా.. :
రియల్‌మి 11X 5G ఫోన్ దేశంలో ప్రస్తుతం అందుబాటులో ఉన్న 5G రెడీ స్మార్ట్‌ఫోన్‌లలో ఒకటి. అయితే, Redmi 12 5G, POCO M6 Pro 5G, Lava Blaze 2 వంటి నుంచి గట్టి పోటీని ఎదుర్కొంటుంది.