Realme P1 5G Launch : రియల్‌మి P1 5జీ ఫోన్ వచ్చేస్తోంది.. ఈ నెల 15నే ఎర్లీ బర్డ్ సేల్.. ఏయే ఫీచర్లు ఉండొచ్చుంటే?

Realme P1 5G Launch : రియల్‌మి ఈ నెల 15న ఎర్లీ బర్డ్ సేల్ సందర్భంగా రియల్‌మి P1 5Gని లాంచ్ చేస్తోంది. ఈ కొత్త ఫోన్‌లో మీడియాటెక్ డైమెన్సిటీ 7050 చిప్, 6.67-అంగుళాల అమోల్డ్ డిస్‌ప్లే ఉన్నాయి.

Realme P1 5G Launch : ప్రముఖ చైనా స్మార్ట్‌‌ఫోన్ దిగ్గజం రియల్‌మి నుంచి కొత్త 5జీ ఫోన్ రియల్‌మి P1 ఫోన్ లాంచ్ చేయనుంది. ఈ ఫోన్‌తో పాటు, రియల్‌మి ప్యాడ్ 2, రియల్‌మి వైర్‌లెస్ ఇయర్‌బడ్స్‌ను కూడా లాంచ్ చేయనుంది. రియల్‌మి ఈ ఏప్రిల్ 15న సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు లాంచ్ ఈవెంట్ జరుగనుంది.

Read Also : Amazon Mega Electronics Days Sale : అమెజాన్ మెగా ఎలక్ట్రానిక్స్ డేస్ సేల్.. ల్యాప్‌ట్యాప్స్, స్మార్ట్‌వాచ్, హెడ్ ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!

ఈ ఫోన్ ఫస్ట్ సేల్ (realme.com, Flipkart) రెండింటిలోనూ ప్రారంభ యూజర్ల కోసం ఎర్లీ బర్డ్ సేల్ నిర్వహించనుంది. ఈ సేల్ సమయంలో వినియోగదారులు రియల్‌మి P1 5జీ వివిధ వెర్షన్‌ల ధర రూ. 2వేల వరకు విలువైన కూపన్‌లను పొందవచ్చు.

3డీ వీసీ కూలింగ్ సిస్టమ్ ఫీచర్ :
రియల్‌మి కొత్త ‘పి’ సిరీస్‌ని ప్రవేశపెడుతోంది. రియల్‌మి P1 5జీతో ప్రారంభమవుతుంది. ఈ ఫోన్ 6ఎన్ఎమ్ ప్రాసెస్‌ని ఉపయోగించి నిర్మించిన మీడియాటెక్ డైమన్షిటీ 7050 చిప్‌తో వస్తుంది. రియల్‌మి ప్రకారం.. ఈ చిప్ (Antutu)లో 603కె బెంచ్‌మార్క్ స్కోర్‌తో హై పర్ఫార్మెన్స్ అందిస్తుంది. అన్నింటికీ తక్కువ పవర్ అందిస్తుంది. ఇందులో ప్రత్యేక ఫీచర్లలో 3డీ వీసీ కూలింగ్ సిస్టమ్ ఒకటిగా చెప్పవచ్చు. ఇందులో స్టెయిన్‌లెస్ స్టీల్ స్టీమ్ రూమ్, గ్రాఫైట్ కూలింగ్, హీటింగ్ సమర్థవంతంగా నిర్వహించడానికి మల్టీ లేయర్ డిజైన్ ఉన్నాయి.

రియల్‌మి P1 5జీ ఫోన్ 120హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్, ఎఫ్‌హెచ్‌డీ+ రిజల్యూషన్‌తో 6.67-అంగుళాల అమోల్డ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. అద్భుతమైన వ్యూ ఎక్స్‌పీరియన్స్ అందిస్తుంది. మరోవైపు, రియల్‌మి P1 ప్రో 5జీ ఫోన్ 4ఎన్ఎమ్ క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 6 జనరేషన్ 1 5జీ చిప్, అదే మాదిరి అడ్వాన్సడ్ కూలింగ్ సిస్టమ్‌తో వస్తుంది. అయితే, రియల్‌మి P1 ప్రో 5జీ ఫోన్ గురించి ఇంకా మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

అతి త్వరలో P సిరీస్ వివరాలు :
రియల్‌మి వైస్ ప్రెసిడెంట్ చేజ్ జు ‘పి’ సిరీస్‌లో P అంటే పవర్ అని హైలైట్ చేశారు. మిడ్-రేంజ్ మార్కెట్‌లో ఫోన్ పర్ఫార్మెన్స్, డిజైన్ రెండింటిలోనూ పోటీదారులను అధిగమించడమే ఈ సిరీస్ లక్ష్యమన్నారు. కచ్చితమైన ధరలు ఇంకా వెల్లడి కానప్పటికీ, మిడ్-రేంజ్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌ను నడిపించడమే రియల్‌మి లక్ష్యంగా పెట్టుకుందని జు చెబుతున్నారు. భారత్‌లో ఫ్లిప్‌కార్ట్‌లో కొనుగోలు చేసేందుకు రియల్‌‌మి P1 ప్రో, రియల్‌మి P1 అందుబాటులో ఉంటాయి. కొన్ని ఆఫ్‌లైన్ స్టోర్‌లు కూడా ఈ మోడల్‌లను కలిగి ఉండవచ్చు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి.

Read Also : Automatic EPF Transfer : ఉద్యోగం మారుతున్నారా? పీఎఫ్ ఖాతాదారులు ఇకపై ఈపీఎఫ్ ఆటోమేటిక్ అకౌంట్ ట్రాన్స్‌‌ఫర్ చేయొచ్చు!

ట్రెండింగ్ వార్తలు