Automatic EPF Transfer : ఉద్యోగం మారుతున్నారా? పీఎఫ్ ఖాతాదారులు ఇకపై ఈపీఎఫ్ ఆటోమేటిక్ అకౌంట్ ట్రాన్స్‌‌ఫర్ చేయొచ్చు!

Automatic EPF Transfer : కొత్త కంపెనీలో చేరే ఉద్యోగులు తమ పీఎఫ్ అకౌంట్‌ మాన్యువల్‌గా బ్యాలెన్స్ చేయక్కర్లేదు. పీఎఫ్ బ్యాలెన్స్ కోసం ఇప్పుడు ఆటోమేటిక్ ట్రాన్స్‌ఫర్ సిస్టమ్ వచ్చేసింది. ఉద్యోగులకు ఎంతవరకు ప్రయోజనకరమంటే?

Automatic EPF Transfer : ఉద్యోగం మారుతున్నారా? పీఎఫ్ ఖాతాదారులు ఇకపై ఈపీఎఫ్ ఆటోమేటిక్ అకౌంట్ ట్రాన్స్‌‌ఫర్ చేయొచ్చు!

Automatic EPF account transfer : How it will benefit employees

Automatic EPF Transfer : మీరు ఉద్యోగం మారారా? అయితే, మీ పాత పీఎఫ్ అకౌంట్ బ్యాలెన్స్ ట్రాన్స్‌ఫర్ పెట్టుకున్నారా? ఇకపై మీరు మాన్యువల్‌‌గా బ్యాలెన్స్ ట్రాన్స్‌ఫర్ చేయాల్సిన పనిలేదు. ఎందుకంటే.. ఉద్యోగాలు మారే ఉద్యోగులకు ప్రావిడెంట్ ఫండ్ (పీఎఫ్) బ్యాలెన్స్‌లను బదిలీ చేసే ప్రక్రియను క్రమబద్ధీకరించేందుకు ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్‌ఓ) కొత్త విధానాన్ని ప్రవేశపెట్టింది. ఇంతకుముందు, పీఎఫ్ ఖాతాదారులు తమ కొత్త కంపెనీలోని అకౌంట్‌కు తమ పాత పీఎఫ్ బ్యాలెన్స్‌ను బదిలీ చేయమని మాన్యువల్‌గా అభ్యర్థించాల్సి ఉండేంది. కానీ, ఇప్పుడు, ఆటోమేటిక్ ట్రాన్స్‌ఫర్ సిస్టమ్‌ వచ్చేసింది.

Read Also : EPF Passbook Balance : మీ పీఎఫ్ అకౌంట్లో పాస్‌బుక్ బ్యాలెన్స్‌ని ఎలా చెక్ చేయాలో తెలుసా? ఇదిగో సింపుల్ ప్రాసెస్..!

ఈ కొత్త విధానం ద్వారా ఉద్యోగి నుంచి ఎలాంటి అభ్యర్థన లేకుండానే కొత్త కంపెనీలోని పీఎఫ్ అకౌంట్లో బ్యాలెన్స్ సజావుగా క్రెడిట్ అవుతుంది. ఈపీఎఫ్ఓలో అకౌంట్లు కలిగిన ఈపీఎఫ్ సభ్యులకు మాత్రమే ఈ సౌకర్యం ప్రత్యేకంగా అందుబాటులో ఉంటుంది. అయితే, మినహాయింపు పొందిన పీఎఫ్ ట్రస్ట్‌లు ఆటోమేటిక్ ఈపీఎఫ్ ట్రాన్స్‌ఫర్ విధానానికి అర్హత కలిగి ఉండవు. ఈ సర్వీసును సమర్ధవంతంగా వినియోగించుకోవాలంటే పాత, కొత్త ఈపీఎఫ్ అకౌంట్లు రెండూ ఈపీఎఫ్ఓతో రన్ అవుతున్నాయని నిర్ధారించుకోవాలి. ఆ తర్వాతే ఈ ప్రాసెస్ పూర్తవుతుంది.

