Realme GT 2 : వారెవ్వా.. ఇది కదా డిస్కౌంట్.. ఈ రియల్‌మి ట్రిపుల్ కెమెరా ఫోన్ భారీగా తగ్గిందోచ్.. ఏకంగా రూ. 15వేలు డిస్కౌంట్!
Realme GT 2 : రియల్‌మి జీటీ 2 ఫోన్ భారీ డిస్కౌంట్ ధరకే కొనేసుకోవచ్చు. 5,000mAh బ్యాటరీ ఆప్షన్, ట్రిపుల్ కెమెరా ఆప్షన్లు అత్యంత ఆకర్షణీయంగా ఉన్నాయి. ఈ ఫోన్ ధర ఎంత తగ్గిందంటే?
- Sreehari A
- Published on- May 3, 2026 / 04:10 PM IST
Realme GT 2
- రియల్‌మి జీటీ 2 ఫోన్‌లో 6.62-అంగుళాల ఫుల్-HD+ అమోల్డ్ డిస్‌ప్లే
- ఈ ఫోన్‌లో 5,000mAh బ్యాటరీ ఆప్షన్, ట్రిపుల్ కెమెరా ఆప్షన్లు
- రియల్‌మి జీటీ 2లో 256GB వరకు యూఎఫ్ఎస్ 3.1 స్టోరేజ్
Realme GT 2 : రియల్‌మి జీటీ 2 భారీ తగ్గింపుతో లభిస్తోంది. ఈ ఫోన్ కంపెనీ పాపులర్ లో-మిడ్‌రేంజ్ స్మార్ట్‌ఫోన్‌లలో ఒకటి. రియల్‌మి జీటీ 2 ఫోన్ 2022లోనే లాంచ్ అయింది. ఈ ఫోన్ అసలు ధర రూ. 39,999గా ఉంది.
కానీ, ప్రస్తుతం భారీ తగ్గింపుతో లభిస్తోంది. ఈ రియల్‌మి ఫోన్ 38శాతం తగ్గింపుతో లభిస్తోంది. అసలు (Realme GT 2) ధర కన్నా రూ. 15వేలు తక్కువకే అందుబాటులో ఉంది. ఈ ఫోన్‌పై అద్భుతమైన ఆఫర్ల గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
రియల్‌మి జీటీ 2 తగ్గింపు ధర ఆఫర్ :
రియల్‌మి జీటీ 2 ఫోన్ అతి తక్కువ ధరకే లభిస్తోంది. ఈ ఫోన్ ఫ్లిప్‌కార్ట్‌లో 38శాతం తగ్గింపుతో లభిస్తోంది. ఈ ఫోన్ అసలు ధర రూ. 39,999 కాగా, ఫ్లిప్‌కార్ట్‌లో రూ. 24,999కే లభిస్తోంది. ఇందులో 8జీబీ ర్యామ్, 128GB స్టోరేజ్ వేరియంట్ సొంతం చేసుకోవచ్చు.
ఈ ఫోన్‌పై కంపెనీ నేరుగా రూ. 15వేలు డిస్కౌంట్ అందిస్తోంది. ఈ ఫోన్‌ను ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ద్వారా కొనుగోలు చేస్తే అదనంగా రూ. 1250 ఆదా చేసుకోవచ్చు. ఆ తర్వాత రియల్‌మి ఫోన్ ధర రూ. 23,749కు కొనేసుకోవచ్చు.
రియల్‌మి జీటీ 2 స్పెసిఫికేషన్లు :
రియల్‌మి జీటీ 2లో 120Hz రిఫ్రెష్ రేట్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్‌తో 6.62-అంగుళాల ఫుల్-HD+ (1,080×2,400 పిక్సెల్స్) అమోల్డ్ డిస్‌ప్లే ఉంది. ఆక్టా-కోర్ స్నాప్‌డ్రాగన్ 888 ప్రాసెసర్‌తో రన్ అవుతుంది. 12GB వరకు LPDDR5 ర్యామ్ కూడా ఉంది.
ఇందులో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఎఫ్/1.8 లెన్స్‌తో 50MP ప్రైమరీ కెమెరా ఉంది. ఈ ప్రైమరీ కెమెరా ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS)కు సపోర్ట్ చేస్తుంది. ఇందులో వైడ్-యాంగిల్, మాక్రో కెమెరాలు ఉన్నాయి. అలాగే ఇందులో 16MP సెల్ఫీ కెమెరా కూడా ఉంది.
రియల్‌మి జీటీ 2లో 256GB వరకు యూఎఫ్ఎస్ 3.1 స్టోరేజ్ ఉంది. కనెక్టివిటీ ఆప్షన్లలో 5జీ, 4జీ ఎల్టీఈ, వై-ఫై 6, బ్లూటూత్ v5.2, జీపీఎస్, ఎ-జీపీఎస్, ఎన్‌ఎఫ్‌సీ, యూఎస్‌బీ టైప్-సీ పోర్ట్ ఉన్నాయి. ఇందులో ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్ కూడా ఉంది.
రియల్‌మి ఫోన్‌లో 5,000mAh బ్యాటరీ ఉంది. 65W సూపర్‌డార్ట్ ఛార్జ్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీకి సపోర్టు ఇస్తుంది. ఈ ఫోన్‌ను 33 నిమిషాల్లో జీరో నుంచి 100 శాతం వరకు ఛార్జ్ చేస్తుందని కంపెనీ పేర్కొంది. ఈ ఫోన్ బరువు 199.8 గ్రాములు ఉంటుంది.
