Realme GT 7 Launch : రియల్‌మి ఫ్యాన్స్ రెడీగా ఉన్నారా? ఈ నెల 27నే కొత్త రియల్‌మి GT 7 ఫోన్ లాంచ్.. ఫీచర్లు, ధర వివరాలివే..!

Realme GT 7 Launch : కొత్త రియల్‌మి ఫోన్ వచ్చేస్తోంది. రియల్‌మి GT 7 సిరీస్ లాంచ్ కానుంది. భారత మార్కెట్లో ఈ నెల 27న రిలీజ్ చేయనుంది.

Realme GT 7 Launch

Realme GT 7 Launch : కొత్త రియల్‌మి ఫోన్ కొంటున్నారా? భారత్ సహా ప్రపంచ మార్కెట్లో రియల్‌మి GT 7 సిరీస్ (Realme GT 7 Launch) లాంచ్ తేదీని రియల్‌మి అధికారికంగా ప్రకటించింది.

Read Also : PM Kisan : పీఎం కిసాన్ రైతులకు బిగ్ అలర్ట్.. 20వ విడత రాకముందే కొత్త మార్పు.. రూ.2వేలు పడాలంటే ఇలా చేయాల్సిందే..!

ఈ లైనప్‌లో రెండు మోడళ్లు రియల్‌మి GT 7, రియల్‌మి GT 7T ఈ నెల (మే) 27న పారిస్‌లో జరిగే లాంచ్ ఈవెంట్‌లో ఆవిష్కరించనుంది. రియల్‌మి GT 7 డిజైన్, కీలక స్పెసిఫికేషన్‌లను కంపెనీ ఇప్పటికే టీజ్ చేయగా GT 7T గురించి పూర్తి వివరాలు ఇంకా రివీల్ చేయలేదు.

గత డిసెంబర్‌లో లాంచ్ అయిన రియల్‌మి GT 7 ప్రోలో ఈ హ్యాండ్‌సెట్‌లు చేరనున్నాయి. రాబోయే రియల్‌మి GT 7 సిరీస్ గురించి మరిన్ని వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.

భారత్‌లో రియల్‌మి GT 7 ధర, లభ్యత :
భారత మార్కెట్లో రియల్‌మి GT 7 అమెజాన్ ద్వారా అందుబాటులో ఉంటుంది. ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్ స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్‌లను మైక్రోసైట్‌‌లో రివీల్ చేసింది. అయితే, ధరపై ఇంకా అధికారిక వివరాలు వెల్లడించలేదు.

ముఖ్యంగా, భారత మార్కెట్లో రియల్‌‌మి GT 6 రూ.40,999 ప్రారంభ ధరతో లాంచ్ అయింది. ఈ ఫోన్ ధర రూ.40వేలు నుంచి రూ.45వేల మధ్య ధర ఉంటుందని భావిస్తున్నారు.

రియల్‌మి GT 7 స్పెసిఫికేషన్లు :
రాబోయే రియల్‌మి GT 7 గ్రాఫేన్ ఆధారిత ఐస్‌సెన్స్ డిజైన్‌ను కలిగి ఉండొచ్చు. ఈ ఫోన్ ఐస్‌సెన్స్ బ్లూ, ఐస్‌సెన్స్ బ్లాక్ అనే 2 కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంటుంది.

6 గంటల వరకు 120fps BGMI గేమ్‌ప్లేను అందిస్తుందని కంపెనీ పేర్కొంది. అదనంగా, ఈ హ్యాండ్‌సెట్‌లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్, భారీ కెమెరా ఐలాండ్ ఫ్లాష్ కలిగి ఉంటుంది.

Read Also : Samsung Galaxy S25 Edge : శాంసంగ్ లవర్స్‌ కోసం కొత్త గెలాక్సీ S25 ఎడ్జ్ ఫోన్.. మే 13నే లాంచ్.. ఫీచర్లు, స్పెషిఫికేషన్లు ఇవేనా?

పవర్, వాల్యూమ్ బటన్లు రైట్ ప్యానెల్‌లో ఉంటాయి. స్పీకర్ గ్రిల్స్, USB పోర్ట్ కింది భాగంలో చూడవచ్చు. ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో భారీ బ్యాటరీ కలిగి ఉంటుందని కంపెనీ సూచించింది. రాబోయే రోజుల్లో ఈ ఫోన్ గురించి మరిన్ని వివరాలను రియల్‌మి వెల్లడించే అవకాశం ఉంది.