ఈ సర్వీసు గురించి తెలుసుకోవాల్సిన ముఖ్య విషయాలివే :
యూఏఎన్ అండ్ ఆధార్ నంబర్ : కొత్త కంపెనీ అందించిన యూఏఎన్ (యూనివర్సల్ అకౌంట్ నంబర్), ఆధార్ నంబర్ ఈపీఎఫ్ఓ ​​డేటాబేస్‌లో స్టోర్ అయిన వివరాలతో సరిపోలాలి. అంతేకాదు.. పీఎఫ్ ఖాతాదారుడి ఆధార్ నంబర్ తప్పనిసరిగా సీడ్ అయి ఉండాలి. గత కంపెనీలో పనిచేసిన యూఏఎన్‌తో ధృవీకరించి ఉండాలి. పీఎఫ్ ఖాదారుడి వివరాల్లో కంపెనీలో చేరిన తేదీ, రిజైన్ చేసిన తేదీ, రిజైన్ కారణం వంటి వివరాలు గత కంపెనీ దగ్గర ఉండాలి.

మాన్యువల్ రిక్వెస్ట్ కోసం ఫారమ్ 13 తప్పనిసరి :
అంతేకాదు.. యూఏఎన్ నెంబర్ తప్పకుండా యాక్టివేట్ అయి ఉండాలి. దాంతో ఇంటిగ్రేట్ చేసిన మొబైల్ నంబర్ వర్క్ చేస్తుండాలి. ఒక ఉద్యోగి కొత్త ఉద్యోగంలో చేరినప్పుడు కొత్త కంపెనీలోని ప్రారంభ పీఎఫ్‌ అకౌంట్ సహకారంతో ఆటోమేటిక్ ట్రాన్స్‌ఫర్ అవుతుంది. అయితే, ఈ సమయంలో సరిపోలని వివరాలు లేదా పెండింగ్‌లో ఉన్న ఆధార్ సీడింగ్ వంటి సమస్యలు ఉంటే.. ఆ ఉద్యోగి ఫారమ్ 13ని ఉపయోగించి మాన్యువల్ ట్రాన్స్‌ఫర్ ఆప్షన్ ఎంచుకోవచ్చు. ఆటోమాటిక్ ట్రాన్స్‌ఫర్ ప్రారంభించిన తర్వాత ఈపీఎఫ్ సభ్యుడు ఎస్ఎంఎస్, ఇమెయిల్ నోటిఫికేషన్‌లను అందుకుంటారు. ఏకీకృత పోర్టల్‌లో వారి పాస్‌బుక్ ద్వారా ట్రాన్స్‌ఫర్ పూర్తయినట్లు ధృవీకరించాల్సి ఉంటుంది.

అకౌంట్లు మారినా యూఏఎన్ నెంబర్ ఒకటే :
ఒకసారి పీఎఫ్ అకౌంట్ ట్రాన్స్‌ఫర్ అయిన తర్వాత పాత అకౌంట్లోని మొత్తం బ్యాలెన్స్ అమౌంట్ పాస్‌బుక్‌లో క్రెడిట్ అవుతుంది. యూనివర్సల్ అకౌంట్ నంబర్ (UAN) అనేది ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్ (EPF)కి అందించే ప్రతి ఉద్యోగికి కేటాయించిన కీలకమైన గుర్తింపు సంఖ్య. ఈ 12-అంకెల విశిష్ట సంఖ్య ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) ద్వారా రూపొందించగా.. కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ ద్వారా అథెంటికేషన్ పొందింది.

యూఏఎన్ కీలక ఫీచర్లలో ఒకటి.. ఒక వ్యక్తి వారి కెరీర్‌లో ఎన్నిసార్లు ఉద్యోగాలు మార్చుకున్నా లేదా కొత్త సంస్థల్లో చేరినా యూఎఎన్ నెంబర్ ఎప్పటికీ ఒకటే ఉంటుంది. ఉద్యోగులు, కంపెనీ మధ్య ఇద్దరికీ ప్రక్రియను సులభతరం చేస్తుంది. ఈపీఎఫ్ సహకారాలు, ప్రయోజనాల కోసం ట్రాన్స్‌‌ఫర్ చేసిన తర్వాత ట్రాకింగ్ చేసేందుకు కూడా అనుమతిస్తుంది.

Read Also : Meta AI Chatbot : ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్‌లోనూ మెటా ఏఐ చాట్‌బాట్‌.. పరిమిత యూజర్లకు మాత్రమే..!