Realme C100 5G : కిర్రాక్ ఫోన్ భయ్యా.. 7,000mAh బ్యాటరీతో రియల్‌మి C100 5G వచ్చేసింది.. ఫీచర్లు అదుర్స్, ధర ఎంతంటే?

Realme C100 5G : ఈ రియల్‌మి స్మార్ట్‌ఫోన్‌లో ఎఫ్/1.8 అపర్చర్‌తో 50MP సింగిల్ రియర్ కెమెరా ఉంది. ఫ్రంట్ సైడ్ సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 5MP కెమెరా కూడా ఉంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

Realme C100 5G

  • రియల్‌మి C100 5G థాయ్‌లాండ్‌లో లాంచ్
  • ఆటోఫోకస్‌తో 50MP సింగిల్ రియర్ కెమెరాతో వస్తుంది
  • మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్‌ అందిస్తుంది

Realme C100 5G : కొత్త రియల్‌మి ఫోన్ కొనేందుకు ప్లాన్ చేస్తున్నారా? చైనాకు తయారీదారు రియల్‌మి నుంచి సరికొత్త 5జీ ఫోన్ వచ్చేసింది. రియల్‌మి C సిరీస్‌లో ఈ కొత్త స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసింది. రియల్‌మి C100 5జీ ఫోన్ ఆక్టా-కోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 6300 చిప్‌సెట్‌తో రన్ అవుతుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లోని 7,000mAh బ్యాటరీ, 45 వాట్ల వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. ఈ 5జీలో ఆటోఫోకస్‌తో 50MP సింగిల్ రియర్ కెమెరా ఉంది.

సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 5MP ఫ్రంట్ కెమెరా కూడా ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్‌తో 6.8-అంగుళాల హెచ్‌డీ+ (720 x 1,570 పిక్సెల్స్) ఎల్‌సీడీ టచ్‌స్క్రీన్ ఉంది. మీడియాటెక్ డైమెన్సిటీ 6300 చిప్‌సెట్‌తో రన్ అవుతుంది. ఈ స్మార్ట్‌ఫోన్ 1,080p, 30fps వద్ద వీడియోను రికార్డ్ చేయగలదు. సేఫ్టీ కోసం సైడ్-మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ స్కానర్ ఉంది.

రియల్‌మి C100 5G ధర ఎంతంటే? :
ఈ స్మార్ట్‌ఫోన్ థాయ్‌లాండ్‌లో లాంచ్ అయింది. రియల్‌మి C100 5జీ ఫోన్ 4జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర టీహెచ్‌బీ 6,999 (సుమారుగా రూ. 20,000) కాగా, 6జీబీ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర టీహెచ్‌బీ 7,499 (సుమారుగా రూ. 21,400)గా ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ పర్పుల్, గ్రీన్ కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. రియల్‌మి సీ100 5జీ ఏప్రిల్ 22 నుంచి థాయ్‌లాండ్‌లో వివిధ ఇ-కామర్స్ ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా అందుబాటులోకి వస్తుంది.

Read Also : Tesla Mall Charging Station : టెస్లా కొత్త ఇన్-మాల్ ఛార్జింగ్ స్టేషన్ ఇదిగో.. జస్ట్ 15 నిమిషాల్లో ఈవీ కార్లు ఛార్జ్ చేస్తుంది.. ముంబైలో ఎక్కడంటే?

రియల్‌మి సీ100 5జీ స్పెసిఫికేషన్లు, ఫీచర్లు :
ఈ డ్యూయల్ సిమ్ స్మార్ట్‌ఫోన్‌లో 6.8-అంగుళాల HD+ (720×1,570 పిక్సెల్స్) ఎల్సీడీ టచ్‌స్క్రీన్ ఉంది. రిఫ్రెష్ రేట్ 144Hz, టచ్ రెస్పాన్స్ రేట్ 180Hz, పిక్సెల్ డెన్సిటీ 256ppi, టాప్ బ్రైట్ నెస్ 900 నిట్స్ అందిస్తుంది.

మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్‌తో రన్ అవుతుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో ఎఫ్/1.8 అపర్చర్‌తో 50MP సింగిల్ కెమెరా ఉంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 5MP ఫ్రంట్ కెమెరా ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ 1,080p, 30fps వద్ద వీడియోలను రికార్డ్ చేయగలదు.

కనెక్టివిటీ ఆప్షన్లలో 4జీ, 5జీ, Wi-Fi, బ్లూటూత్, జీపీఎస్, BeiDou, USB టైప్-సీ పోర్ట్, 3.5mm ఆడియో జాక్ ఉన్నాయి. రియల్‌మి సీ100 5జీ 7,000mAh బ్యాటరీ 45W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టు ఇస్తుంది. సేఫ్టీ కోసం ఇందులో సైడ్-మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ స్కానర్ ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ కొలతలు 166.47×78.23×8.88mm, బరువు సుమారుగా 224 గ్రాములు ఉంటుంది.